చిన్నగూడూర్ మండలం
చిన్నగూడూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన తొర్రూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 5 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం చిన్నగూడూర్
చిన్నగూడూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, చిన్నగూడూర్ స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | మహబూబాబాదు జిల్లా |
మండల కేంద్రం | చిన్నగూడూర్ |
గ్రామాలు | 5 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 62 km² (23.9 sq mi) |
జనాభా (2016) | |
- మొత్తం | 15,317 |
- పురుషులు | 7,690 |
- స్త్రీలు | 7,627 |
పిన్కోడ్ | 506315 |
గణాంకాలు
మార్చు2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 62 చ.కి.మీ. కాగా, జనాభా 15,317. జనాభాలో పురుషులు 7,690 కాగా, స్త్రీల సంఖ్య 7,627. మండలంలో 4,026 గృహాలున్నాయి.[4]
2016 లో ఏర్పడిన మండలం
మార్చులోగడ చిన్నగూడూర్ వరంగల్ జిల్లా, మహబూబాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలోని మరిపెడ మండలానికి చెందిన గ్రామం. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చిన్నగూడూర్ గ్రామాన్ని (1+4) ఐదు గ్రామాలుతో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో నూతన మండలం కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.