చిగుళ్ల వ్యాధి

దంతాల చుట్టూ ఉన్న కణజాలాలను ప్రభావితం చేసే తాపజనక పరిస్థితుల సమూహం

చిగుళ్ళ వ్యాధి అనేది దంతాల చుట్టూ ఉన్న కణజాలాలను ప్రభావితం చేసే తాపజనక పరిస్థితుల సమూహం. దీనిని పెరియోడాంటైటిస్ అనీ, పెరియోడోంటల్ వ్యాధి అని ఆంగ్లంలో పేర్కొంటారు. దాని ప్రారంభ దశలో, దీనిని జింజివైటిస్ అని పిలుస్తారు. చిగుళ్ళు వాపు, ఎరుపు రంగులోకి మారుతుంది. రక్తస్రావం ఉండవచ్చు. దాని మరింత తీవ్రమైన రూపమే పెరియోడోంటల్ వ్యాధి. చిగుళ్ళు దంతాల నుండి వేరు అవుతాయి, ఎముక ఆధారం కోల్పోవచ్చు, దంతాలు వీడిబయటకు రావచ్చు[1]. చెడు శ్వాస కూడా సంభవించవచ్చు [2].

చిగుళ్ల వ్యాధి
ఇతర పేర్లుచిగుళ్ల వ్యాధి, పయోరియా, పెరియాంటైటిస్
రేడియోగ్రాఫ్ - పంటి (నలుపు ప్రాంతం) రెండు మూలాల మధ్య ఎముక తగ్గడాన్ని చూపుతోంది. పంటి కింద ఇన్ఫెక్షన్ కారణంగా మెత్తటి ఎముక వెనక్కి తగ్గింది, పంటికి ఎముకల మద్దతు తగ్గుతుంది.
ఉచ్చారణ
ప్రత్యేకతదంతవైద్యము
లక్షణాలుచిగుళ్ళు వాపు, ఎరుపు రంగులోకి మారుతుంది. రక్తస్రావం, చిగుళ్ళు దంతాల నుండి వేరు అవుతాయి, ఎముక కోల్పోవచ్చు, దంతాలు వీడుతాయి , చెడు శ్వాస
కారణాలుబాక్టీరియా
ప్రమాద కారకములుధూమపానం, మధుమేహం, హెచ్ఐవి/ఎయిడ్స్, కుటుంబ చరిత్ర, ఇంకా కొన్ని మందుల
రోగనిర్ధారణ పద్ధతిదంత పరీక్ష , ఎక్స్ రే
చికిత్సనోటి పరిశుభ్రత, ప్లాస్సింగ్, యాంటీబయోటిక్స్, శస్త్ర చికిత్స
తరుచుదనము538 మిలియన్

నోటిలోని బ్యాక్టీరియా దంతాల చుట్టూ ఉన్న కణజాలానికి సోకడం వల్ల సాధారణంగా పెరియోడోంటల్ వ్యాధి వస్తుంది[1]. ధూమపానం, మధుమేహం, హెచ్ఐవి/ఎయిడ్స్, కుటుంబ చరిత్ర ఇంకా కొన్ని మందుల వలన వ్యాధి ప్రమాదాన్ని పెరగడానికి కారణాలు[2]. దంతాల చుట్టూ ఉన్న చిగుళ్ళ కణజాలాన్ని దృశ్యమానంగా పరీక్షించడం, దంతాల చుట్టూ ఎముక ఎంత పోయిందో వెతుకడం, ఎక్స్-రేలతో తనిఖీ చేయడం ద్వారా రోగ నిర్ధారణ జరుగుతుంది[3][2].

సాధారణంగా నోటి పరిశుభ్రత వలన ఈ సమస్య నివారించవచ్చు. క్రమం తప్పకుండా దంత వైద్యుల ద్వారా దంతాలు శుభ్రపరచడం వంటి చికిత్సలు సహాయకారిగా ఉంటాయి. నోటి పరిశుభ్రత అంటే ప్రతిరోజూ పళ్ళుతోముకోవడము, దంతాల మధ్య దారము వంటి దానితో (ప్లాస్సింగ్) శుభ్రపరచుకోవడం వంటివి సిఫార్సు చేస్తారు[1]. కొన్ని సందర్భాల్లో వైద్యులు యాంటిబయాటిక్స్ లేదా దంత శస్త్రచికిత్స సిఫార్సు చేయవచ్చు[4]. ప్రపంచవ్యాప్తంగా 2015 లో 538 మిలియన్ల మంది ప్రజలు ఈ వ్యాధికి ప్రభావితమయ్యారని అంచనా[5]. యునైటెడ్ స్టేట్స్ లో 30 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు సగం మంది కొంతవరకు ప్రభావితమవుతారు, 65 ఏళ్లు పైబడిన వారిలో 70% మంది ఈ పరిస్థితికి గురై ఉన్నారు. స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా ప్రభావితమవుతారు [1].

ఇవి కూడా చూడండి

మార్చు
  1. నోటి దుర్వాసన
  2. జింజివైటిస్

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "Periodontal Disease". CDC. 10 March 2015. Archived from the original on 16 November 2018. Retrieved 13 March 2018.
  2. 2.0 2.1 2.2 "Gum Disease". National Institute of Dental and Craniofacial Research. February 2018. Archived from the original on 13 March 2018. Retrieved 13 March 2018.
  3. Savage A, Eaton KA, Moles DR, Needleman I (June 2009). "A systematic review of definitions of periodontitis and methods that have been used to identify this disease". Journal of Clinical Periodontology. 36 (6): 458–67. doi:10.1111/j.1600-051X.2009.01408.x. PMID 19508246.
  4. "Gum Disease Treatment". nhs.uk. Archived from the original on 13 March 2018. Retrieved 13 March 2018.
  5. GBD 2015 Disease and Injury Incidence and Prevalence Collaborators (October 2016). "Global, regional, and national incidence, prevalence, and years lived with disability for 310 diseases and injuries, 1990-2015: a systematic analysis for the Global Burden of Disease Study 2015". Lancet. 388 (10053): 1545–1602. doi:10.1016/S0140-6736(16)31678-6. PMC 5055577. PMID 27733282. {{cite journal}}: |author= has generic name (help)CS1 maint: numeric names: authors list (link)