చిలివేరు రామలింగం
చిలివేరు రామలింగం (జననం: 1942, మరణం: సెప్టెంబర్ 12, 2003) తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ (ఇప్పటి యాదాద్రి భువనగిరి) జిల్లాలోని భూదాన్ పోచంపల్లికి చెందిన గొప్ప నేత కళాకారుడు. నూలుతోనే చిత్రపటాలను నేయడం ఇతని ప్రత్యేకత. ఇతను చేనేత ఖ్యాతిని ఖండాతరాలకు వ్యాపింప జేశాడు.[1]
చిలివేరు రామలింగం | |
---|---|
జననం | 1942 నల్గొండ, తెలంగాణ |
మరణం | సెప్టెంబర్ 12, 2003 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నేత కళాకారుడు |
వ్యక్తిగత జీవితం
మార్చురామలింగం, నల్గొండ జిల్లాలోని జూలూరు గ్రామంలో పద్మశాలి కుటుంబానికి చెందిన రామస్వామి, మణెమ్మ దంపతులకు 1942లో జన్మించాడు. ఇతనికి చిన్నప్పటి నుండి కళల మీద ఎక్కువగా ఆసక్తి ఉండేది. రామలింగం, అనసూయ దంపతులకు ఐదుగురు కొడుకులు ఉన్నారు. వీరిలో ఒకరు మృత్యుంజయ్.[2] ఇతను గొప్ప కార్టూనిస్ట్.
వృత్తి
మార్చురామలింగానికి కళల మీద ఉన్న ఇష్టంతో ఎక్కువగా పోట్రెయిట్ లు నేసేవాడు. వాటిలో గాంధీ, నెహ్రు, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్, అంజయ్య ఇంకా ఎందరివో ఉన్నాయి. ఆడవాళ్లు పనికి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఎత్తుకోవడానికి వీలుగా “మూడు కొంగుల చీర” ను నేసాడు.[3] దీనిని ఎటువంటి అతుకులు లేకుండా మగ్గం పైనే నేసాడు. కత్తిరించడం, అతికించడం, కుట్టు లేకుండా షర్ట్ లు, పైజామాలు, కుర్తాలు, గాంధీ టోపీలు నేసేవాడు. గొడుగులు కూడా నేసేవాడు. ఎక్కువగా “టై అండ్ డై” పద్దతిని వాడేవాడు. ఉత్తరాదిలో ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా రామలింగానికి అవార్డ్ తప్పకుండా వచ్చేది.
ఇతర విషయాలు
మార్చు- బోనాల పండుగ రోజు ఎడ్ల బండి మీద మగ్గం పెట్టుకొని అమ్మవారికి చీర నేసేవాడు. గుడి దగ్గరికి వచ్చేసరికి చీర నేయడం పూర్తి అయ్యేది.
"నువ్వు పట్టుచీర కడితేను పుత్తడిబొమ్మ
ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ "
అన్నట్టుగా ఇతను నేసిన చీరను అమ్మవారికి కడితే తప్ప బోనాల పండుగ ముగిసేది కాదు.[4]
- మృత్యుంజయ్ ఇంటర్నెట్ లో కార్టూనిస్టుల క్యారికేచర్లు వేసే ‘బెల్జియం అబ్దివిక్’ సైట్ లో జాన్ క్యారికేచర్లు చూస్తూ అతనితో మాట్లాడినప్పుడు 'మా ఇండియాలో మీకేవరన్నా తెలుసా మీకేదైనా కావాలా' అని అడిగినప్పుడు, అందుకు సమాధానంగా జాన్ “ నేను ఒక వ్యక్తి గురించి ఇంటర్నెట్ లో చదివాను, మిత్రుల దగ్గర విన్నాను. మంచి ఆర్టిస్ట్ “ తేలియా రుమాల్ అఫ్ ఆంధ్రప్రదేశ్ “ అనే సచిత్ర వ్యాసం ఉంది. దాన్ని చదివి నేను ఎంతో ఇంప్రెస్ అయ్యాను. ఆ టెక్నిక్స్ గురించి తెలుసుకోవాలని ఉంది అని అన్నాడు. అపుడు మృత్యుంజయ్ అతను మా నాన్నగారు అని చెప్పాడు.[2]
- ఆస్ట్రేలియా నుండి వచ్చిన ఓ టెక్స్టైల్ నిపుణుడు ‘డానామేకౌన్’ రామలింగం పనితనం మీద పెద్ద వ్యాసం రాశాడు. అది ‘అలి జారిన్ డై’ తో ప్రత్యేకంగా రంగులు దిద్దే రామలింగం పనితనం మీద వ్యాసం ఉండటం విశేషం.
- సినీ డైరెక్టర్ అయిన శ్యాం బెనగల్ బోనాల పండుగ అప్పుడు రామలింగం పనితనం చూసి రామలింగంతో మాట్లాడి ‘సుష్మన్ ‘ సినిమాని తీశాడు. ఆ సినిమా తీస్తున్నప్పుడు శ్యాం బెనగల్ రామలింగానికి 10,000/- రూపాయలు బహూకరించాడు. అలాగే రామలింగం, స్విట్జర్లాండ్ దేశస్తులు వచ్చినపుడు పచ్చీస్ ఆడుకునే గుడ్డను రంగులతో తయారు చేసి ఇచ్చాడు.
- అతని జీవితంలో నేసిన నేత బొమ్మల్లో పండిట్ నెహ్రూ చిత్రాన్ని వస్త్రంపై నేసేందుకు 246 కొయ్యలను ఉపయోగించాడు, నెహ్రు గుండెలపై ఉండే గులాబీని అత్యంత ఆకర్షణీయంగా నేసేందుకు అతనికి ఆరు రోజులు పట్టింది.
- పోచంపల్లికి ఎవరు వచ్చిన తాను నేసిన పులామాలతోనే స్వాగతం పలికేవాడు.[5]
మరణం
మార్చురామలింగం సెప్టెంబర్ 12, 2003 న మరణించాడు.[5]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "తెలంగాణ చేనేత జాతి రత్నం చిలువేరు రామలింగం | Trending Telugu News". 2021-04-05. Retrieved 2022-03-14.
- ↑ 2.0 2.1 "రామలింగం కొడుకు..... కార్టూన్ కళాకారుడు". Telupu TV - Telugu News. 2021-09-03. Retrieved 2022-03-14.[permanent dead link]
- ↑ "one more thought: My father Chiluveru Ramalingam's IKAT ART". one more thought. 2012-08-09. Retrieved 2023-07-23.
- ↑ "బోనాల పండుగకు చిలువేరు రామలింగం చీర | Trending Telugu News". 2021-04-05. Retrieved 2022-03-14.
- ↑ 5.0 5.1 "నేతన్న పూలమాల | Trending Telugu News". 2021-04-05. Retrieved 2022-03-14.