చిత్రం లేదా బొమ్మ అనేది ఒక విషయం (వ్యక్తి లేదా వస్తువు లేదా దృశ్యం వంటిని) రూపానికి పోలికతో తయారు చేసిన (రూపొదించిన) ఒక వస్తువు. చిత్రం అనేది two dimensional వస్తువు గాని, లేదా three-dimensional వస్తువు గాని కావచ్చును.

నీడ ద్వారా ఏర్పడిన ఒక చిత్రం
ఇక్కడ చూపిన చిత్రాలలో పైనున్న బొమ్మ ఫొటోగ్రఫీ ద్వారా "పట్టుకొనబడింది". అదే దృశ్యాన్ని క్రింద చిత్రకారుడు "గీయడం" లేదా "వేయడం" ద్వారా తయారుచేయబడింది..


(కాగితం లేదా గోడ వంటి వాటిపై) చేతితో గీసిన బొమ్మలు, వస్త్రాలపై అద్దిన బొమ్మలు, ఫొటోగ్రాఫు, తెరపైన బొమ్మ (screen display) వంటివి two dimensional చిత్రాలకు ఉదాహరణలు. విగ్రహాలు, నమూనాలు వంటివి three-dimensional చిత్రాలకు ఉదాహరణలు. చిత్రాలను సుద్దముక్క, పెన్సిలు, పెన్ను, కుంచె వంటి పరికరాలతో సృష్టించ వచ్చును (గీయవచ్చును). లేదా కెమేరా, అద్దం, కటకం, దూరదర్శిని, సూక్ష్మదర్శిని వంటి optical పరికరాలతో "పట్టుకొన వచ్చును". జంతువు కన్నులు, నీటి ఉపరితలం వంటి సహజ వస్తువులు కూడా చిత్రాలను పట్టుకొనే optical పరికరాలే. అంతే గాకుండా కాంతివలన ఏర్పడే నీడలు కూడా చిత్రాలే. three-dimensional చిత్రాలను చెక్క, రాయి, మట్టి, ఐసు, మైనం, లోహం వంటి పదార్ధాలలో చెక్కుతారు లేదా మలుస్తారు.

ఆంగ్లంలో picture, image, photograph, model, sculpture వంటి పదాల ద్వారా చిత్రాలను వర్గీకరిస్తారు. "బొమ్మ" (image) అనే పదాన్ని మరింత విస్తృతమైన అర్ధంలో వాడుతారు. గ్రాఫు, మ్యాపు, abstract painting వంటివన్నీ బొమ్మల క్రింద వస్తాయి. బొమ్మలను గీయడం, వేయడం, చెక్కడం వంటి manual ప్రక్రియల ద్వారా కాని, లేదా ముద్రణ, కంప్యూటర్ గ్రాఫిక్స్ వంటి సాంకేతిక ప్రక్రియల ద్వారా గాని, లేదా ఈ రెండింటి కలయిక ద్వారా గాని సృష్టించవచ్చును.


"అస్థిర చిత్రం" (volatile image) అంటే కొద్దికాలం మాత్రమే ఉండే బొమ్మ. ఉదాహరణకు అద్దంలో కనిపించే బొమ్మ లేదా చీకటి గది కెమెరా (camera obscura)లో పడే ప్రొజెక్షన్, లేదా కాథోడ్ కిరణాల ట్యూబ్ (cathode ray tube)లో ఏర్పడే బొమ్మ. వీటికి స్థిరమైన ప్రతిరూప సృష్టి (hardcopy) సాధ్యం కానందున ఇవి ఎక్కువ కాలం నిలవవు. hardcopy రూపంలో తయారైనది "స్థిర చిత్రం" (fixed image) - పేపర్, వస్త్రం, ఫిల్మ్, గోడ, లోహం వంటి పదార్ధాలపై వీటిని పట్టుకుంటారు గనుక ఇవి ఎక్కువ కాలం నిలచి ఉంటాయి. ఇటువంటి బొమ్మలు ఒక ప్రత్యేకమైన వస్తురూపంలో ఉంటాయి.

"మానసిక చిత్రం" (mental image) అనేది ఒక వ్యక్తి మనసులోనే ఉండే సృష్టి. (ఇతరులకు కనిపించదు). ఆ వ్యక్తికి గుర్తుఉన్న లేదా ఊహించిన విషయాలనుబట్టి ఇది రూపొందుతుంది. ఇలాంటి చిత్రం ఒక "వస్తువు"యొక్క ప్రతిరూపం కానక్కరలేదు. అది ఒక నిరాకార భావన (abstract concept) కావచ్చును - ఉదాహరణకు ఒక గ్రాఫు, ఒక భావన, ఒక భవిష్యఘటన, ఒక గణిత సమీకరణం, ఒక ఊహ. సిగ్మండ్ ఫ్రాయిడ్ (Sigmund Freud) కలలు కేవలం శబ్దరూపంలోనే ఉండేవట(dreamt purely in aural-images of dialogues). అభివృద్ధి చెందుతున్న శ్రవణ యంత్రాలు, సాంకేతికత కారణంగా "దృశ్య కళ" (sound art అనే రంగం రూపొందుతున్నది. ఇందులో "శబ్ద చిత్రం" (sound-image) అనే విషయం భాషకు, సంగీతానికి అతీతమైన శబ్దరూపాలను (made up of irreducible phonic substance beyond linguistic or musicological analysis) గురించి తెలుపుతారు.

"https://te.wikipedia.org/w/index.php?title=చిత్రపటం&oldid=3893102" నుండి వెలికితీశారు