చిరియాఖానా

సత్యజిత్ రే దర్శకత్వంలో 1967లో విడుదలైన బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా

చిరియాఖానా[1] 1967 సెప్టెంబరు 29న విడుదలైన బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. శరదిందు బాండ్యోపాధ్యాయ రాసిన కథ ఆధారంగా,[2] సత్యజిత్ రే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉత్తమ్ కుమార్, బ్యోమకేష్ బక్షి పాత్రలో నటించాడు.[3] ఈ సినిమాకు సత్యజిత్ రే స్క్రీన్ ప్లే రాశాడు. ఉత్తమ్ కుమార్ నటనకు చాలామంది విమర్శకులచే ప్రశంసలు వచ్చాయి. 1968లో జరిగిన 15వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమాకు సత్యజిత్ రే జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డును, నటుడు ఉత్తమ్ కుమార్ జాతీయ ఉత్తమ నటుడిగా (ఆంథోనీ ఫిరింగీ, చిరియాఖానా సినిమాలో నటనకు) అవార్డును అందుకున్నారు.[4][5]

చిరియాఖానా
చిరియాఖానా సినిమా పోస్టర్
దర్శకత్వంసత్యజిత్ రే
రచనశరదిందు బాండ్యోపాధ్యాయ
సత్యజిత్ రే
నిర్మాతహరేంద్రనాథ్ భట్టాచార్య
తారాగణంఉత్తమ్ కుమార్
Narrated byఅజిత్
ఛాయాగ్రహణంసౌమేందు రాయ్
కూర్పుదులాల్ దత్తా
సంగీతంసత్యజిత్ రే
నిర్మాణ
సంస్థ
స్టార్ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుబలాక పిక్చర్స్
విడుదల తేదీ
29 సెప్టెంబరు 1967
సినిమా నిడివి
125 నిముషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ

నటవర్గం

మార్చు
  • ఉత్తమ్ కుమార్ (బ్యోమకేష్ బక్షి)
  • షైలెన్ ముఖర్జీ (బ్యోమకేష్ బక్షి)
  • సుశీల్ మజుందార్ (నిశానాథ్ సేన్)
  • కాళిపాద చక్రవర్తి (రాసిక్‌లాల్ దే)
  • జహర్ గంగూలీ (రామెన్ మల్లిక్)
  • సుశేందు ఛటర్జీ (నిషానాథ్ మేనల్లుడు బిజోయ్)
  • ప్రసాద్ ముఖర్జీ (రసాయన శాస్త్రవేత్త-మాజీ ప్రొఫెసర్ నేపాల్ గుప్తా)
  • బంకిం ఘోష్ (బ్రజాదాస్‌)
  • నృపతి చటోపాధ్యాయ (ముష్కిల్ మియా)
  • సుబ్రతా ఛటర్జీ (ముస్కిల్ మియా భార్య నాజర్ బీబీ)
  • కనిక మజుందార్ (దమయంతి)
  • శ్యామల్ ఘోషల్ (డా. భుజంగాధర్ దాస్)
  • చిన్మోయ్ రే (మూగ బాధితుడు పాన్ గోపాల్)
  • గీతాలి రే (సునయన/బనలక్ష్మి/నృత్యకళి దాస్)
  • శేఖర్ ఛటర్జీ
  • రూపక్ మజుందార్

అవార్డులు

మార్చు
పురస్కారం అవార్డు అవార్డు గ్రహీత ఫలితం
15వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ దర్శకత్వం సత్యజిత్ రే విజేత
ఉత్తమ నటుడు ఉత్తమ్ కుమార్ విజేత

మూలాలు

మార్చు
  1. Bhattacharya Supriya (2009). Impressions 8, 2/E. Pearson Education India. p. 1. ISBN 978-81-317-2777-5.
  2. Mohit Gandhi. Byomkesh Bakshi. Prabhat Prakashan. pp. 4–.
  3. Andrew Robinson (1989). Satyajit Ray: The Inner Eye. University of California Press. pp. 231–. ISBN 978-0-520-06946-6. Retrieved 16 July 2012.
  4. "National Awards for Films: Uttam Kumar (1967)" (PDF). Dff.nic.in. Directorate of Film Festivals. 25 November 1968. p. 29. Archived from the original (PDF) on 28 September 2011. Retrieved 2021-08-08.
  5. The Times of India, Entertainment. "National Awards Winners 1967: Complete list of winners of National Awards 1967". timesofindia.indiatimes.com. Archived from the original on 24 March 2020. Retrieved 11 August 2021.

బయటి లింకులు

మార్చు