చిలకలూరిపేట పురపాలక సంఘం

చిలకలూరిపేట పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం నరసరావుపేట లోకసభ నియోజకవర్గంలోని, చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చిలకలూరిపేట పురపాలక సంఘం
చిలకలూరిపేట
స్థాపన1964
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
చిలకలూరిపేట
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్రసవరించు

చిలకలూరిపేట పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 78 కి.మీ దూరంలో ఉంది. పురుషోత్తమపట్నం నుంచి చిలకలూరిపేట గా పేరు మార్పు చేసి, చిలకలూరిపేట పంచాయితీ హోదా నుంచి 1964 జనవరి 30 న మూడవ స్థాయి పురపాలక సంఘంగా స్థాపించబడినది.1964లో మున్సిపాలిటీ గా ఆవిర్భవించిన చిలకలూరిపేటకు 1967 లో తొలిసారి పురపాలక ఎన్నికలు జరిగాయి. తొలి చైర్మన్ గా శ్రీకృష్ణ వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. పదవిలో కొనసాగుతూనే మృతి చెందడంతో ఆయన స్థానంలో బచ్చు రామలింగం చైర్మన్ అయ్యారు. 1980 ఏప్రిల్ 28 న 3వ స్థాయి నుంచి రెండొవ స్థాయి పురపాలక సంఘముగా పదోన్నతి పొందింది. 2001 మే 18న రెండవ స్థాయి నుంచి మొదటి స్థాయి పురపాలక సంఘo గా అవతరించింది.ప్రధాన వృత్తిలు పత్తి, పొగాకు, మిరపకాయలు పంటలను పండిస్తారు.[1]

జనాభా గణాంకాలుసవరించు

చిలకలూరిపేట పురపాలక సంఘం లో 34 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 101,398 జనాభా ఉండగా అందులో పురుషులు 50,207,మహిళలు 51,191 మంది ఉన్నారు.అక్షరాస్యత 71.54% ఉండగా అందులో పురుష జనాభాలో 79.90%, స్త్రీ 63.43% జనాభాలో అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 10,242 ఉన్నారు.[2]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్సవరించు

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా ‌జి. చెంచు కుమారి పనిచేస్తుంది.[3]వైస్ చైర్మన్‌గా రాచమల్లు బద్రి నారాయణ మూర్తి పనిచేస్తున్నాడు.[3]

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-21. Retrieved 2020-06-20.
  2. "Chilakaluripet City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-20.
  3. 3.0 3.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబర్ 2019. Retrieved 13 May 2016. {{cite web}}: Check date values in: |archive-date= (help)

వెలుపలి లంకెలుసవరించు