కెమెరా
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కెమెరా అనగా స్థిర చిత్రాలను లేదా అలాంటి స్థిర చిత్రాల క్రమాన్ని చలన చిత్రంగా గాని, వీడియోలుగా గాని తీయడానికి ఉపయోగపడే ఒక వైద్యుత (ఎలక్ట్రానిక్) పరికరం. ఈ పదం లాటిన్ భాషలోని కెమెరా అబ్స్కూరా (camera obscura) అనే పదం నుండి ఆవిర్భవించింది. కెమెరా అబ్స్క్యురా అనగా చీకటి గది అని అర్థం. ప్రారంభ దశలో మొత్తం గదిని చిత్రాలను తీయడానికి వాడేవారు.ఈనాడు మనం చూస్తున్న అత్యాధునిక కెమెరాలకి కెమెరా అబ్స్క్యూరా నే మూలం.
పని చేసే విధానం
మార్చుకెమెరాలు మామూలు కాంతి (సాధారణ కంటికి కనిపించే వర్ణాలు) లేదా ఇతర విద్యుదయస్కాంత వికిరణము (Electromagnet radiation) ను ఉపయోగించి పనిచేస్తాయి. కెమెరాలో సాధారణంగా ఒక మూసి ఉన్న ఖాళీ ప్రదేశం ఉంటుంది. దానికి ఒక వైపున ఒక సూక్ష్మరంధ్రం ద్వారా కాంతి ఆ ఖాళీలోకి ప్రవేశించే అవకాశం కల్పించబడి ఉంటుంది. ఈ రంధ్రానికి వ్యతిరేక దిశలో చిత్రాన్ని భద్రపరచడానికి కావలసిన వస్తువులు ఉంటాయి. కెమెరాకు ఉండే రంధ్రానికి ముందు చాలా కెమెరాలకు కటకాలు అమర్చబడి ఉంటాయి. కటకం తరువాత ఒక డయాఫ్రమ్ ఉంటుంది, దీని ద్వారా రంధ్రం యొక్క పరిమాణాన్ని మార్చగలుగుతారు. కొన్ని కెమెరాలకి స్థిరమైన సూక్ష్మరంధ్రం ఉంటుంది. ఫోటోని నిక్షిప్తం చేయటానికి పూర్వపు కెమెరాలు ఫోటోగ్రఫిక్ ఫిలింను వాడగా, డిజిటల్ విప్లవం తర్వాత వస్తూ ఉన్న ప్రస్తుత కెమెరాలు వైద్యుత ఇమేజ్ సెన్సర్లు ఫ్లాష్ మెమరీ పద్ధతిని అవలంబించి నిక్షిప్త పరుస్తున్నాయి.
ఒక స్టిల్ కెమెరా ఒకసారి షట్టర్ బటన్ నొక్కితే ఒక చిత్రాన్ని తీయగా (కంటిన్యువస్ మోడ్ లో లేనప్పుడు) ఒకే ఫోటోని తీయగా, ఒక సినిమా కెమెరా ఒక సెకనుకి 24 ఫ్రేముల చొప్పున రికార్డు చేస్తుంది.
చరిత్ర
మార్చుఫోటోగ్రఫిక్ కెమెరాలకి ముందు కెమెరా అబ్స్క్యూరాల పై చాలా పరిశోధన జరిగింది. క్రీ.పూ ఐదవ శతాబ్దంలోనే చైనీసు తత్త్వవేత్త అయిన మో టీ ఒక సూదిబెజ్జం ద్వారా కాంతి ప్రయాణించి చీకటి ప్రదేశం లోకి ప్రవేశించినపుడు తలక్రిందులైన, స్పష్టమైన ప్రతిబింబాన్ని ఏర్పరచటం గమనించాడు. ఈ ప్రక్రియని అవలంబించిన మొట్టమొదటి వ్యక్తీ మో టీ నే. అయితే ఈ సిద్ధాంతాన్ని గురించి క్రీ.పూ నాల్గవ శతాబ్దంలోనే అరిస్టాటిల్ ప్రస్తావించాడు. క్రీ.పూ 330వ సంవత్సరంలో ఏర్పడిన పాక్షిక సూర్యగ్రహణం సమయంలో చెట్టుకి ఉన్న ఆకుల మధ్యన ఉన్న ఖాళీల గుండా సూర్యుని ప్రతిబింబం ఏర్పడటం వివరించాడు. పదవ శతాబ్దంలో అరబ్బీ పండితుడు అయిన ఇబ్న్ అల్-హైతం (అల్ హసన్) కూడా సూదిబెజ్జం ద్వారా పయనించిన సూర్యగ్రహణాన్ని గమనించి సూదిబెజ్జం యొక్క పరిమాణాన్ని తగ్గించటం ద్వారా ప్రతిబింబంలో స్పష్టత తీసుకురావచ్చని వివరించాడు. ఆంగ్ల తత్త్వవేత్త రోజర్ బేకాన్ ఈ ఆప్టికల్ సిద్ధాంతాల గురించి పర్స్పెక్టివా అనబడు గ్రంథములో 1267లో రచించాడు. పదిహేనవ శతాబ్దం నాటికి కళాకారులు, శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియని తమ పరిశోధనలలో వాడటం ప్రారంభించారు. ఒక వైపు గోడకి సూదిబెజ్జం చేసిన ఒక చీకటి గదిలోనికి ఒక మనిషి ప్రవేశించి ఎదురుగా ఉండే గోడపై ఏర్పడే తలక్రిందులైన ప్రతిబింబాన్ని గమనించే వారు. ల్యాటిన్ లో చీకటి గదులని కెమెరా అబ్స్క్యూరా అంటారు.
కెమెరా అబ్స్క్యూరా అని మొట్టమొదట సంబోధించినది గణిత, నక్షత్ర శాస్త్రజ్ఞడు అయిన జోహెన్నెస్ కెప్లర్. 1604 లో తన అడ్ విటెల్లియోనెం ప్యారాలిపోమెనాలో ఈ సంబోధన జరిగింది. దీనికి ఒక కటకాన్ని చేర్చి ఈ ఉపకరణాన్ని ఒక గుడారంలో నిర్మించటంతో దీనిని కావలసిన చోటుకి తీసుకెళ్ళే సౌలభ్యము కలిగినది. 1660 లలో బ్రిటీషు శాస్త్రవేత్త రాబర్ట్ బోయిల్, అతని సహాయకుడు అయిన రాబర్ట్ హుక్లు చేతిలో ఇమిడే కెమెరా అబ్స్క్యూరాని తయారు చేశారు.
వాడుకకి అనువుగా చేతిలో ఇమిడే చిత్రపటాలను రూపొందించేందుకు వీలుపడే కెమెరాని మొట్టమొదట 1685లో జోహాన్ జాహ్న్ రూపొందించాడు. నిల్వ ఉంచే దారి లేకపోవటంతో అప్పట్లో ఏర్పడిన ప్రతిబింబాన్ని చిత్రపటంగా మరల గీసేవారు. అయితే సూర్యరశ్మి సోకినచో రంగులు వెలిసిపోవటం లేదా రంగులు ముదరటం అప్పటికే మానవాళికి తెలుసు. కెమెరా అబ్స్క్యూరాలో కాంతి తాత్కాలితంగా గీసే ఈ చిత్రలేఖనాలతో ప్రేరణ చెందిన చాలామంది ప్రయోగకర్తలు వీటిని శాశ్వతంగా ముద్రించటానికి కావలసిన పదార్థాలని కనుగొనే ప్రయత్నంలో పడ్డారు.
తర్వాతి కెమెరాలు పెట్టెల సమూహంగా ఉండేవి. ఒక పెట్టెకి కటకం అమర్చబడి ఉండగా మరొక పెట్టెకి గాజుతో తయారు చేయబడిన తెర అమర్చబడి ఉండేది. వీటిని ఒకదానికొకటి దగ్గరగా లేదా దూరంగా జరపటం ద్వారా వివిధ దూరాలలో ఉన్న ఆబ్జెక్టులని స్పష్టమైన ఫోకస్కి తెచ్చేవారు. కోరుకున్న విధంగా ప్రతిబింబం ఏర్పడ్డ తర్వాత, కటకాన్ని మూసివేసి తెర స్థానంలో కాంతిని గుర్తించే పదార్థమును ఉంచేవారు. కటకాన్ని మరల తెరచి కావలసినంత సమయం బహిర్గతం చేసేవారు. అప్పటి ప్రయోగాలలో ఉపయోగించబడే పదార్థముల స్వభావం వలన కొన్ని గంటలు లేదా రోజులు బహిర్గతం చేయవలసి వచ్చేది. ఛార్లెస్, విన్సెంట్ ఛెవాలియర్ లు చెక్కతో చేయబడిన స్లైడింగ్ బాక్స్ కెమెరాని ఉపయోగించి జోసెఫ్ నిసెఫోర్ నీప్సే 1826 లో ప్యారిస్లో మొట్టమొదటి శాశ్వత ఫోటోగ్రాఫ్ ని సృష్టించాడు.
ఇలాంటి కెమెరాలలోనే డాగ్యురోటైప్ (సిల్వర్ రసాయనాలతో పూత పూసిన) ప్లేట్లని ఉపయోగించటం 1839 లో మొదలైనది. ఇవి చరిత్రలోనే ఉపయోగించబడిన మొట్టమొదటి ఛాయాగ్రహక మాధ్యమములు (ఫోటోగ్రఫిక్ మీడియం). 1850 లలో డాగ్యురోటైప్ ల స్థానాన్ని ఆక్రమించిన కొలోడియన్ ప్రక్రియలో ఫోటో తీసే కొద్ది సమయం ముందు ఫోటోగ్రఫర్ పలుచని గాజు/ఇనుప పలకలకి పూత పూసి వాటి తడి ఆరిపోక ముందే ఉపయోగించేవారు. 1864 లో ఈ పూత కోసం ప్రత్యేక చీకటి గదులని ఉపయోగించనవసరం లేని కెమెరాలో నే పూత పూసే డుబ్రోనీ ప్రవేశ పెట్టబడింది. ఇతర కెమెరాలలో ఎక్కువ కటకాలని అమర్చి పలు చిన్న చిన్న ఫోటోలని ఒక పెద్ద పలక పై చిత్రించటం మొదలు పెట్టారు. దీనినే కార్టెస్ డీ విజిటే అనేవారు. బెల్లో ల ఉపయోగం ఈ తరంలోనే వ్యాప్తి చెందినది.
చాలా సంవత్సరాల వరకు బహిర్గత సమయాల నిడివి ఎక్కువగా ఉండేది. ఛాయాగ్రహకుడు కటక మూత (లెన్స్ కవర్) ని తీసివేసి బహిర్గతానికి కావలసినన్ని సెకన్లను లేదా నిముషాలను లెక్కపెట్టుకొని తర్వాత మూసి వేసేవారు. మరిన్ని మెరుగైన చిత్ర సంవేదక పదార్థాలు అందుబాటులోకి రావటంతో యాంత్రిక షట్టరుల సహాయంతో సరైన సమయం వరకు బహిర్గతం చేయగలిగే సదుపాయం కలిగినది.
1920లలో కనుగొన్న ఎలెక్ట్రానిక్ వీడియో కెమెరా ట్యూబ్ అనేక అభివృద్ధులకు దారి తీసి 21వ శతాబ్దపు ఆరంభం నాటికి ఫిలిం కెమెరాల స్థానం డిజిటల్ కెమెరాలు ఆక్రమించేలా చేసింది.
యంత్రగతి
మార్చుచిత్ర బంధనం
మార్చుసాంప్రదాయిక కెమెరాలు కాంతిని ఫోటోగ్రఫిక్ ఫిలిం పై లేక ఫోటోగ్రఫిక్ ప్లేట్ పై బంధిస్తాయి. వీడియో, డిజిటల్ కెమెరాలు ఒక వైద్యుదిక ఇమేజ్ సెన్సర్ (సాధారణంగా ఒక ఛార్జ్ కపుల్డ్ డివైస్ గానీ లేదా కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ గానీ) ఉపయోగిస్తారు. ఇందులో నుండి చిత్రాలు ఒక మెమరీ కార్డు లోనికి మార్చబడి అందులోనే భద్రపరచబడతాయి. తరువాత వీటిని ఎలా కావలంటే అలా మార్చుకొనవచ్చును.
చలన చిత్రాలని బంధించటానికి ఉపయోగించే కెమెరాలని మూవీ కెమెరాలు అనీ, నిశ్చలన చిత్రాలని చిత్రీకరించే కెమెరాలని స్టిల్ కెమెరాలు అనీ వ్యవహరిస్తారు.
ప్రస్తుతం ఈ రెండు రకాల కెమెరాలు ఒకే కెమెరాగా లభ్యమౌతున్నాయి.
కెమెరా కటకం
మార్చుకెమెరా కటకం (ఫోటోగ్రఫిక్ కటకం లేదా ఫోటోగ్రఫిక్ లక్ష్యం) కెమెరా లోపల అమర్చబడి, ఇతర యంత్రగతులతో సమష్టిగా ఉపయోగించి వస్తువుల ప్రతిబింబాలని సృష్టించి ఫోటోగ్రఫిక్ ఫిలిం పై గానీ ఇతర (రసాయనిక/వైద్యుదిక) మాధ్యమాలలో గానీ నిక్షిప్తం చేసే ఒక ఆప్టికల్ కటకం లేదా కటకాల సమూహం. స్థిర చిత్రాలని,చలనచిత్రాలని, ఖగోళ, సూక్ష్మ చిత్రాలని చిత్రీకరించే వివిధ రకాలైన కెమెరాలలో లేదా ఏ ఇతర కెమెరాలోనైనా ఉపయోగించే కటకాలలో పెద్దగా తేడా లేకున్ననూ, వాటి తయారీ, నిర్మాణాలలో తేడా ఉంటుంది. లెన్సు కెమెరాకి స్థిరంగా అమర్చబడి ఉండవచ్చును. లేదా వివిధ నాభ్యంతరాలు, సూక్ష్మ రంధ్రాలు లేదా ఇతర లక్షణాలలో తేడాలు గల వేర్వేరు కటకాలని అవసరానికి తగ్గట్టుగా అమర్చుకొనే సౌలభ్యం కలిగి ఉండవచ్చును. సూత్రప్రకారం కెమెరాకి ఒక సాధారణ కుంభాకార కటకం సరిపోయిననూ దృష్టి దోషాలని (సాధ్యమైనంత) సరి చేయగలిగే సామర్థ్యం గల పలు లెన్స్ ల సమూహం వాడుకలో ఉంది. ఏ కటక వ్యవస్థలో నైననూ కొంతవరకు దృష్టిలోపాలు ఉంటాయి. కటకాన్ని తయారు చేసే సమయం లోనే తయారీదారు ఈ దోషాలని సరి చేసుకుంటూ ఫోటోగ్రఫిక్ ఉపయోగానికి/భారీ ఉత్పత్తికి అనువుగా రూపొందించాలి.
కటక నాభి
మార్చుబహిర్గత నియంత్రణ
మార్చుషట్టరు
మార్చుసంక్లిష్టతలు
మార్చుఫిలిం ఫార్మాట్ లు
మార్చుఅదనపు విడిభాగాలు
మార్చుకెమెరాలలో రకాలు
మార్చుప్లేట్ కెమెరా
మార్చులార్జ్ ఫార్మాట్ కెమెరా
మార్చుమీడియం ఫార్మాట్ కెమెరా
మార్చుఫోల్డింగ్ కెమెరా
మార్చుబాక్స్ కెమెరా
మార్చురేంజ్ ఫైండర్ కెమెరా
మార్చుట్విన్ లెన్స్ రిఫ్లెక్స్
మార్చుసబ్-మినియేచర్ కెమెరా
మార్చుఇన్స్టంట్ (పిక్చర్) కెమెరా
మార్చుసినీ కెమెరా
మార్చు- సినిమా అంటే కదిలే దృశ్యాలు. ఈ కదిలే దృశ్యాలని చిత్రీకరించాగల కెమేరాని సినిమా కెమెరా లేదా సినిమాటోగ్రఫీ కెమేరా అంటారు.
- ఒక కదిలే దృశ్యానికి సంబంధిచి 16 ఫ్రేం లని ఒక సెకండు కాలములో చిత్రించి ప్రదర్శిస్తే ఆ దృశ్యం కదులుతున్నట్టుగా భ్రమ కలుగుతుంది.
- అయితే దృశ్యము ధ్వనితో అనుసంధానం కలగాలంటే ఒక సెకండుకు 24 ఫ్రేమ్స్ తీయాలి. సినిమా కెమేరా ఇలా ఒక సెకండ్ కాలములో 24 ఫ్రేములని చిత్రించగలదు.
- సౌలభ్యము కోసము ఒక ఫ్రేం నుండి 500 ఫ్రేం లని చిత్రీకరించే సామర్థ్యము కల సినిమా కెమెరాలు అందుబాటులో ఉన్నాయి.
జీవితాన్ని చిత్రీకరించే కెమెరా
మార్చుఈ అద్భుతమైన కెమెరా మెడలో హారంలా వేసుకుంటే చాలు.దండలోని పరికరంలో ఇమిడి ఉండే ఈ కెమెరా ప్రతి 30 క్షణాలకోసారి తనంతట తానే చిత్రీకరిస్తుంది. దీనిని ధరించిన వ్యక్తి ఏదైనా కొత్త ప్రదేశంలోకి వెళ్లినప్పుడు యాక్సెలరోమీటర్, లైట్ సెన్సర్‌ను ఉపయోగించి చిత్రాలు తీస్తుంది. కెమెరా ధరించిన వ్యక్తికి ఎదురుగా ఉండే వాతావరణాన్ని గుర్తించటానికి ఇందులో ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ కూడా ఉంటుంది. కెమెరాలోని 1 గిగాబైట్ మెమరీలో 30 వేల ఫొటోలు ఇమిడిపోతాయి. వాస్తవానికి వృద్ధాప్యంలో తలెత్తే మతిమరపు సమస్య ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడే వారికోసం ఈ కెమెరాను రూపొందించారు. (ఈనాడు19.10.2009)
కెమెరా పనిచేయు పద్దతి, రకాలు
మార్చు- View camera
- Rangefinder camera
- Twin-lens reflex camera
- Single-lens reflex camera
- బొమ్మ కెమెరా
- డిజిటల్ కెమెరా (Digital SLR or single-lens reflex camera)
- సినిమా కెమెరా
- వీడియో కెమెరా
-
Contax S—the world's first pentaprism SLR
-
Asahiflex
-
Kodak Retina IIIC
-
Nikon F of 1959
-
Voigtländer Vitoret of 1962
-
Silvestri Flexicam
-
Opened up Cine Kodak, used 35mm movie film
-
Voigtländer Brillant twin-lens reflex camera.
-
1921 Kodak
తయారీదారులు
మార్చుకెమెరాల పేర్లు
మార్చుమరింత సమాచారం
మార్చుచిట్కాలు
మార్చులింకులు
మార్చుబోధన
మార్చుపుస్తకాలు
మార్చుపత్రికలు
మార్చుపాఠాలు
మార్చుపోటీలు
మార్చుబ్లాగులు
మార్చుఫోరములు
మార్చుఉపయోగపడే ఇతర సమాచారం
మార్చుసమాచార సేకరణ
మార్చుఇవి కూడా చూడండి
మార్చు- స్లోమోషన్ కెమేరా
- డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా (Digital SLR camera)
- మూవీ కెమెరా movie camera
- కోడాక్ (Kodak)
- సినిమాటోగ్రఫీ (Cinematography)
- చలనచిత్రీకరణ (movie making)
- అర్రి (ARRI)
- పానావిజన్ (Panavision)
- ఇమేజ్ ఎడిటింగ్ (Image editing)
- గింప్ (GIMP)
- రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు (Raster graphics editing software)
- అడోబ్ (Adobe)
- యానిమేషన్ (Animation)
- స్టాప్ మోషన్ యానిమేషన్ (Stop motion animation)
- కెమెరా చరిత్ర