చింతా ప్రభాకర్

చింతా ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ ఎమ్మెల్యే.[1]

చింతా ప్రభాకర్
చింతా ప్రభాకర్


2014 - 2018
నియోజకవర్గం సంగారెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం (1959-08-10) 1959 ఆగస్టు 10 (వయస్సు 62)
సదాశివపేట
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి

జననం, విద్యాభాస్యంసవరించు

చింతా ప్రభాకర్ 1959 ఆగస్టు 10న తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా , సదాశివపేట లో జన్మించాడు. ఆయన సదాశివపేట లోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు.

రాజకీయ జీవితంసవరించు

చింతా ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన సదాశివపేట మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్‌గా పని చేశాడు. చింతా ప్రభాకర్ 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి చేతిలో 6772 ఓట్ల తేడాతో ఓటమి పాల్యయాడు. ఆయన 2011లో టిఆర్ఎస్ లో చేరి సంగారెడ్డి టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి గా నియమితుడయ్యాడు.

చింతా ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి పై 29,814 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2][3]ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి చేతిలో 2589 ఓట్ల తేడాతో ఓటమి పాల్యయాడు.[4]

మూలాలుసవరించు

  1. Sakshi (18 November 2018). "కాంగ్రెస్‌ కంచుకోట సంగారెడ్డి". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  2. Sakshi (18 May 2014). "కాంగ్రెస్‌లో నైరాశ్యం". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  3. Sakshi (23 October 2015). "దసరా కలిపింది ఇద్దరిని." Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  4. Andrajyothy (24 May 2019). "సంగారెడ్డిలో పుంజుకుంటున్న టీఆర్‌ఎస్‌". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.