చిత్రా సర్కార్

మహిళా శాస్త్రవేత్త, వైద్యురాలు

చిత్రా శంకర్ మద్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లితండ్రులకు ఆమె ఏకైక కుమార్తె. అందువలన ఆమె తండ్రి ఆమెను కుమారుడిలా భావించి అలాగే పెంచాడు. అయినప్పటికీ ఆమె తల్లి ఆమెకు భార్యగా, తల్లిగా ముందుముందు బాధ్యత వహించాలి కనుక ఇంటి పనులలో కూడా నైపుణ్యం ఏర్పరుచుకొమ్మని సలహా ఇచ్చేది. చిత్రా శంకర్ కుటుంబంలో చదువుకు చక్కగా ప్రాధాన్యం ఇచ్చేవారు.హైస్కూలులో ఉన్నప్పుడు ఆమెకు విజ్ఞాన శాస్త్రము అంటే అభిమానం ఏర్పడింది. ఆమె విద్యాపరంగా మేధస్సు ఫలితంగా ప్రభుత్వం నుండి మెరిట్ స్కాలర్‌షిప్ అనుదుకొన్న కారణంగా ఆమెకు మెడికల్ విద్య అందుబాటుకు వచ్చింది.

చిత్రా సర్కార్
Chitra Sarkar
చిత్రా సర్కార్
వృత్తిమహిళా శాస్త్రవేత్త

రీసెర్చ్

మార్చు

చిత్రా శంకర్ బెంగుళూరు మెడికల్ కాలేజిలో ఎం.బి.బి.ఎస్ పూర్తిచేసిన తరువాత ఆమె తల్లితండ్రులు ఆమెను ఎం.డి చెయ్యమని ప్రోత్సహించాడు. పలు చర్చల అనతరం ఆమె పెథాలజీలో పైచదువు కొనసాగిచాలన్న ప్రతిపాదన కార్యరూపందాల్చింది. ఆరూగ్యానికీ, రోగానికీ గల సంబధాలను తెలపడానికి పెథాలజీ ఉపకరిస్తుంది. అంతేకాక అది భారమైన నైట్ డ్యూటీలు ఉండవు. అది కుటుంబనిర్వహణకు కూడా సహకరిస్తుంది. ఆమె తండ్రి ఆమెను " ఆల్ ఇండియా ఇంస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైంసెస్ " (ఎ.ఐ.ఐ.ఎం.ఎస్) లో చదివించాలని కలగన్నాడు. అది దేశంలో ప్రఖ్యాత మెడికల్ ఇంస్టిట్యూటుగా ప్రఖ్యాతి చెందినది. 1978లో చిత్రా శంకర్ ఆల్‌ఇండియా ఎంట్రెంస్ ద్వారా (ఎ.ఐ.ఐ.ఎం.ఎస్) పెథాలజీ విభాగంలో స్థానం లభించింది.

రీసెర్చ్

మార్చు

ఎం.డి అధ్యయనంలో రీసెర్చ్ ఆంతర్భాగం. చిత్రా శంకర్‌కు ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లో విజ్ ప్రొఫెసర్ శుబిమల్ రాయ్, పెథాలజీ ప్రొఫెసర్, పి.ఎన్.టాండాన్, న్యూరో సర్జరీ ప్రొఫెసర్ ఎ.కె బెనర్జీ వంటి ఉన్నత స్థాయి ప్రొఫెసర్ల వద్ద అభ్యసించే అవకాశం లభించుంది. చిత్రా శంకర్ న్యూరోపథాలజీలో పరిశోధనలు సాగించింది. న్యూరోపథాలజీ మెదడు, వెన్నెముక, కండ, వరాలు సంబంధిత వ్యాధుల నివారణ గురించిన శాస్త్రం. తరువాత ఆమెకు లండన్‌లోని " ఇంస్టిట్యూట్ ఆఫ్ పెథాలజీ " న్యూరోపెథాలజీ ఫెలోషిపి చేసేసమయంలో ప్రొఫెసర్ పి.ఎల్. లాంటోస్ ప్రేరణ కలిగించాడు.

పోస్ట్‌డాక్టొరల్ పొజిషన్

మార్చు

చిత్రా శంకర్ రెసిడెంసి, ఫెలోషిప్ ప్రోగ్రాంస్ పూర్తి చేసిన తరువాత 1968లో ఎ.ఐ.ఐ.ఎం.ఎస్‌లో పెథాలజీ అండ్ విజ్ఞాన శాస్త్రము విభాగంలో టీచరుగా బాధ్యతలు స్వీకరించింది. ఆమె పెథాలజీ ప్రొఫెసర్ అలాగే న్యూరోపెథాలజీ విభాగం చీఫ్‌గా బాధ్యతలు వహించింది. రోగులను చూడడం, విద్యార్థులకు బోధించడం రిసెర్చ్ విద్యార్థులకు సలహాసహకారం అందించడం ఉద్యోగబాధ్యతలలో అంతర్భాగాలు. అప్పటి నుండి ఆమె ఉద్యోగజీవితం ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగింది. క్లినిక్‌లో పనిచేయడం రోగులను బాగుచేయడం సంతృప్తిని ఇచ్చింది. విద్యార్థులతో కలిసిమెలిసి పనిచేయడం ఆమెను ఉత్సాహభరితంగా ఉంచింది. రీసెర్చ్ అత్యంత ఆనందం ఇచ్చింది. భారతదేశంలో మెడికల్ సైన్సులో ఇంకా శైశవదశలో ఉంది. కొంతమంది డాక్టర్లు మాత్రమే రీసెర్చ్ వైపు ఆసక్తి చూపితున్నారు. అత్యధిక జనాభా మాత్రమేకాక పలు విధములైన వ్యాధులు ఉన్నందున అంతేకాక ప్రాతీయపరిస్థితుల కారణంగా వేరుపడ్తున్న వ్యాధుల విధానం అనుసరించి భారతదేశంలో మెడికల్ రీసెర్చ్ చేయడానికి విస్తారమైన అవకాశాలు ఉన్నాయని చిత్రా శంకర్ అభిప్రాయపడింది.

వివాహం

మార్చు

ఉద్యోగంలో స్థిరపడగానే చిత్రా శంకర్ వివాహం జరిగింది. ఆమె తల్లితండ్రులు ఆమెతో కలిసి నివసించారు. చాలామంది స్త్రీలు ఉద్యోగానికి కుటుంబం ఆటకం అని భావిస్తారు. అందుకు వ్యతిరేకంగా ఆమెకు కుటుంబం మద్దతుగా నిలిచి ఉద్యోగంలో అభివృద్ధి చెందడానికి సహకరించింది. ఆమె తల్లితండ్రులు, భర్త, కుమార్తే ఉద్యోగబాధ్యతలలో ఎప్పుడూ ఆటంకంగా నిలవలేదని ఆమె కథనాలు తెలియజేస్తున్నాయి. పలు వత్తిళ్ళు పోటీలు ఎదురైనా వాటిని ఎదురొడ్డి న్యూరాలజిస్టుగా నిలవడడం సంతృప్తినివ్వగా, చిన్న వయసులో రీసెర్చ్ చెయ్యడం, థిసీస్ పేపర్లు ప్రచురణల రుపంలో ఆమె పేరు ప్రఖ్యాత టెక్స్టు బుక్స్‌లో సహితం అచ్చులో చూసుకోవడం సంతోషం కలిగించగా, ప్రఖ్యాతిగాంచిన పలు అవార్డులను అందుకోవడం ఆమె న్యూరాజిస్టుగా నిలబడేలా చేసాయని ఆమె అభిప్రాయపడింది.

వెలుపలి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.