జింజివైటిస్
జింజివైటిస్ అనేది దంతాల దగ్గర చిగుళ్ళ వాపు. దీంట్లో కణజాల నాశనం జరుగదు[1][2].
జింజివైటిస్ | |
---|---|
చిగురువాపు తీవ్రమైన పరిస్థితి | |
ప్రత్యేకత | దంత వైద్యం |
లక్షణాలు | సులభంగా రక్తస్రావం అయ్యే విధంగా ఎర్రటి వాపు చిగుళ్ళు |
సంక్లిష్టతలు | పెరిడాంటైటిస్, ఇంకా దంతాల నష్టం |
కారణాలు | పంటి గార, విటమిన్ సి లోపం, గర్భం దాల్చడం, ఫెనిటోయిన్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వంటి మందులు, ధూమపానం, నోరు పొడిగా ఉండటం |
రోగనిర్ధారణ పద్ధతి | దంత పరీక్ష |
నివారణ | నోటి పరిశుభ్రత |
చికిత్స | దంత వైద్యులచే దంతాలు శుభ్రపరచుకోవడం, యాంటీబయాటిక్స్ లేదా శస్త్రచికిత్స |
ఔషధం | యాంటీబయాటిక్స్ |
రోగ నిరూపణ | చికిత్సతో మంచి ఫలితాలు ఉంటాయి |
లక్షణాలు
మార్చుప్రధానంగా చిగుళ్ళలో ఎర్రటి వాపు ఉండి సులభంగా రక్తస్రావం జరిగే విధంగా లక్షణాలు ఉండవచ్చు. సాధారణంగా నొప్పి ఉండదు. చిగుళ్ల వ్యాధి, ఇంకా దంతాల నష్టం ఉండవచ్చు[1].
కారకాలు
మార్చుసాధారణంగా దంతాలకు అతుక్కుని గారలాంటి పొర ఉంటుంది. దానిలో బాక్టీరియా ఉంటుంది. ఆ పొరని 'ప్లాక్' అంటారు. ఇతర కారణాలలో విటమిన్ 'సి' లోపం, గర్భం దాల్చడం, ఫెనిటోయిన్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వంటి కొన్ని మందులు ఉన్నాయి. ధూమపానం, నోరు పొడిగా ఉండటం వంటివి ఇతర ప్రమాద కారకాలు[1]. రోగ నిర్ధారణ సాధారణంగా దంత పరీక్ష ద్వారా జరుగుతుంది. ఇది చిగుళ్ల వ్యాధికి ప్రారంభరూపం[3].
నివారణ
మార్చుప్రధానంగా నోటి పరిశుభ్రత వలన సమస్యను నివారించ వచ్చు. సాధారణంగా దంత వైద్యులచే దంతాలు శుభ్రపరచుకోవడం వంటి చికిత్స ఉంటుంది[4]. తీవ్రమైన పరిస్థితిలో యాంటీబయాటిక్స్ లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు[5]. సాధారణంగా చికిత్స వలన మంచి ఫలితాలు ఉంటాయి.
వ్యాప్తి
మార్చుజింజివైటిస్ అనేది అత్యంత సాధారణమైన చిగుళ్ల వ్యాధి. స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా ప్రభావితమవుతారు. పిల్లలు, పెద్దవాళ్ళు ఇద్దరూ ప్రభావితమవుతారు[1]. చిగుళ్ళవాపు గురించి హిప్పోక్రేట్స్ క్రీ.పూ 400 లోనే వివరించాడు[6].
ఇవి చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 M., Rathee; Jain, P (2021). Gingivitis. StatPearls. PMID 32491354.
- ↑ Limeback, Hardy (11 April 2012). Comprehensive Preventive Dentistry (in ఇంగ్లీష్). John Wiley & Sons. p. 58. ISBN 978-1-118-28020-1. Archived from the original on 28 August 2021. Retrieved 8 July 2021.
- ↑ "Gingivitis - Mouth and Dental Disorders". Merck Manuals Consumer Version (in కెనడియన్ ఇంగ్లీష్). Archived from the original on 27 February 2021. Retrieved 8 July 2021.
- ↑ "Periodontal Disease". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 14 December 2018. Archived from the original on 17 July 2021. Retrieved 8 July 2021.
- ↑ "Gingivitis - Dental Disorders". Merck Manuals Professional Edition (in కెనడియన్ ఇంగ్లీష్). Archived from the original on 28 August 2021. Retrieved 8 July 2021.
- ↑ Newman, Michael G.; Takei, Henry; Klokkevold, Perry R.; Carranza, Fermin A. (14 February 2011). Carranza's Clinical Periodontology (in ఇంగ్లీష్). Elsevier Health Sciences. p. 2. ISBN 978-1-4557-0638-9. Archived from the original on 28 August 2021. Retrieved 8 July 2021.