శ్యామ్ బెనగళ్
శ్యామ్ బెనగళ్ భారతీయ సినీదర్శకుడు, చిత్ర రచయిత. చాలా దూరదర్శన్ సీరియల్ లకు కూడా దర్శకత్వం వహించారు. అనేక అవార్డులు పొందారు. తను తీసిన నాలుగు సినిమాలు - అంకుర్ (1973), నిషాంత్ (1975), మంతన్ (1976), భూమిక (1977) తో భారతీయ సినీ రంగంలో మధ్యేవాద సినిమా (మిడిల్ సినిమా) అనే కొత్త ఒరవడిని, వర్గాన్ని సృష్టించాడు.[1] ఈయన చేసిన కృషికి కాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ పురస్కారాన్ని, 1991లో పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. 2007, ఆగస్టు 8 న భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2005 సంవత్సరానికి గాను అందుకున్నాడు. భారత జాతీయ సినిమా అవార్డులలో శ్యాం బెనగళ్ ఏడు సార్లు హిందీలో అత్యుత్తమ సినిమా అవార్డును అందుకున్నాడు.
Shyam Benegal श्याम बेनेगल | |
---|---|
![]() శ్యాం బెనెగల్, అతని ఆఫీసులో, ముంబయి, భారతదేశం , డిసెంబరు, 2010 | |
జననం | 14 డిసెంబరు 1934 తిరుమలగిరి, హైదరబాద్ రాజ్యం, బ్రిటీష్ రాజ్ (ఇప్పుడు తెలంగాణా, భారతదేశం) |
వృత్తి | సినీ దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత, సినీ నిర్మాత, రాజకీయ నాయకులు |
జీవిత భాగస్వామి | నీరా బెనెగల్ |
పిల్లలు | పియా |
పురస్కారాలు | పద్మభూషణ్ పురస్కారం, కళలలో పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, Filmfare Award for Best Director, honorary doctor of the University of Calcutta |
జననం 1934 డిసెంబరు 14న అల్వాల్, హైదరాబాదులో జన్మించిన శ్యామ్ బెనగళ్, ప్రఖ్యాత హిందీ నటుడు, దర్శకుడు గురుదత్ దూరపు బంధువు. ఈయన సికింద్రాబాదులోని మహబూబ్ కళాశాలలో చదువుకున్నాడు.
సినిమాలుసవరించు
- దూరదర్శన్ ధారావాహికలు
- అమరావతి కథలు (తెలుగు, హిందీ)
- భారత్ ఏక్ ఖోజ్ (హిందీ) (1988)
- కథా సాగర్ (హిందీ) (1986)
- యాత్రా (హిందీ) (1986)
- అవార్డులు
మూలాలుసవరించు
- ↑ "Indian directors at filmofdesire". Archived from the original on 2007-07-02. Retrieved 2009-07-11.