పన్ను

(దంతాలు నుండి దారిమార్పు చెందింది)

పళ్ళు లేదా దంతాలు (Teeth) దవడలకు అమర్చబడి ఉండి మనం ఆహారాన్ని నమలడానికి ఉపకరిస్తాయి. వీటి మొదలు భాగాలు చిగుళ్ళతో కప్పబడి ఉంటాయి.

పన్ను భాగాలు

మానవులలో రెండు జతల పల్లుంటాయి. ముందుగా చిన్నపిల్లలలో వచ్చే పల్లను పాలపల్లు అంటారు. ఇవి 10 పైదవడకి 10 క్రిందిదవడకి ఉంటాయి. తర్వాత వచ్చే 32 పల్లు శాశ్వతంగా మనిషి జీవితాంతం ఉంటాయి. ఇవి 16 పైదవడకి 16 క్రిందిదవడకి ఉంటాయి. కుంతకాలు, రదనికలు, చర్వణకాలు, అగ్రచర్వణకాలు అనే నాలుగు రకాల దంతాలు క్రింద, పైన, కుడి, ఎడమవైపు ఒకే విధంగా ఉంటాయి.

కుంతకాలు ఆహారాన్ని ముక్కలు చేయడానికి, రదనికలు చీల్చడానికి, చర్వణకాలు, అగ్ర చర్వణకాలు నమలడానికి ఉపయోగపడతాయి. ప్రతి దవడ అర్ధ భాగంలో రెండు కుంతకాలు, ఒక రదనిక, రెండు అగ్ర చర్వణకాలు, మూడు చర్వణకాలు ఉంటాయి. దవడ ఎముక లో ఉండే దంత భాగాన్ని మూలం అనీ, బయటకు కనిపించే భాగాన్ని కిరీటం అంటారు. దంతం డెంటయిన్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటుంది. ఇది ఎముక కంటే గట్టిగా ఉంటుంది. దంతం లోపల ఉండే కుహరంలో రక్త నాళాలు, నాడీ తంతువులు ఉంటాయి. దంత విన్యాసం:2/2,1/1,2/2,3/3

శుభ్రత

మార్చు

దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కనీసం ఒకసారి దంతధావనం చేయాలి. ఈ ప్రక్రియ వల్ల దంతాలలో చేరుకున్న చిన్న ఆహారపు ముక్కలు, పాచి తొలగిపోతాయి.

ఇవి కూడా చూడండి

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పన్ను&oldid=3064983" నుండి వెలికితీశారు