చామరం హిందూ దేవాలయాలలో కొన్ని పూజా సమయాలలో దేవునికి వింజామర లాగ వీచే ఉపకరణం. కొన్ని సేవలలో భక్తుల చేత కూడా వీనితో విసరమని చెబుతారు. దీనిని పొడవైన తెల్లని లేదా లేత గోధుమ రంగులో ఉండే మెత్తని వెంట్రుకలతో తయారుచేస్తారు. ఈ వెండ్రుకలు చమరీ మృగం తోకభాగం నుండి తీస్తారు. పట్టుకోవడానికి అనువుగా వెండితో చేసిన పిడి ఉంటుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=చామరం&oldid=2954100" నుండి వెలికితీశారు