చార్ కమాన్
చార్ కమన్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చారిత్రక కట్టడాలు.[1] 1592లో చార్మినార్ కమాన్, కాలీ కమాన్, మచిలీ కమాన్, షేర్ ఏ బాతుల్ పేరుతో 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఇడో పర్షియన్ పద్ధతిలో చార్మినారుకు నాలుగు వైపులా కమాన్‌లు నిర్మించడం జరిగింది.[2]
నిర్మాణం
మార్చు1551లో మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో చార్మినారు నిర్మాణం జరిగింది. ఆ మరుసటి సంవత్సరం అనగా 1552లో చార్మినారుకు నాలుగు వైపులా చార్మినార్ కమాన్, కాలీ కమాన్, మచిలీ కమాన్, షేర్ ఏ బాతుల్ కమాన్ అనే పేరుతో నాలుగు కమాన్లను నిర్మించారు. వీటిని చార్ కమాన్ లు అని పిలుస్తారు. 60 అడుగుల ఎత్తుతో, 30 అడుగుల వెడల్పుతో ఇడో పర్షియన్ పద్ధతిలో ఈ కమాన్‌ల నిర్మాణం జరిగింది.[3][4]
వారసత్వ సంపదగా గుర్తింపు
మార్చుచార్మినారుతో పాటు హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ నాలుగు కమాన్లను భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ చారిత్రక వారసత్వ కట్టడంగా గుర్తించింది.[5]
ఇతర వివరాలు
మార్చుచారిత్రక వారసత్వ సంపదైన చార్ కమాన్లను పునరుద్దరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం ప్రత్యేకంగా రూ. 87లక్షలు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కేటాయించింది. ఈ కమాన్లపై విచ్చలవిడిగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను, మేకులను తొలగించడం, పక్కన ఉన్న షాపులను తరలించడంతోపాటూ పెచ్చులు ఊడిన కమాన్లకు మరమ్మతులు కలరింగ్ పనులు జరిగాయి.
మూలాలు
మార్చు- ↑ Henry, Nikhila (2011-07-10). "Char kaman in Old City faces monumental neglect - Times Of India". Times of India. Retrieved 12 December 2018.
- ↑ "Andhra Pradesh / Hyderabad News : Charminar pedestrianisation a far cry?". Chennai, India: The Hindu. 2010-07-01. Archived from the original on 2010-07-07. Retrieved 12 December 2018.
- ↑ నమస్తే తెలంగాణ (11 April 2018). "నగరంలో హెరిటేజ్ నిర్మాణాలకు పూర్వ వైభవం". Archived from the original on 12 December 2018. Retrieved 12 December 2018.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ రాజధాని వార్తలు (12 April 2018). "వారసత్వ కట్టడాలకు పునర్వైభవం". Archived from the original on 12 December 2018. Retrieved 12 December 2018.
- ↑ "HERITAGE - SITES". INTACH Hyderabad Chapter. Archived from the original on 6 అక్టోబరు 2011. Retrieved 12 డిసెంబరు 2018.