చవితి
చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో నాలుగవ తిథి చవితి లేదా చతుర్థి. అధి దేవత - వినాయకుడు.
చవితి నిర్ణయం
మార్చుధర్మ సింధు[1] ప్రకారం గణేశ వ్రతాతిరిక్తమైన ఉపవాస వ్రతాలలో పంచమీయుక్తమైన చవితి తిథి ఉపయుక్తము. గౌరీ వ్రతానికి - వినాయక వ్రతానికి మధ్యాహ్న వ్యాప్తి ముఖ్యం. రెండు రోజులు తిథి పడినప్పుడు మధ్యాహ్మ వ్యాప్తి ఉన్నా - లేకపోయినా, ఏకదేశ వ్యాప్తి ఉన్నాగాని తదియచేత కలిసి ఉన్నందున పూర్వదినాన్నే గ్రహించాలి. అయితే నాగచతుర్థి విషయమై పూర్వదినమున మధ్యాహ్న వ్యాప్తి ఉంటే పూర్వదినమునే గ్రహించాలి.
ముఖ్యమైన పండుగలు
మార్చు- భాద్రపద శుద్ధ చవితి - వినాయక చవితి
- కార్తీక శుద్ధ చవితి - నాగుల చవితి
- మాఘ శుద్ధ చతుర్థి - వరచతుర్థి లేదా కుందచతుర్థి
- ఫాల్గుణ శుద్ధ చతుర్థి - పుత్రగణపతీ వ్రతం
మూలాలు
మార్చు- ↑ చవితి నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 51.