చికాగో హిందూ దేవాలయం
చికాగో హిందూ దేవాలయం అనేది ఇల్లినాయిస్ రాష్ట్రంలోలోని లెమోంట్‌లో ఉన్న ఒక హిందూ దేవాలయం. దీనిని 1977లో స్థాపించారు. దేవాలయ ప్రాంగణంలోని వివేకానంద ఆధ్యాత్మిక కేంద్రానికి ఆనుకుని ఉన్న కొండకు "వివేకానంద కొండ" అని పేరు పెట్టారు. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్‌లో పాల్గొన్న తరువాత తీసిన వివేకానంద ఛాయాచిత్రం ఆధారంగా 10 అడుగుల ఎత్తైన వివేకానంద కాంస్య విగ్రహం నిర్మించబడింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పబ్లిక్ ప్లేస్‌లో స్థాపించబడిన మొదటి వివేకానంద విగ్రహం ఇది.[1]
చికాగో హిందూ దేవాలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 41°41′21″N 88°00′16″W / 41.689068°N 88.004458°W |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం | ఇల్లినాయిస్ |
స్థలం | లెమోంట్ |
సంస్కృతి | |
దైవం | శ్రీరాముడు |
ముఖ్యమైన పర్వాలు | ప్రధాన హిందూ పండుగలు |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | చోళ, కళింగ రాజవంశం |
దేవాలయాల సంఖ్య | 2 |
కట్టడాల సంఖ్య | 1 |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | 1986 |
వెబ్‌సైట్ | http://www.htgc.org/ |
వివరాలు
మార్చుఇల్లినాయిస్ రాష్ట్రం, లెమోంట్‌లోని డెస్ ప్లెయిన్స్ నదీ లోయపై ఉన్న కొండపై ఈ దేవాలయం నిర్మించబడింది. దేవాలయ సముదాయంలో రామాలయం, గణేశ-శివ-దుర్గ దేవాలయం, కమ్యూనిటీ సెంటర్, వివేకానంద ఆధ్యాత్మిక కేంద్రం అనే నాలుగు భవనాలు ఉన్నాయి. చోళ రాజవంశం (10వ శతాబ్దపు భారతీయ రాజుల రాజవంశం) ప్రామాణికమైన శైలిలో రామ మందిరం నిర్మించబడింది. దీనికి 80 అడుగుల ఎత్తు గోపురం ఉంది. హిందూ ఆత్మకు శక్తివంతమైన చిహ్నం. ఈ దేవాలయం కిందనున్న పెద్ద హాలులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సౌకర్యాలు ఉన్నాయి. రామాలయానికి ఉత్తరం వైపు గణేశ-శివ-దుర్గ దేవాలయం ఉంది. ఇది కళింగ రాజవంశం శైలిలో నిర్మించబడింది. [2]
ఇక్కడ రెండు వేర్వేరు దేవాలయాలు ఉన్నాయి:
- రామమందిరం: ఇందులో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, వినాయకుడు, హనుమంతుడు, వెంకటేశ్వరుడు (బాలాజీ), మహాలక్ష్మి, కృష్ణుడు, రాధ మొదలైన దేవుళ్ళు కొలువై ఉన్నారు.
- గణేశ-శివ-దుర్గ దేవాలయం: ఇందులో శివుడు, వినాయకుడు, దుర్గాదేవి, సుబ్రహ్మణ్యుడు, దేవి పార్వతి, నటరాజ, అయ్యప్పసామి, నవగ్రహాలు ఉన్నాయి.
ప్రధాన పండుగలు
మార్చుదేవాలయంలో ప్రధాన హిందూ పండుగలు శ్రీరామనవమి, మహాశివరాత్రి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దీపావళి, నవరాత్రి, దసరా, హోలీ, వినాయక చవితి, మకర సంక్రాంతి వంటివి జరుపుకుంటారు.[3] ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి (1986, 1998, 2007, 2019) కుంభాభిషేకం నిర్వహించబడుతుంది. 2010లో ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు చెందిన శ్రీశ్రీ రవిశంకర్ స్వామి వివేకానంద ఆధ్యాత్మిక కేంద్రాన్ని ప్రారంభించాడు. 2011 సంవత్సరంలో, జూన్ నెలలో (జూన్ 8 — 12) శ్రీరామ మందిర నిర్మాణ 25 సంవత్సరాల వేడుక ఘనంగా నిర్వహించబడింది.
సౌకర్యాలు
మార్చుఈ ప్రాంగణంలో ఆడిటోరియం, డైనింగ్ హాల్, మీడియా సెంటర్‌తో కూడిన లైబ్రరీ కూడా ఉన్నాయి.
కార్యకలాపాలు
మార్చుఈ దేవాలయంలో కింది కార్యకలాపాలు నిర్వహించబడతాయి.
- ఆధ్యాత్మికవేత్తల ఉపన్యాసాలు/ఉత్సవాలు-హిందూ ధర్మం & వివేకానంద ఆధ్యాత్మిక కేంద్రం కమిటీలు
- యోగా తరగతులు
- ప్రధాన పండుగల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు
- సంగీత, నృత్య ప్రదర్శనలు (లలిత కళలు)
- ఆరోగ్య శిబిరాలు
- సండే స్కూల్ - భాషలు, కళలు, మతం మొదలైనవాటిని బోధించడం & ప్రామాణిక పరీక్షల కోసం సిద్ధం చేయడం
- సమ్మర్ ఫెస్టివల్, వాకథాన్స్
- మెడిటేషన్ సెషన్స్
నిర్వాహణ
మార్చుప్రతి నాలుగు సంవత్సరాల కాలానికి పదహారు మంది ధర్మకర్తలు ఎన్నుకోబడతారు. ప్రతి సంవత్సరం ఆరుగురు ట్రస్టీలతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. వివిధ కార్యక్రమాల కోసం ప్రతి సంవత్సరం అనేక కమిటీలు, కొన్ని ప్రత్యేక పనులకు హాజరు కావడానికి ప్రత్యేక తాత్కాలిక కమిటీలు ఏర్పాటు చేయబడుతాయి.
దేవాలయ కమిటీలలో అడ్వైజరీ, అక్షయ, ఆర్కైవ్స్, ఆడిట్, ఆక్సిలరీ, బిల్డింగ్, బైలాస్ & రాజ్యాంగం, కల్చరల్ & ఫైన్ ఆర్ట్స్, సండే స్కూల్, ఎలక్షన్స్, ఫైనాన్స్, ఫ్రంట్ డెస్క్, హిందూ ధర్మం & ఫిలాసఫీ, హ్యుమానిటేరియన్, లైబ్రరీ, మెయింటెనెన్స్ & వాలంటీర్లు, సభ్యత్వం, ప్రసాదం, ప్రచారం, ప్రజా సంబంధాలు, మతపరమైన & సంజీవని/బిల్వ/రామసేవక్ మొదలైనవి ఉంటాయి.
తాత్కాలిక కమిటీలలో కమ్యూనికేషన్స్ & సెక్యూరిటీ, డేటాబేస్, దేవి చోకీ, ఏకాంత సేవ, సోషల్ సర్వీసెస్, సమ్మర్ ఫెస్టివల్/బజార్, టూర్స్, వివేకానంద స్పిరిచువల్ సెంటర్, వెబ్‌సైట్, యోగా & మెడిటేషన్ మొదలైనవి ఉంటాయి.
మూలాలు
మార్చు- ↑ "Swami Vivekananda Statue". History & Activities -- Sri Ramakrishna Universal Temple (Vivekananda Vedanta Society of Chicago), IL, USA. Archived from the original on 2016-03-04. Retrieved 2022-02-06.
- ↑ "Architecture" (PDF). HTGC Visitor's Guide.[permanent dead link]
- ↑ "Major Festivals" (PDF). HTGC Visitor's Guide.[permanent dead link]