వి.ఆర్.చిత్రా

(చిత్రా వీరభద్రరావు నుండి దారిమార్పు చెందింది)

వి.ఆర్.చిత్రాగా పిలవబడే చిత్రా వీరభద్రరావు సుప్రసిద్ధుడైన చిత్రకారుడు.ఇతడు బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాలలో చదువుకున్నాడు. తరువాత ఇతడు రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతి నికేతన్‌లో 1920-28ల మధ్య నందలాల్ బోస్ వద్ద చిత్రకళను అభ్యసించాడు. ఇతడు సింహాచలం దేవస్థానానికి నాలుగేళ్లు స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో దేవస్థానం ఆదాయం బాగా వృద్ధి చేసి సమర్థుడైన అధికారిగా పేరుగడించాడు. లక్నో ఆర్ట్ స్కూలులో అధ్యాపకునిగా, మద్రాసులోని కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌కు సూపరింటెండెంట్‌గా, శాంతి నికేతన్‌లోని కళాభవన్‌కు ప్రిన్సిపాల్‌గా, కేంద్ర లలితకళాఅకాడమీకి పశ్చిమ బెంగాల్ తరఫున సభ్యుడిగా పనిచేశాడు. శాంతినికేతన్ కళాభవన్‌కు ప్రిన్సిపాలుగా పనిచేసిన ఏకైక ఆంధ్రుడు ఇతడే. ఇతడు కొంతకాలం భద్రాచలం ప్రాంతంలో జయపురం మహారాజాతో కలిసి పారిశ్రామిక కార్యక్రమాలను ప్రారంభించాడు. కానీ దేశంలో అస్వతంత్రత, అల్లకల్లోలమైన రాజకీయాల కారణంగా అప్పటి బ్రిటిష్ పాలకులు ఇతని సత్సంకల్పానికి అడ్డుపడ్డారు. పరిశ్రమలకోసం ఇతడు జపాన్ నుండి యంత్రసామాగ్రి దిగుమతి చేసుకున్న కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం ఇతడిని జైలులో పెట్టింది. ఇతడు పిలకా గణపతిశాస్త్రితో కలిసి ఆంధ్రశిల్పి అనే తెలుగు మాసపత్రికను, ఆంగ్లశిల్పి అనే ఆంగ్ల మాసపత్రికను నడిపాడు[1].

వి.ఆర్.చిత్రా
చిత్రా వీరభద్రరావు
జననం1902 ఆగస్ట్ 21
మరణం1974
ప్రసిద్ధిచిత్రకారుడు , సంపాదకుడు.
మతంహిందూ

బాల్యం

మార్చు

1902 ఆగస్ట్ 21న విశాఖపట్నంలో జన్మించాడు. బాల్యం, ఎస్.ఎస్.ఎల్.సి. వరకు విద్యాభాసం విశాఖపట్నంలోనే జరిగింది.

రచనలు

మార్చు

ఇతడు చిత్రకళకు సంబంధించి ఈ క్రింది గ్రంథాలను ప్రకటించాడు.

  1. చిత్రమాల
  2. ఎన్‌చాంటెడ్ హిమాలయాస్
  3. కొచ్చిన్ మ్యూరల్స్
  4. ఫర్నీచర్ డిజైన్స్

ఇవి కాక

  1. కాటేజ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని,
  2. జ్ఞాపకాలు పేరుతో జీవితచరిత్రను రచించాడు. దీన్ని విశాఖపట్నం చిత్రకళా పరిషత్ వారు 2022 లో కళాతపస్వి 'వి.అర్.చిత్ర' పేరుతో పుస్తకంగా ప్రచురించారు.

గ్యాలరీ

మార్చు

వి.ఆర్.చిత్రా చిత్రించిన కొన్ని వర్ణచిత్రాలు:

మూలాలు

మార్చు
  1. పిలకా, లక్ష్మీ నరసింహమూర్తి (11 June 1978). "చిత్రకళలో సౌగంధిక పద్మాలు, పద్మ ప్రతిబింబాలూనూ". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 65, సంచిక 69. Retrieved 12 January 2018.[permanent dead link]