చాడ వెంకట్ రెడ్డి

చాడ వెంకట్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ ఎమ్మెల్యే. ఆయన 2014 నుండి 2022 సెప్టెంబర్ 8 వరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశాడు.[1]

చాడ వెంకట్ రెడ్డి
చాడ వెంకట్ రెడ్డి


2004 - 2009
నియోజకవర్గం హుస్నాబాద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 1960
పెద్దమ్మపల్లి రేకొండ గ్రామం, చిగురుమామిడి మండలం, కరీంనగర్ జిల్లా
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)
నివాసం హైదరాబాద్

జననం, విద్యాభాస్యం మార్చు

చాడ వెంకట్ రెడ్డి 1960లో తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా , చిగురుమామిడి మండలం , పెద్దమ్మపల్లి రేకొండ గ్రామం లో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి బిఎ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

చాడ వెంకట్ రెడ్డి 2004లో హుస్నాబాద్‌ నియోజకవర్గం నుండి సి.పి.ఐ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి 4వ స్థానంలో నిలిచాడు. చాడ వెంకట్ రెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఆయన 2018లో మహాకూటమిలో భాగంగా సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి ఒడిత‌ల స‌తీష్ కుమార్ చేతిలో ఓటమిపాలై రెండో స్థానంలో నిలిచాడు.[2][3]

మూలాలు మార్చు

  1. Mana Telangana (9 October 2017). "కెసిఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలె". Archived from the original on 13 August 2021. Retrieved 13 August 2021.
  2. Sakshi (15 November 2018). "సీపీఐ అభ్యర్థులు." Archived from the original on 13 August 2021. Retrieved 13 August 2021.
  3. News18 (2018). "Husnabad Assembly constituency (Telangana): Full details, live and past results". Archived from the original on 13 August 2021. Retrieved 13 August 2021.