చిల్లరకొట్టు చిట్టెమ్మ

ఇది 1977, అక్టోబరు 7న విడుదలైన ఒక తెలుగు సినీమా. దాసం గోపాలకృష్ణ రాసిన 'చిల్లరకొట్టు చిట్టెమ్మ' గోదావరి జిల్లాలలో ప్రాచుర్యంలో ఉన్న నాటకం. ఆ నాటకం ఆధారంగా దాసరి దర్శకత్వంలో నిర్మించబడిన చిత్రమిది. ఈ చిత్ర విజయంలో నపుంసక వేషం వేసిన శ్రీ మాడా వెంకటేశ్వరరావు గారు ప్రధాన పాత్ర పోషించారు.

చిల్లరకొట్టు చిట్టెమ్మ
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం మురళీమోహన్,
జయచిత్ర,
మాడా,
గోకిన రామారావు
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ లక్ష్మీ జ్యోతి ఫిల్మ్స్
భాష తెలుగు

చిత్రకథ

మార్చు

దత్తుడు (మురళీమోహన్) నిర్మల కొడుకు, జీళ్ళ సీతయ్య (గోకిన రామారావు) మరదలు చిట్టెమ్మ (జయచిత్ర) చిన్నప్పటినుండి ప్రేమించుకుంటారు. ఆస్తిపరుడైన దత్తుడ్ని వేరే అమ్మయికిచ్చి పెళ్ళి చేస్తారు. చిట్టెమ్మ అక్క మరణించడంతో చిట్టెమ్మ వయసులో చాలా పెద్దవాడైన బావను పెళ్ళి చేసుకోవసి వస్తుంది. చిల్లర కొట్టు (పచారీ సరుకులు అమ్మే దుకాణం, మిని సూపరు బజారు వంటిది) నడపటం వల్ల చిట్టెమ్మ, చిల్లరకొట్టు చిట్టెమ్మ అయ్యింది. ఆమెను బట్టల వర్తకుడు, బంగారు నగల వర్తకులు లోబరచుకోవాలని చూస్తారు. వీలుకాక ఆమె మీద పుకార్లు సృష్టిస్తారు. అనుమానంతో జీళ్ళసీతయ్య చిట్టెమ్మను నరికేస్తాడు.

పాటలు

మార్చు
  1. ఏంటబ్బాయా యిదేంటబ్బాయా నా దుంప - ఎస్.పి.బాలు, ఎస్. జానకి - రచన: దాసం గోపాలకృష్ణ
  2. తల్లి గోదారికే ఆటుపోటుంటె తప్పుతుందా మనిషికి - రమేష్ నాయడు - రచన: డా. సినారె
  3. తాటి చెట్టు తల్లికాదు .. తాగినోడు మొగుడు కాదు - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
  4. చీటికి మాటికి చిట్టెమ్మంటె చీపురు దెబ్బలు తింటావురో - ఎల్. ఆర్. అంజలి, శారద - రచన: దాసం గోపాలకృష్ణ
  5. సువ్వీ కస్తూరి రంగా సువ్వీ కావేటి రంగా - ఎస్.జానకి, ఎస్.పి. బాలు - రచన: దాసం గోపాలకృష్ణ
  6. చూడు పిన్నమ్మా పాడు పిల్లోడు పైన పైన పడతనంటడు - ఎస్.పి. బాలు - రచన: దాసం గోపాలకృష్ణ
  7. సుక్కల్లో పెదసుక్క సందమామా వెలుగులకే వెలుగమ్మ - పి.సుశీల - రచన: డా. సినారె

జనాదరణపొందిన సంభాషణలు

మార్చు
  • మాడా: నక్కలు బొక్కలు వెతుకుతై... కుక్కలు చెప్పులు వెతుకుతై
  • మాడా: చిత్రాల మొగుడు ఉత్తరమేస్తే ... చింతల తోపుల్లో చిక్కుకున్నదట
  • మాడా: ఇంటింటిముందు ఇటుకల పొయ్యి .. మా ఇంటి ముందర మట్టి పొయ్యి
  • మాడా: దుంగలు మొయ్యాలా ... దూలాలు మొయ్యాలా?

అవార్డులు

మార్చు

మూలాలు

మార్చు