హోళీ

హిందూ పండుగ

హోలీ (సంస్కృతం: होली ) అనేది రంగుల పండుగ, హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా (దోల్ జాత్రా ) లేదా బసంత-ఉత్సబ్ ("వసంతోత్సవ పండుగ") అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజులు పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి.[2]

హోళి
హోళి
గోపికలతో హోళీ ఆడుతున్న శ్రీకృష్ణుడు
ఉత్సవాలుహోలికా దహనం తర్వాత రాత్రి, కామ దహనం
హోళీ రోజు: రంగులు చల్లడం, ఆడుకోవడం, నృత్యం, శుభాకాంక్షలు, పిండి వంటకాలు[1]
ఆవృత్తివార్షికం

దుల్‌‌‌హేతి, ధులండి, ధులెండి అని కూడా పిలిచే ముఖ్యమైన రోజు హోలీ ఉత్సవ రోజున, ప్రజలు రంగుల పొడిని, రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు. ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలిక దహన్ (హోలికను కాల్చడం) లేదా చోటీ హోలీ (చిన్న హోలీ) అని అంటారు. హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు. ఆంధ్ర ప్రదేశ్లో హోలిక దహన్‌ను కామ దహనం అని అంటారు.

ఇది సాధారణంగా శీతాకాలం చివర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలల తదుపరి వారాల్లో వచ్చే చివరి ఫాల్గుణమాసము (ఫిబ్రవరి/మార్చి) (ఫాల్గుణ పూర్ణిమ), పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కొన్ని రోజుల తరువాత, ఫాల్గుణ బహుళ పంచమి (పౌర్ణమికి ఐదవ రోజు) న పండుగ ముగింపున సూచిస్తూ రంగులతో రంగ పంచమి ఉత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రాముఖ్యత

మార్చు

వైష్ణవములో, రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, చాలా కాలం తపస్సు చేసి, తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. ఇతడిని "పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు, శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి, స్వర్గం , భూమిపై దాడి చేశాడు. ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించ దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.

 
రాధ , గోపికల హోలి.

తరువాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో (సగం మనిషి , సగం సింహం) వచ్చి హిరణ్యకశ్యపుడిని సంధ్యా సమయంలో (పగలు లేదా రాత్రి కాని) అతని ఇంటి గడప మెట్లపై (లోపల లేదా ఇంటి బయట కాదు) తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని (ఆకాశంలో లేదా భూమి పైన కాదు) , తన యొక్క పంజాతో చీల్చి చెండాడినాడు (అస్త్రాలు లేదా శస్త్రాలచే కాకుండా).

ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడి పెరిగిన ప్రాంతాలైన మథుర , బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు (ప్రతి సంవత్సరం రంగపంచమి రోజున భగవంతుడైన కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు). భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్లని శరీర రంగు , రాధ యొక్క శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. కృష్ణుడి తల్లి రాధ యొక్క ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంది. అధికారికంగా ఈ ఉత్సవాలు వసంతఋతువులో అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారు.

హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ ఉంది. ఈ కథ ప్రేమ దేవుడైన కామదేవుడు గురించి తెలుపుతుంది. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగ పరచడానికి అతనిపై పూల బాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేసాడు. తరువాత శివుడు, తన త్రినేత్రాన్ని తెరిచి, కామదేవుని శరీరాన్ని బూడిద చేశాడు. కామదేవుని యొక్క భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుడిని మరలా బ్రతికిస్తాడు కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరిత ప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకొంటారు.

హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే పండుగ. ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి, అక్కడ వివిధ రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది , వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి.[3] found

హోలీ ఆచారాలు

మార్చు

ప్రాథమిక పరిశోధనల ప్రకారం 7 శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోలీ పండుగ ఉత్సవాలు జరుపుకొన్నారని తెలిసింది. వాస్తవంగా హోలీ పండుగకు సంవత్సరం పొడవునా ఆచారాలు ఉంటాయి, మొదటగా రంగు పొడిని ఒకరికొకరు పూసుకుంటారు , పొడవైన చిమ్మే గొట్టాలు లేదా చిమ్మే తుపాకుల నుండి రంగు నీటిని జల్లుకుంటారు. ఈ పండుగను చాలా రోజుల ముందుగానే 'హోలీ మిలన్' లేదా బైతక్స్ ద్వారా జరుపుకొన్నారు, సంగీత కచేరీల ద్వారా అనగా పండుగకు సంబంధించిన పాటలను , రాధా , కృష్ణ పురాణ ప్రేమ కథ గురించి పాటలు పాడేవారు; ముఖ్యంగా జానపద పాటలు అనగా "హోరి" పాటలను పాడేవారు. కొన్ని సంప్రదాయక జానపద పాటలు ఆజ్ బిరాజ్ మే హోలీ రే రాసియా కొన్ని తరాల నుండి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి.

ఆహార తయారీ చాలా రోజుల ముందు నుండే ప్రారంభిస్తారు, హోలీ పండుగ సమయాన వచ్చిన అతిథులకు గుజియా అప్పడాలు, కంజి , మల్పాస్, మథిరి, పురాన్ పొలి, దాహి బదాస్ వంటి వివిధ రకాలైన ఫలహరాలను వడ్డిస్తారు. హోలీ రోజు రాత్రి, గంజాయిని (కేనబిస్) తీసుకొని మైకంతో ఊగుతారు.

హోలిక దహన్: హోలీ భోగి మంటలు

మార్చు
 
ఉదయపూర్ లో హోళీ మంటలు.

ఈ పండుగ యొక్క ప్రధాన ఘట్టం మండుచున్న హోలీ మంటలు లేదా హోలీక. అంతేకాక కొందరి ఉద్దేశ్యం ప్రకారం రాక్షసి హోలిక, హోలక , పూతన వంటి రాక్షసుల దహనం లేదా మదన్‌ను దహనం అని సంప్రదాయ హోలీ మంటల మూలాన్ని తెలుపుతాయి.

హిందూ పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదున్ని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా సంప్రదాయ భోగి మంటలను నిర్వహిస్తారు.

ఎలాగంటే విజయదశమి రోజున రావణుడిని ప్రతిమను దహనం చేసినట్లుగా ఈ పండుగ రోజు కూడా ప్రతిమను దహనం చేస్తారు, ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో రాక్షసుల పరాక్రమం హోలిక దహనంతో అంతం అయిందని దీని అర్థం, ఈ విధంగా ప్రతిమలను దహనం చేయడం ప్రస్తుతం కనిపించడం లేదు కొంత మంది ఏదో సూచనప్రాయంగా చేస్తున్నారు, కానీ ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలు మినహా బ్రజ ప్రాంతాలలో, కర్రలను కుప్పగా పోగు చేసి ప్రజలు ఎక్కువగా తిరిగే కూడళ్ళలో లేదా వీధి చివరలో ప్రతిమలను దహనం చేస్తారు. సంప్రదాయమైన పూజలు అయిన తరువాత ప్రజలు మంటలకు ప్రదక్షిణ లు చేస్తారు.తరువాత రోజు ఈ విజయాన్ని దుల్‍‌హెండి రోజుగా ఘనంగా జరపుకొంటారు.

దుల్‍‌హెండి

మార్చు

ముఖ్యముగా సంబరాలను అబీర్, గులాల్‌లను లాంటి సాధ్యమైన అన్ని రంగులతో జరుపుకొంటారు.తరువాత రంగు నీటిని చిమ్మే గొట్టాల ద్వారా ఒకరిపై ఒకరు జల్లుకొంటారు. ఈ రంగు నీటిని తెసు పుష్పాన్ని ఉపయోగించి తయారు చేస్తారు, దీనిని మొదటగా వృక్షం నుండి సేకరిస్తారు, ఎండలో ఎండబెడతారు, వాటిని నూరిన తరువాత నారింజ-పసుపు రంగులోకి మారుటకు నీరుని కలుపుతారు. ఇప్పుడు మరో సంప్రదాయకమైన హోలీ పండుగను తరచుగా చూస్తున్నాము, ఎరుపు రంగు పొడితో ఉన్న గోళాకార వస్తువును విసురుకుంటారు, అది వారికి తగిలిన వెంటనే పగిలి, వారిపై పొడి వెదజల్లుతుంది.[4]

ప్రాంతీయ ఆచారాలు , ఉత్సవాలు

మార్చు

దోల్-పూర్ణిమ (రంగ్ పంచమి) రంగుల యొక్క పండుగను విందులతో ఉల్లాసంగా జరుపుకొంటారు. ఆ రోజు, ప్రజలు తెల్లని దుస్తులను ధరించి బయటికి వస్తారు, ఏ ప్రదేశములో అయితే ఆడాలనుకుంటున్నారో ఆ ప్రదేశంలోకి అందరూ వచ్చి ఉల్లాసంగా గడుపుతారు.

భారతదేశం

మార్చు
ఆంధ్రప్రదేశ్

పట్టణాలలో స్వల్పస్థాయిలో జరుపుకుంటారు

తెలంగాణ

హైదరాబాదు, ఇతర జిల్లాలో ఇది ప్రముఖంగా జరుపుకుంటారు.

పంజాబ్

పంజాబ్‌లో సిక్కులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక్కడ హోలీని హోలా మోహల్లా అంటారు.ఈ పండుగను భారీ ఎత్తున జరుపుకొంటారు. వాస్తవానికి, భారత దేశ మొత్తంలో ఆనంద్‌పూర్ సాహిబ్ లో జరిగే హోలీ ఉత్సవం చాలా పేరు గడించింది. విదేశాల నుండి కూడా ప్రజలు పంజాబ్‌కు వచ్చి వారి సంప్రదాయ పద్ధతిలో హోలీ పండుగను జరుపుకొంటారు.

ఉత్తర్ ప్రదేశ్

హోలీ పండుగకు బర్సాన ప్రదేశం చాలా ప్రసిద్ధి.ఇక్కడ రాధా రాణి ఆలయంలో లాత్ మార్ హోలీ అనే క్రీడను ఆడతారు. లాత్ మార్ హోలీలో కొన్ని వేల మంది సాక్షిగా స్త్రీలు పురుషులను కర్రలతో కొడతారు, హోలీ పాటలను పాడుకుంటూ, పెద్దగా శ్రీ రాదే లేదా శ్రీ కృష్ణ అంటూ పాడతారు. పరిశుద్ధమైన బ్రజ్ భాషలో బ్రజ్ మండలం హోలీ పాటలను పాడతారు.

బర్సానాలో హోలీ రోజున స్త్రీలు పురుషులను కర్రలతో వెంబడిస్తారు. పురుషులు రెచ్చగొట్టే పాటలు పాడుతూ స్త్రీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. తరువాత స్త్రీలు కోపంతో వెళ్లి పురుషులను లాఠీలు అనే పొడవైన కర్రలను ఉపయోగించి కొడతారు పురుషులు వారితో ఉన్న డాలుతో కాపాడుకొంటారు. యు.పి సుల్తాన్పూర్‌లో హోలీ సరదాగా ఉంటుంది. అన్ని గ్రామాలు కలసి ఉత్సాహాంగా జరుపుకొంటారు.

భగవంతుడైన కృష్ణుడి జన్మ స్థలం అయిన మథురలో, బృందావన్లో హోలీ రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు, పండుగ చివరి 16 రోజులు, సంప్రదాయక పద్ధతులలో ఆచార వ్యవహారాలతో భగవంతుడైన కృష్ణుడిని పూజిస్తారు[2].మథుర, బృందావన్, బర్సానాలలో హోలీ జరుపుకొన్నట్లు బ్రజ్ ప్రాంతంలో, దాని సమీప ప్రాంతాలైన హత్రాస్, ఆలీగర్, ఆగ్రాలలో కూడా కొంచెం అదేవిధంగా జరుపుకొంటారు.

ఉత్తరప్రదేశ్‌కు ఉత్తర తూర్పు జిల్లా గోరఖ్‌పూర్‌లో, హోలీ రోజు ఉదయాన ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు.హోలీ రోజును సంతోషకరమైన, సంవత్సరంలో సౌభాగ్యవంతమైన దినంగా ప్రజలు భావిస్తారు. దీనినే హోలీ మిలన్ అని అంటారు.ఈ రోజు ప్రజలు ప్రతి ఇంటిని దర్శించి, హోలీ పాటలను పాడుతూ, రంగు పొడిని (అబీర్) పూస్తూ వారి కృతజ్ఞతా భావాన్ని చాటుకుంటారు. హోలీ హిందూ పంచాంగ నెల ఫాల్గునం చివరి రోజన వస్తుంది కాబట్టి దీన్ని సంవత్సర ముగింపుగా కూడా భావిస్తారు. ప్రజలు క్రొత్త సంవత్సర హిందూ పంచాంగం (పంచాంగ్) ప్రకారం హోలీ రోజు సాయంకాలమే రాబోవు సంవత్సరములో హోలీ కొరకు ప్రణాళికలను ప్రారంభిస్తారు.

 
హోలీని పుష్కర్, రాజస్థాన్ లలో జరపుకుంటారు
బీహార్

బీహార్‌లో కూడా ఉత్తర భారతదేశం జరుపుకున్నట్లు హోలీని అదే స్థాయిలో, మనోహరంగా జరుపుకొంటారు. ఇక్కడ కూడా, హోలిక పురాణం ప్రబలమైనది.ఫాల్గున పూర్ణిమ పర్వ దినానికి ముందు రోజు, ప్రజలు పెద్ద మంటలను వెలిగిస్తారు.వారు పేడ పదార్థాలను, ఆరాడ్, రెడి చెట్ల యొక్క కలప, హోలీక చెట్టు, పంటలను కోసిన తరువాత మిగిలిన పొట్టును, అవసరం లేని కలపను పెద్ద మంటలలో వేస్తారు. సంప్రదాయం ప్రకారం ఈ రోజు ప్రజలు వారి గృహాలను శుభ్రముగా ఉంచుకొంటారు.

ప్రజలందరు హోలీక సమయమప్పుడు మంటల దగ్గరికి వస్తారు. ప్రజలందరి సమక్షములో పురోహితుడు మంటను ఆరంభిస్తాడు.తరువాత ఇతడు ఇతరులకు రంగును పూసి ఒక సూచనా ప్రాయంగా శుభాకాంక్షలు తెలుపుతాడు.తరువాత రోజు ఈ పండుగను రంగులతో ఉల్లాసముగా జరుపుకుంటారు. ఈ పండుగను పిల్లలు, యువకులు చాలా ఆనందముగా జరుపుకొంటారు.ఈ పండుగను సాధారణంగా రంగులతో ఆడుకుంటారు, కొన్ని ప్రదేశాలలో ప్రజలు హోలీ పండుగను బురదతో కూడా ఆడుకొంటారు.హోలీ రోజున మంచి శృతితో జానపద పాటలను పాడతారు, ప్రజలు డోలక్ యొక్క శబ్దానికి నాట్యం చేస్తారు.పండుగ సందర్భముగా మైకాన్ని కలుగజేసే గంజాయినే కాక వైవిధ్యమైన పకోరాస్, తండైలను కూడా తీసుకొంటారు.

బెంగాల్

డోల్ పూర్ణిమ ఉదయం వేళలలో, విద్యార్థులు కుంకుమ పువ్వు రంగు దుస్తులను, పరిమళము వెదజల్లే పూల దండలను ధరిస్తారు.వారు పాటలు పాడతారు, సంగీత పరికరాల అయిన ఎక్‌తార, డుబ్రి, వీణా మొదలగువాటి శ్రుతికి తగ్గట్టు నృత్యం చేస్తారు. వీక్షించే వారు కూడా ఉల్లాసంగా ఊగుతారు, కొన్ని సంవత్సరాల వరకు గుర్తుండిపోతుంది. హోలీ పండగను 'డోల్ జాత్ర', 'డోల్ పూర్ణిమ' లేదా 'స్వింగ్ పండుగ' అని కూడా అంటారు.ఈ పండుగను సంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారు, పట్టణాల్లోని ముఖ్యమైన వీధులలో లేదా పల్లెల్లో కృష్ణుడి, రాధా ప్రతిమలను అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు.ఆడవాళ్లు ఊగుతూ నాట్యం చేస్తున్నప్పుడు భక్తులు వాళ్ళ చుట్టూ తిరుగుతూ భక్తి పాటలను పాడతారు.అప్పుడు పురుషులు రంగు నీటిని, రంగు పొడి అబీర్ జల్లుకొంటారు.

కుటుంబ పెద్దలు భగవంతుడైన కృష్ణుడిని, అగ్నిదేవుడిని ప్రార్ధిస్తాడు., సాంప్రదాయకంగా కృష్ణుడి ప్రతిమలకు గులాల్ రంగు పూసి భోగ్‌ను అర్పిస్తారు. శాంతినికేతన్‌లో, హోలీ ఒక ప్రత్యకమైన సంగీత అభిరుచి కలిగి ఉంటుంది.సంప్రదాయమైన వంటకాలు మల్పోయే, కీర్ సందేష్, బాసంతి సందేష్ (సాఫ్రన్ యొక్క), సాఫ్ఫ్రన్ పాలు, పాయసం మొదలైనవి.

ఒడిషా

ఒడిషా ప్రజలు కూడా హోలీని ఇదే విధంగా జరుపుకొంటారు కానీ కృష్ణ, రాధా విగ్రహాలకు బదులుగా పూరీలో ఉన్న జగన్నాధుడి విగ్రహాలను పూజిస్తారు.

గుజరాత్

భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో రంగుల పండుగ హోలీని శోభాయమానంగా జరుపుకుంటారు. ఫాల్గుణ నెలలో పౌర్ణమి రోజున వచ్చే హోలీ ముఖ్యముగా హిందువుల పండుగ, వ్యవసాయములో రబీ పంటలకు ఇది ఒక సూచనా ప్రాయముగా ఉంటుంది.

పల్లెల యొక్క కూడళ్ళలో, కాలనీలలో, వీధులలో భోగీ మంటలను వేస్తారు. ప్రజలు భోగీ మంటల ముందు ప్రార్థనలు చేస్తారు, వారు అలా నృత్యం చేయటం, పాటలు పాడటం వల్ల చెడు మన దరి చేరదని సూచనప్రాయంగా విశ్వసిస్తారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన వారు అందరు హోలీ పండుగ రోజున అధిక ఉత్సాహముతో మంటల చుట్టూ నాట్యము చేస్తారు.

దక్షిణ భారతదేశంలో, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక కుండలో మజ్జిగను వేసి వీధిలో వ్రేలాడదీస్తారు, యువకులు ఆ కుండను పగులగొట్టడానికి ప్రయత్నిస్తారు అదేసమయములో వారిని ఆపుటకు అమ్మాయిలు వారిపై నీళ్ళను విసురుతారు, ఎందుకంటే కృష్ణుడు, అతని స్నేహితులు వెన్న దొంగతనము చేస్తున్నప్పుడు వారిని 'గోపికలు' ఆపినట్లు ఆపుతారు. కృష్ణుడు వెన్న దొంగతనం చేయడానికి వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండే వారిని ఎగతాళి చేస్తూ రంగులతో తడిసిన పురుషులు వీధులలో పెద్ద ఊరేగింపు నిర్వహిస్తారు. చివరికి ఏ యువకుడైతే ఆ కుండను పగులగొడతాడో అతడిని హోలీ రాజుగా కిరీటాన్నిస్తారు.

కొన్ని ప్రదేశములలో, హిందూవుల ఆచారం ప్రకారం అమ్మాయిలు చీరను తాడుగా చేసి బావలను కొడుతూ రంగులను పూస్తూ ఆటపట్టిస్తారు, ఆమె కొరకు బావ ఆ రోజు సాయంకాలం తీపి తినుబండారాలను తీసుకొని వస్తాడు.

మహారాష్ట్ర

మహారాష్ట్రలో, హోలీ ముఖ్యముగా హోలీక యొక్క మంటలతో అనుసంధానమై ఉంది. హోలీ పౌర్ణమిను షింగా వలె కూడా జరపుకొంటారు. పండుగకు ఒక వారం ముందు, యువకులు చుట్టుప్రక్కల ప్రదేశాలలో ఉన్న కలపను తీసుకువచ్చి అందరి ఇంటికి వెళ్లి డబ్బును పోగు చేస్తారు.హోలీ రోజున, ఒక ప్రదేశములో మంటకు చెక్కను పెద్ద కుప్పగా పోగు చేస్తారు. సాయంత్రం మంటలను వెలగిస్తారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తిను బండారాలను, భోజనం అర్పిస్తారు. పూరణ్ పోలి అనేది రుచికరమైన తినుబండారం, పిల్లలు "హోలీ రే హోలీ పురాణచి పోలి" అని పాడతారు.షింగా దౌర్భాగ్యాలన్నింటిని తొలగిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు.ఉత్తర భారతదేశంలో వలె రెండవ రోజు జరుపుకోకుండా సంప్రదాయంగా రంగపంచమి రోజున ఉత్సాహంగా రంగులతో ఆడుకొంటారు.

మణిపూర్

భారత దేశానికి ఈశాన్య దిశలో ఉన్న మణిపూర్‌లో హోలీ పండుగను ఆరు రోజులు జరుపుకొంటారు. 18వ శతాబ్దంలో వైష్ణవులు ప్రారంభించినా, ఇది కొన్ని శతాబ్దాల నుండి యోసంగ్ పండుగతో విలీనమైపోయింది.సంప్రదాయంగా, యువకులు రాత్రి వేళల్లో ఫాల్గునమాసము పౌర్ణమి రోజున 'తాబల్ చోంగ్‌‌బా' జానపద నృత్యాలతో జానపద పాటలతో అద్భుతముగా డోలును వాయిస్తారు.ఎలాగైతేనేమి, వెన్నల రాత్రుల్లో ప్రజలు విందులలో పాల్గొంటారు, ప్రతిదీప్తి దీపం (ఫ్లోరిసెంట్ దీపాలు) ను ఉపయోగిస్తారు, భోగీ మంటలకు ఎండు గడ్డిని, రెమ్మలను ఉపయోగిస్తారు.బాలురు అమ్మాయిలకు తమతో 'గులాల్' ఆట ఆడమని డబ్బు ఇస్తారు.కృష్ణుడి గుడిలో, భక్తులు దేవుడి పాటలను పాడతారు, సంప్రదాయక పద్ధతిలో తెలుపు, పసుపు తలపాగాలను ధరించి గులాల్ ఆడుతూ నృత్యం చేస్తారు.పండుగ చివరి రోజు, కృష్ణుడి గుడి ఆవరణలో ఇంఫాల్ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, ఊరేగింపు చేస్తారు.

దక్షిణ భారతదేశం

కొచి ప్రాంతములోని మటన్‌చెర్రీలో, సామరస్యంతో జీవిస్తున్న 22 సంఘాల వారు ఉన్నారు. అంతేకాకుండా, దక్షిణ కొచి ప్రదేశమైన చెర్‌లై ప్రాంతములో కొంకణి భాష మాట్లాడే గౌడ్ సరావత్ బ్రాహ్మణులు (జిఎస్‌బి) కూడా హోలీ పండుగను ఘనంగా జరుపుకొంటారు. వారిని స్థానికంగా కొంకణి భాషలో ఉక్కులి అని లేదా మలయాళంలో మంజల్ కూలి అని పిలుస్తారు.ఇది ముఖ్యముగా కొంకణి గుడిలో జరగును దీనిని గోశ్రీపురం తిరుమల గుడి అని అంటారు.2008వ సంవత్సరం చెర్‌లైలో ఉక్కలి పండుగను మార్చి 23న జరుపుకొంటారు.భగల్‌కోట్ లో కూడా హోలీని భారీ ఎత్తున జరుపుకొంటారు.పాఠశాలలు, కళాశాలలు హోలీ రోజున సెలవు ప్రకటిస్తాయి, బెంగుళూరులో 2009 సంవత్సరంలో కొన్ని బహు‌ళదేశ కంపెనీలు అనగా టాటా కన్సల్‌టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్ టెక్నోలాజీ సొల్యూషన్స్ హోలీ సందర్భముగా సెలవు ప్రకటిస్తాయి.పిల్లలు, పెద్దలు అందరు కలసి హోలీ ఆడతారు.

కాశ్మీర్

కాశ్మీర్‌లో పౌరులు, భారత రక్షక దళ అధికారులు కూడా హోలీ సంబరాలను జరుపుకుంటారు. హోలీని ఎండ కాలమునకు ప్రారంభములో పంటలు కోయు సమయానికి సూచన, ఒకరిపై ఒకరు రంగు పొడిని, రంగు నీళ్ళను విసురుకుంటూ, పాటలు పాడుకుంటూ, నృత్యము చేస్తూ, అధిక ఉత్సాహముతో పండుగను జరపుకొంటారు.

 
న్యూ మెక్సికో యొక్క యునివర్సిటీ వద్ద భారతీయ విద్యార్థులు సంఘం హోలీ వేడుకలను జరపుకుంటారు
హర్యానా, గ్రామీణ ఢిల్లీ & పశ్చిమ యూపి

ఈ ప్రాంతములో కూడా హోలీ ప్రత్యమైన పద్ధతిలో వాళ్ళ సంప్రదాయం ప్రకారం జరపుకొంటారు, ఈ పండుగను ఆనందముగా, అత్యుత్సాహముతో జరపుకుంటారు.

నేపాల్

మార్చు
 
హోలీక దహన్, కాఠ్మండు, నేపాల్.

నేపాల్‌లో, పండుగలలో ఒక గొప్ప పండుగగా హోలీని పరిగణిస్తారు. నేపాల్‌లో 80 శాతం ప్రజలు హిందువులు ఉన్నారు[5], చాలా వరకు హిందువుల పండుగలను జాతీయ పండుగలుగా జరుపుకొంటారు, దాదాపుగా ప్రతి ఒక్కరు ప్రాంతీయ భేదం లేకుండా జరుపుకొంటారు చివరికి ముస్లిములు కూడా ఘనంగా జరుపుకొంటారు. కొందరు క్రైస్తవులు ఉత్సవాల్లో పాలుపంచుకున్నా ఉపవాస దినాల్లో రావడం వలన చాలా మంది హోలీ పండుగ వేడుకల్లో పాలుపంచుకోలేరు. నేపాల్‌లో హోలీ పండుగ రోజు జాతీయ సెలవు దినం.

హోలీ పండుగను ప్రజలు తమ చుట్టుప్రక్కల వారిపై రంగులను జల్లుకుంటూ రంగు నీరును పోసుకుంటారు.అధిక ముఖ్యమైన ఘట్టం ఒకరిపై ఒకరు రంగు నీళ్ళను పోసుకోవటాన్ని లోలా ( నీటి బుడగ అని అర్థం) అని కూడా అంటారు. శివరాత్రి రోజులా చాలా మంది ప్రజలు వారి పానీయాల్లో, ఆహారంలో గంజాయి కలుపుకొంటారు. వివిధ రంగులతో ఆడుకోవటం వల్ల వారి యొక్క బాధలు తొలగిపోయి, రాబోయే జీవితం ఆనందముగా ఉంటుందని నమ్ముతారు.

భారత దేశ ప్రవాసులు

మార్చు

సంవత్సరాలు గడుస్తున్నకొద్ది, ప్రవాసభారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో అనగా ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో, ఐరోపా, దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరపుకుంటారు.[6]

సంప్రదాయక హోలీ

మార్చు
 
సంప్రదాయమైన రంగులను తయారుచేయుటకు మోదుగ పుష్పములను ఉపయోగిస్తారు

వసంత కాలంలో వాతావరణములో మార్పూలు జరగటం వల్ల వైరల్ జ్వరం, జలుబు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం: సంప్రదాయముగా రంగులను నిమ్మ , కుంకుమ, పసుపు, బిల్వ లను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు.

కొన్నిసార్లు గంజాయిను బట్టి కెనబిస్ సెటైవా ఒక ముఖ్యమైన పానీయము తండై లేదా భంగ్ను తయారుచేస్తారు. తడిగా రంగుల కొరకు, మోదుగ పుష్పములు రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలగి ఉంటుంది. దురదృష్టకరంగా కొందరి వ్యాపార లాభాల కోసం పెరుగుతున్న రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారయ్యింది.

రసాయన రంగులు

మార్చు
 
యువకులు హోలీ జరపుకుంటారు

వసంత కాలములో రంగులను ఇచ్చిన వృక్షాలు చనిపోతే వాటికి ప్రత్యామ్నాయంగా భారతదేశంలోని పట్టణ ప్రాంతాలలోని ప్రజలు రసాయనాలు ఉపయోగించి తయారుచేసే రంగులను వినియోగిస్తున్నారు. 2001వ సంవత్సరం ఢిల్లీలోటాక్సిక్స్ లింక్, వాతావరణ్ సంస్థలు పండుగ కోసం వాడే రసాయన రంగులను పేర్కొంటూ ఒక శ్వేత పత్రమును ప్రచురించారు.[7] హోలీ రంగులను సురక్షితముగా మూడు రూపాలలో ఉత్పత్తి చేసుకోవచ్చునని తెలిపారు:: అవి ముద్దగా, నిస్సారమైన రంగులు, నీళ్ళ రంగులతో.

ముద్దలపై పరిశోధన జరిపిన తరువాత, వారు టాక్సిక్ రసాయనాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని కనుగొన్నారు. ఈ నల్లని ముద్దలు లెడ్ ఆక్సైడ్ కలిగి ఉండి మూత్రపిండాలను పాడు చేస్తాయి. క్యాన్సర్‌ను కలగజేసే పదార్థములు రెండు రంగులను వెండి రంగులో అల్యూమినియం బ్రోమైడ్ ను, ఎరుపులో మెర్క్యురి సల్ఫేట్ ను కనుగొన్నారు. నీలం ముద్దలో చర్మ వ్యాధులకు కారణమయ్యే ప్రూసియన్ నీలాన్ని ఉపయోగించడం వల్ల, కాపర్ సల్ఫేట్ ఆకు పచ్చగా ఉండి కంటి ఎలర్జీకి కారణం అవుతుంది అంతేకాకుండా ఉబ్బినట్లు ఉండి తాత్కాలికముగా గ్రుడ్డి తనం వచ్చే అవకాశాలు ఉన్నాయి.

పొడిగా ఉన్న రంగులను వివిధ రంగులతో ఉపయోగించడమును గులాల్స్ అని అంటారు, ఇది మైకము కలగజేసే, ఆస్తమా, శరీరమునకు సంబంధించిన వ్యాధులకు, తాత్కాలిక గ్రుడ్డితనమునకు కారణం అవుతుందని కనుగొన్నారు. ఈ రెండు యాస్బెస్టోస్ లేదా సిలికా సాధారణంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో ఉపయోగిస్తారు.

పొడిగా ఉన్న రంగులు జెంటియన్ వైలెట్ రంగును ఉపయోగించడం వలన శరీర వివార్ణముకు, చర్మ వ్యాధులకు దారి తీస్తాయని వీరు నివేదించారు. కొరత ఏర్పడటం వలన నాణ్యత అదుపు తప్పింది, ఇటువంటి రంగుల విషయం ఒక సమస్యగా మారింది, వారు తరచుగా వారికి ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియకుండా విక్రేతలు అమ్ముతున్నారు.

హోలీ యొక్క సంబరాలలో సాధారణంగా ప్రజలందరు ఒకరిపై ఒకరు రంగులను జల్లుకుంటారు. అభివృద్ధి ప్రత్యామ్నాయంగా ఢిల్లీ, కల్పవృక్షలలో, ఈ రెండు [8] పూణే, పరిశుభ్ర ఇండియా[9] ప్రచారంలో చిన్నపిల్లలకు హోలీ రోజు కోసం వారే స్వంతగా సురక్షితమైన, సహజమైన వస్తువులతో రంగులను చేసుకోవడాన్ని నేర్పి సహాయపడ్డారు. అంతలో కొన్ని వాణిజ్య సంస్థలు, జాతీయ వృక్షసంబంధిత పరిశోధన సంస్థ మార్కెట్‌లో ఔషధ రంగులను ప్రవేశపెట్టింది, ఇవి ప్రమాదకరమైన ప్రత్యామ్నాయం కంటే ఖర్చుతో కూడుకున్నవి అయినప్పటికీ, ఇది భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో కాక ఇతర ప్రాంతాలలో సాధారణ రంగులుగా (, పండుగలో వాడే రంగులుగా) అందుబాటులో ఉండటం గమనించవచ్చు.

హోలీని జరుపుకోవడం వలన సంప్రదాయమైన హోలీక దహన్ భోగి మంటలకు పర్యావరణానికి సంబంధం ఉంది, ఇవి అడవిని నిర్మూలించుటకు కారణమవుతున్నాయని చెప్పుకుంటారు. ఒక ఋతువుకు 30,000 భోగీ మంటలకు ప్రతి మంటకు సుమారుగా 100 కిలోల కలపను కాలుస్తున్నట్లు వారు ప్రచురించారు.[10] ఈ విధంగా కలపను వినియోగించడం నిరోధించుట కొరకు వివిధ పద్ధతులు ప్రవేశ పెట్టారు అవసరం లేని కలప సామగ్రి లేదా వివిధ చిన్న మంటల కన్నా ఒక వర్గానికి ఒక మంటను మాత్రమే అనే నియమాన్ని ప్రవేశపెట్టారు. అయినప్పటికీ, కొన్ని సార్లు సంస్కృతులను, సంప్రదాయాలను దెబ్బతీసే అవకాశం ఈ నియమాలవలన కలుగుతున్నది.

వీటిని కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ht అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 హోలీ - రంగుల యొక్క పండుగ Archived 2016-02-01 at the Wayback Machine ఇండియన్ ఎక్స్‌ప్రెస్ .
  3. శాస్త్రీయమైన హోలీ యొక్క సమాచారం
  4. రంగుల పండుగ BBC.
  5. "CIA - The World Factbook - Nepal". Archived from the original on 2010-12-29. Retrieved 2009-12-17.
  6. "దక్షిణ అమెరికా సంయుక్తరాష్ట్రాలలో హోలీ పండుగ". Archived from the original on 2010-02-26. Retrieved 2009-12-17.
  7. Toxics Link (February 2000). "The Ugly Truth Behind The Colourful World Fact sheet". 8. http://www.toxicslink.org/pub-view.php?pubnum=71 Archived 2011-07-20 at the Wayback Machine
  8. హోలీ ఉద్యమం సురక్షితం Archived 2007-03-26 at the Wayback Machine- కల్పవ్రిక్ష్ పర్యావరణం చర్య సమూహం, పూణే
  9. "నిర్మల భారత దేశ ఉద్యమం". Archived from the original on 2013-04-23. Retrieved 2009-12-17.
  10. వృక్షములను కాపాడుకొనుటకు వాస్తవముగా ప్రయత్నాలు లేవు - అహ్మదబాద్-నగరములు-ది టైమ్స్ అఫ్ ఇండియా

బాహ్య లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=హోళీ&oldid=3948221" నుండి వెలికితీశారు