చిత్రా షెనాయ్ దక్షిణ భారత చలనచిత్రాలు, టెలివిజన్ ధారావాహికలలో పనిచేసే భారతీయ నటి, నిర్మాత. ఆమె ప్రధానంగా కన్నడ, మలయాళం భాషలలో 600లకి పైగా చిత్రాలలో నటించింది. కన్నడ చిత్ర పరిశ్రమలో 'యువ తల్లి' గా ప్రసిద్ధి చెందిన ఆమె దాదాపు అందరు అగ్ర తారలకు తల్లి పాత్రను పోషించింది. మలయాళంలో ఆమె రాజమాణిక్యం చిత్రంలో మమ్ముట్టి తల్లి పాత్రతో ప్రసిద్ధి చెందింది.

చిత్రా షెనాయ్
జననం
హసన్, కర్ణాటక
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
జీవిత భాగస్వామి
గురుదాస్ షెనాయ్
(m. 1993)
[1]

మలయాళ ధారావాహిక శ్రీధనంలో ప్రతినాయిక అత్త పాత్రను పోషిస్తూ ఆమె కేరళలో ఇంటి పేరుగా మారిపోయింది. ఆమె గుడ్ కంపెనీ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆమె కర్ణాటక రాష్ట్రం హాసన్ లో ఎం. కె. వినాయక్, సరస్వతి దంపతులకు ఇద్దరు పిల్లలలో చిన్నదిగా జన్మించింది. ఆమెకు జ్యోతి అనే అక్క ఉంది.[2] ఆమె హోమ్ సైన్స్ గ్రాడ్యుయేట్.[3] ఆమె కన్నడ చలనచిత్ర, టెలివిజన్ నిర్మాత గురుదాస్ షెనాయ్ ని వివాహం చేసుకుంది. వారికి కుషి షెనాయ్ అనే కుమార్తె ఉంది. గురుదాస్, చిత్ర షెనాయ్ కలిసి దక్షిణ వీడియోటెక్, గుడ్ కంపెనీ ప్రొడక్షన్స్ అనే రెండు టెలివిజన్ నిర్మాణ సంస్థలను నడుపుతున్నారు. ఆమె తన కుటుంబంతో కలిసి బెంగళూరులో నివసిస్తున్నది.[4]

ఫిల్మోగ్రఫీ

మార్చు

తెలుగు సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర
2006 నాయడు ఎల్ఎల్బి
2010 కంత్రీ మొగుడు
2018 2 ఫ్రెండ్స్

మూలాలు

మార్చు
  1. Srinivas, Srikanth (17 August 2003). "Glamourous [sic] screen mother". Deccan Herald. Archived from the original on 28 May 2006. Retrieved 23 September 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Archived copy". Archived from the original on 29 April 2015. Retrieved 28 April 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "Chithra Shenoy shines | Bengaluru News - Times of India". The Times of India.
  4. "Winning accolades - The Hindu". The Hindu.