చావలి వ్యాఘ్రేశ్వరుడు

చావలి వ్యాఘ్రేశ్వరుడు భారతదేశానికి చెందిన ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు, పోలియో వ్యాధిగ్రస్తుల పాలిట వరప్రదాత.[1]

జీవిత విశేషాలు

మార్చు

ఆయన తూర్పుగోదావరి జిల్లా లోని రాజమండ్రిలో జన్మించారు. ఆయన తండ్రి ఆయుర్వేద వైద్యులు. ఆయన ఎం.బి.బి.ఎస్ చేసి జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్స్ లలో రెండు ఎం.ఎస్ డిగ్రీలను ఆంధ్రా మెడికల్ కళాశాల, విశాఖపట్నంలో చేసారు. ఆయన విశాఖపట్నం లోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మొదతి ఆర్తోపెడిక్స్ ప్రొఫెసరుగా పనిచేసారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థోపిడిక్ వైద్య విభాగ వ్యవస్థాపకుడు. ఆయన ఫోలియో చికిత్సలో "ప్లాసెంటాల్ గ్రాప్ట్" వైద్యవిధానాన్ని పరిచయం చేసిన మొట్టమొదటి భారతీయుడు. సబ్త్రో చాంటరిక్ ఓస్టియోటొమికి మెటాలిక్ గైడ్ పద్ధతిని ప్రవేశ పెట్టిన తొలి భారతీయుడు.

ఆయన ప్రపంచంలో బహు కొద్ధిమందికి తెలసిన హాఫ్ నీ జాయింట్ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్ర చికిత్స నిపుణుడు, తొలి భారతీయుడు. ఈ క్షేత్ర వికాసానికి దోహదపడుతూ, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఆర్తో పిడిక్స్ పుస్తకం రచించిన తొలి భారతీయుడు.

1948 లో కార్ నికోబార్ ద్వీపాలకు వెళ్ళి చాలా మంది పోలియో వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించారు. వీరు చేసిన మంచి పనికి గుర్తింపుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫెల్లోషిప్ ఇచ్చి ఉన్నత శిక్షణకు అమెరికా పంపించింది. 1954 లో మూడవ అంతర్జాతీయ పోలియో కాన్ఫరెన్స్ లో పురస్కారం అందుకున్నారు. 1956 లో ఇంటర్నేష్నల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఫెల్లోషిప్ అందుకున్నారు. 1965 లో అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్, ఫెల్లో నేషనల్ అకాడమి ఆఫ్ మెడికల్ సైన్సెస్ గౌరవం గైకొన్నారు.

వ్యాఘ్రేశ్వరుడు గారు డాక్టర్ మంగళంపల్లి గోపాల్ కిని వద్ద శిక్షణ పొందారు. రాణి చంద్రమణి దేవి కిని గారి వద్ద వైద్యం చేయించుకునే వారు. కిని గారు ముంబై ఆసుపత్రికి తరలి వెళ్ళడంతో, స్థానికి వైద్య సధుపాయం కోసం స్థలం విరాళముగా ఇవ్వగా, డాక్టర్ వ్యాఘ్రేశ్వరుడు వైద్య సేవలు అందిస్తూ వచ్చారు. దేశం నలుమూలలనుంచి జనం ఇక్కడికి వచ్చి వైద్య సేవలు పొందారు.

డాక్టర్ వ్యాఘ్రేశ్వరుడు గారు పలు రాష్ట్రాలు సందర్శించి పోలియో క్యాంపులు నిర్వహించి బాధితులకు ఉపశమనం కలిగించారు. 1967 లో ఆచార్య డాక్టర్ పి బ్రహ్మయ్య శాస్త్రి గారి సహకారముతో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విద్యార్థుల సంఘం నెలకొల్పారు. వారి సహాయ సహకారలతో వైద్య సేవలను మెరుగు పరిచేదిశలో మిక్కిలి కృషి చేశారు.

ఆయన 1966లో "ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఆర్థోపెడిక్స్" గ్రంథాన్ని వ్రాసిన మొట్టమొదతి భారతీయుడు.[2]

ఆయన 1972లో ప్రభుత్వ సర్వీసు నుండి పదవీవిరమణ పొందారు. తరువాత ఆయన పేద ప్రజలకు పోలియోసేవలను కొనసాగిస్తూ అనేక పోలియో క్యాంపులు నిర్వహించారు.

పోలియో వ్యాధిగ్రస్తుల సేవ

మార్చు

ఆపరేషన్ పోలియో ప్రాజెక్ట్, సత్య సాయి పోలియో ట్రస్ట్ ఆరంభించారు. వీటి ద్వారా మూడు వందల పోలియో క్యాంపులు నిర్వహించారు. 1.5 లక్షల మందిని పరీక్షించారు. 30,000 కి పైగా శస్త్ర చికిత్సలు చేశారు. ఈ సేవలన్నీ ఆయన ఉచితముగానే అందిచారు. ప్రపంచ వైద్య రంగ ఇతిహాసంలోనే ఇలాటి ఉదంతాలు అరుదు. అంతే కాదు మూడు వందల పోలియో క్యాంపులు నిర్వహించి, 30,000 (ముప్పై వేలకు పైగా) శస్త్ర చికిత్సలు చేసి, లక్షా యాబై వేల రోగులకు వైద్య సేవలు అందించారు.

ఆయన శిష్యుడు డాక్టర్ ఎస్ వి ఆదినారాయణ రావు వీరికి సహకారం అందిస్తూ ఉండేవారు. ఒక దరిమిలా ఆయన వ్యాఘ్రేశ్వరుడు గారిని ఉద్దేశించి ఉచితంగా సేవలు అందించడంలో మీకు ఏమొస్తుంది? అని ప్రశించారు. దానికి ప్రత్యుత్తరముగా రోగుల కళ్ళలో వారి దేవుడి పట్ల ఉన్న కృతజ్ఞత కనిపిస్తుంది; ఆ అనుభూతి, సంతృప్తి ఎంత డబ్బు పెట్టినా కొనలేము అని సమాధానమిచ్చారు. వారి నిష్ట అటువంటిది. ప్రజా క్షేమమే తన అశయంగా మలుచుకున్న గొప్ప వ్యక్తి.

పుస్తకాలు[3]

మార్చు
  • ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఆర్తో పిడిక్స్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1966
  • బోన్ ట్యుబర్కిలోసిస్ ఇన్ చిల్డ్రెన్, ఇండియన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్
  • ప్లాసెంటల్ టిష్యూ గ్రాఫ్టింగ్ ఇన్ పోస్ట్ పోలియో పరాలసిస్, జర్నల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్
  • అటిపికల్ రినల్ రికెట్స్, జర్నల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, 1962
  • ప్లసెంటల్ ఇంప్లాంట్స్ ఇన్ పోలియో మెలిటిక్స్, ది ఇండియన్ ప్రాక్టీష్నర్, 1965
  • చొన్ జెనిటల్ ఆబ్సెన్స్ ఆఫ్ సాచ్రం అండ్ కొక్కిక్ష్, ఇండియన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్, 1961
  • చొన్ జెనిటల్ ఆబ్సెన్స్ ఆఫ్ హుమెరుస్, ఇండియన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్ 1961
  • మోసిటిస్ ఓసిఫికన్స్ ప్రోగ్రెసివ: రిపోర్ట్ ఆఫ్ తొ కేసెస్, ఇండియన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్

మూలాలు

మార్చు
  1. "Biography in The Hindu". Archived from the original on 2003-07-02. Retrieved 2013-05-07.
  2. Book review of his Textbook in Orthopedics in Indian Journal of Pediatrics.[permanent dead link]
  3. "టి ఆర్ధోపిడిక్ డాక్టర్ ఆచార్య చావలి వ్యాఘ్రేశ్వరుడు". Archived from the original on 2016-03-05. Retrieved 2016-06-29.