చిన్నబరంపురం
చిన్నబరంపురం, శ్రీకాకుళం జిల్లా, మందస మండలానికి చెందిన గ్రామం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా,మందస మండలంలోని గ్రామం. ముఖ్యంగా వ్యవసాయిక కుటుంబీకుల గ్రామం. జనాభా మూడువందలకు పైనే.ఈ గ్రామంలో కాళింగ, కాపు, హరిజన కుటుంబాలతో పాటు కుంధర కుటుంభాలు చాలా ఉన్నాయి.ఈ కుంధర వాళ్ళు ఒడిషా నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డవారు. వీళ్ళ వృత్తి ఆధారంగానే వీరికి కుంధర అనే పేరు వచ్చింది. వీరు చెక్కతో కుంచాలు, అడ్డ (ధాన్యం కొలవటానికి ఉపయోగించే ఒక రాక మయిన పాత్ర) ఫ్లవర్ వాజులు, బొమ్మలు తయారు చేస్తారు. ఈ రకంగా తయారు చేసిన వాటిని ఊర్ల లోను, రైళ్ల లోను అమ్ముతారు.గ్రామంలో హరిజనులు ఊరి సేవలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. గ్రామ పరిశుభ్రత విషయంలో వీరిదే కీలక పాత్ర… మంచి మనసున్న మనుసులు వీరు.గ్రామంలో అందరూ హిందూ ధర్మ వారసులు.అన్య మతస్తుల ఆగడాలు ఈ ఊరిలో సాగవు… యువకులంతా ధర్మ పరిరక్షణలో భాగస్వాములే. ప్రస్తుతం ఊరిలో దువ్వాడ వెంకట రావు గారు అందరికీ తల్లో నాలుకై వ్యవహరిస్తారు.. ఎవ్వరికీ భయపడని వ్యక్తిత్వం ఈయనిది.. ఒకానొక సందర్భంలో ఊరి పెద్ద కుట్ర వల్ల ఎన్నో అవస్థలను వెంకట్రావు గారి కుటుంబం భరించింది. అవన్నీ తట్టుకొని నేడు గౌరవంగా జీవనంసాగిస్తున్నారు .. నిగర్వం నవ్వుతూ నవ్విస్తూ వుండడం దువ్వాడ వెంకట రావు గారి గొప్పతనం... ఊరు నైసర్గికంగా తూర్పు కనుమల దిగువున ఉందని చెప్పుకోవచ్చు. మంచి దట్టంగా ఉన్న అడవులు ఉన్నా, చుట్టు పక్కల ఉండే ఆటవికా తెగల జీవనాధారం ఈ అడవులు అందించే కలప కావటంతో పచ్చదనం అంతరించి పోతున్నది.ఇక్కడ నుంచి తూర్పు కనుమలలో ఉన్న ఏత్తైన శిఖరమయిన మహేంద్ర గిరికి వెళ్ళటానికి కొంత వరకు బస్సు మార్గం ఉంది. మహాభారతంలో వివరించ బడ్డ పాండవులకు దేవాలయాలు ఉండటం ఈ మహేంద్రగిరి ప్రత్యేకత. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన మహేంద్ర గిరికి వేలాది మంది ప్రజలు తరలి వస్తారు. మహేంద్రగిరి నుంచి బంగాళాఖాతం మీదుగా ఉదయించే సూర్యుడుని దర్శించటం అద్భుతంగా ఉంటుంది అంటారు యాత్రికులు.చిన్నబరంపురం ఊరి శివార్లలో చారిత్రక శ్రీమన్నారాయుని ఆలయం, కలువమ్మా, పాలపోలమ్మ అమ్మ వార్ల గుడులు ఉన్నాయి.ఈ ఊరి యువకులు చాలా మంది ఉపాధ్యాయులు గానూ, సైనికులుగానూ, ఇంజినీర్ల గాను, కళా రంగంలోనూ, మీడియా లోనూ వారి వారి సేవలందిస్తున్నారు.
ఈ గ్రామం ముఖ్యంగా వ్యవసాయిక కుటుంబీకుల గ్రామం. జనాభా మూడువందలకు పైనే. ఈ గ్రామంలో కాళింగ, కాపు కుటుంబాలతో పాటు కుంధర కుటుంభాలు చాలా ఉన్నాయి. ఈ కుంధర వాళ్ళు ఒడిషా నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డవారు. వీళ్ళ వృతి ఆధారంగానే వీరికి కుంధర అనే పేరు వచ్చింది. వీరు చెక్కతో కుంచాలు, అడ్డ (ధాన్యం కొలవటానికి ఉపయోగించే ఒక రాక మయిన పాత్ర) ఫ్లవర్ వాజులు, బొమ్మలు తయారు చేస్తారు. ఈ రకంగా తయారు చేసిన వాటిని ఊర్ల లోను, రైళ్ల లోను అమ్ముతారు. ఊరు నైసర్గికంగా తూర్పు కనుమల దిగువున ఉందని చెప్పుకోవచ్చు. మంచి దట్టంగా ఉన్న అడవులు ఉన్నా, చుట్టు పక్కల ఉండే ఆటవికా తెగల జీవనాధారం ఈ అడవులు అందించే కలప కావటంతో పచ్చదనం అంతరించి పోతున్నది. ఇక్కడ నుంచి తూర్పు కనుమలలో ఉన్న ఏత్తైన శిఖరమయిన మహేంద్ర గిరి కి వెళ్ళటానికి కొంత వరకు బస్సు మార్గం ఉంది. మహాభారతంలో వివరించ బడ్డ పాండవులకు దేవాలయాలు ఉండటం ఈ మహేంద్రగిరి ప్రత్యేకత. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన మహేంద్ర గిరికి వేలాది మంది ప్రజలు తరలి వస్తారు. మహేంద్రగిరి నుంచి బంగాళాఖాతం మీదుగా ఉదయించే సూర్యుడుని దర్శించటం అద్భుతంగా ఉంటుంది.