చిట్టూరి రవీంద్ర
చిట్టూరి రవీంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1996 నుండి 1998 వరకు రాజమండ్రి లోక్‌సభ సభ్యుడిగా, 2004 నుండి 2009 వరకు బూరుగుపూడి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేశాడు.
చిట్టూరి రవీంద్ర | |||
ఎంపీ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1996 - 1998 | |||
ముందు | కె.వి.ఆర్. చౌదరి | ||
---|---|---|---|
తరువాత | గిరజాల వెంకటస్వామి నాయుడు | ||
నియోజకవర్గం | రాజమండ్రి లోక్‌సభ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1952 రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | సూర్యప్రభ | ||
నివాసం | రాజమండ్రి |
రాజకీయ జీవితం
మార్చుచిట్టూరి రవీంద్ర కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1988లో సర్పంచ్‌గా గెలిచాడు. ఆయన 1996లో రాజమండ్రి లోక్‌సభ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చుండ్రు శ్రీహరి పై 95166 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచాడు.అయితే 11వ లోక్ సభ 13 నెలలకే రద్దు కావడంతో మళ్ళీ ఎన్నికలు రావడంతో ఆయనకు టికెట్ దక్కలేదు. అయినా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
చిట్టూరి రవీంద్ర 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బూరుగుపూడి నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అన్నపూర్ణ పెందుర్తి పై 1459 ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.2009లో నియోజకవర్గాల పునర్విభజనలో బూరుగుపూడి, సీతానగరం, రాజానగరం, కోరుకొండ మండలాలతో కలిపి నూతనంగా రాజానగరం నియోజకవర్గంగా ఏర్పడింది. ఆయన 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 6,936 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.
చిట్టూరి రవీంద్ర 2009లో ఓటమి అనంతరం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పని చేశాడు. ఆయన 2012లో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యుడిగా నియమితుడయ్యాడు. చిట్టూరి రవీంద్ర రాష్ట్ర విభజన[1] అనంతరం కాంగ్రెస్ పార్టీని విడి తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆయన ప్రస్తుతం ది కాకినాడ కో ఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ గా ఉన్నాడు.[2]ఆయన 2021 ఆగస్టు 4న ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఆండ్ క్రెడిట్ సైసైటీస్ ఫేడరేషన్ లిమిటెడ్ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[3]
మూలాలు
మార్చు- ↑ Sakshi (27 September 2013). "జనవరిలో కొత్త పార్టీ ఏర్పాటు: మాజీ ఎంపీ". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
- ↑ Eenadu (29 August 2021). "అందరి సహకారంతో లాభాల బాట". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
- ↑ Andrajyothy (4 August 2021). "ఏపీ అర్బన్ బ్యాంక్ అండ్ క్రెడిట్ సొసైటీస్ సమాఖ్య కార్యదర్శిగా రాఘవేంద్రరావు". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.