దాసం గోపాలకృష్ణ

దాసం గోపాలకృష్ణ ప్రముఖ నాటక రచయిత, సినీ గేయ రచయిత.

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు పశ్చిమ గోదావరి జిల్లా, గణపవరం మండలం, దాసుళ్ల కుముదవల్లి గ్రామంలో 1930, ఫిబ్రవరి 13న జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం భీమవరంలో జరిగింది. బి.ఎ. చదువుకున్నాడు. నండూరి రామకృష్ణమాచార్య, అడివి బాపిరాజు మొదలైన ఉద్దండులు ఇతనికి గురువులు. ఇతనికి 1953 నుండి సినిమా రంగంతో సంబంధం ఉన్నా 1972లో పసివాని పగ సినిమాతో ప్రత్యక్షంగా సినీరంగ ప్రవేశం చేశాడు.[1]

నాటక రంగం

మార్చు

ఇతడు చిల్లరకొట్టు చిట్టెమ్మ, రాగజ్వాల, చిలకా గోరింక అనే సాంఘిక నాటకాలను, పున్నమదేవి అనే చారిత్రక నాటకాన్ని రచించాడు. ఇతని చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటకాన్ని చూసిన ఇతని గురువు నండూరి రామకృష్ణమాచార్య కన్యాశుల్కం నాటకం తరువాత మళ్లీ ఒక గొప్పనాటకాన్ని చూశానని ప్రశంసించాడు. ఈ నాటకంలో నటించిన రత్నకుమారి అనే నటి తరువాతి కాలంలో వాణిశ్రీ అనే పేరుతో సినిమాలలో కథానాయికగా పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఈ నాటకాన్ని దాసరి నారాయణరావు అదే పేరుతో తెరకెక్కించాడు.

సినిమా రంగం

మార్చు

ఇతడు చిల్లరకొట్టు చిట్టెమ్మ, కుడి ఎడమైతే, మంగళ తోరణాలు, ప్రెసిడెంటు పేరమ్మ, అయినవాళ్ళు వంటి కొన్ని సినిమాలకు కథ, సంభాషణలు వ్రాసినా గీతరచయితగానే ప్రసిద్ధి చెందాడు. ఇతడు సుమారు 80 పాటలు వ్రాశాడు.

ఇతడు రచించిన సినీ గీతాల పాక్షిక జాబితా:

క్రమసంఖ్య సినిమా పేరు పాట పల్లవి గాయకుడు సంగీత దర్శకుడు సినిమా విడుదలైన సంవత్సరం
1 పసివాని పగ సీసా మీద చెయ్యి పుహళేంది 1972
2 వింత కథ గోరొంత దీపం కొండలకు వెలుగు నా చిట్టి కన్నయ్య పి.సుశీల పుహళేంది 1972
3 తిరపతి దేశం పన్నెండు సార్లు నారాయణ నే చుట్టు తిరిగివచ్చా నారాయణ అల్లు రామలింగయ్య, ఎస్.జానకి చక్రవర్తి 1974
4 పల్లె పడుచు పేదలపాలిటి పెన్నిదివమ్మవేదశాలకు వేలుపువమ్మా ఎల్.ఆర్.ఈశ్వరి బృందం ఎస్.రాజేశ్వరరావు 1974
5 చిల్లరకొట్టు చిట్టెమ్మ ఏంటబ్బాయా యిదేంటబ్బాయా నా దుంప ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి రమేష్ నాయుడు 1977
6 చిల్లరకొట్టు చిట్టెమ్మ చీటికి మాటికి చిట్టెమ్మంటె చీపురు దెబ్బలు తింటావురో ఎల్.ఆర్.అంజలి, శారద రమేష్ నాయుడు 1977
7 చిల్లరకొట్టు చిట్టెమ్మ చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతనంటడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రమేష్ నాయుడు 1977
8 చిల్లరకొట్టు చిట్టెమ్మ సువ్వీ కస్తూరి రంగ సువ్వి కావేటి రంగ ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రమేష్ నాయుడు 1977
9 అనుకున్నది సాధిస్తా అయ్యోడప్పారాంతడక ఆవురావురు పడక ఎస్.జానకి, ఆనంద్ రమేష్ నాయుడు 1978
10 దేవదాసు మళ్లీ పుట్టాడు ఓపలేకున్నాను సెందురుడా మనసు నిలుపలేకున్నాను పి.సుశీల, రామకృష్ణ ఎస్.రాజేశ్వరరావు 1978
11 రౌడీ రంగమ్మ చెట్టు కొట్టగలవా ఒ నరహరి గుడిసెకట్ట గలవా పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రమేష్ నాయుడు 1978
12 రౌడీ రంగమ్మ సెక్క బల్ సెక్క రోలుబండోలు మక్కెలిరిసేస్తా పి.సుశీల రమేష్ నాయుడు 1978
13 శివరంజని జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరేవరికోసమే తుమ్మెదా పి.సుశీల రమేష్ నాయుడు 1978
14 శివరంజని నీ అమ్మవాడు నాకోసం ఈని ఉంటాడు మా బాంబువాడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రమేష్ నాయుడు 1978
15 శివరంజని పాలకొల్లు సంతలోన పాపాయమ్మా పాపయమ్మో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల రమేష్ నాయుడు 1978
16 శివరంజని చందమామ వచ్చాడమ్మా తొంగి తొంగి నిను చూసాడమ్మా పి.సుశీల రమేష్ నాయుడు 1978
17 శివరంజని మాపల్లెవాడలకు కృష్ణమూర్తి నువ్వు కొంటెపనులకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ రమేష్ నాయుడు 1978
18 కళ్యాణి గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా గుండెలనే పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రమేష్ నాయుడు 1979
19 కళ్యాణి నవరాగానికే నడకలు వచ్చెను మధు పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రమేష్ నాయుడు 1979
20 కళ్యాణి లేత లేత యెన్నెల్లో నీలి నీలి చీర కట్టి నూకాలమ్మ జాతర ఎస్.జానకి రమేష్ నాయుడు 1979
21 కోరికలే గుర్రాలైతే రే రే రేక్కాయలో ఆ రే రే రేక్కాయలో.. సందెకాడ సిన్నోడు ఎస్.జానకి బృందం సత్యం 1979
22 పెద్దిల్లు చిన్నిల్లు ఏవే నిన్ను సూత్తంటె ఒక పాటొకటి పాడించుకోవాలని పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సత్యం 1979
23 పెద్దిల్లు చిన్నిల్లు స్వర్గమన్నది పైన ఎక్కడో లేదురా ఎర్రోళ్ళు తెలియక ఎతుకుతున్నార్రా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సత్యం 1979
24 పెద్దిల్లు చిన్నిల్లు పచ్చబొట్టు పొడిపించు బావా ఓ బావా పి.సుశీల సత్యం 1979
25 ప్రెసిడెంటు పేరమ్మ కూత్ కూత్ కూత్ కూత్ కుక్కపిల్లలు రొట్టెముక్కలు చూపిస్తె ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చక్రవర్తి 1979
26 మంగళ తోరణాలు సందెమెళ్లిపోగానే చందురుడు రాగానే పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రమేష్ నాయుడు 1979
27 మంగళ తోరణాలు కుర్రవాడే అల్లరోడే ఎస్.జానకి రమేష్ నాయుడు 1979
28 రావణుడే రాముడైతే అహ ఉస్కో ఉస్కో పిల్లా చూస్కో చూస్కో మల్లా పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం జి.కె.వెంకటేష్ 1979
29 రావణుడే రాముడైతే ఉప్పుచేప పప్పుచారు కలిపి కలిపి కొట్టాలి తాయారమ్మ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం జి.కె.వెంకటేష్ 1979
30 అల్లుడు పట్టిన భరతం గరం గరం బల్ జోరు గరం ముంతక్రింద పప్పు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చక్రవర్తి 1980
31 పసుపు పారాణి అయిబాబోయి అయిబాబోయి అమ్మనాయనోయ్ పి.సుశీల రమేష్ నాయుడు 1980
32 పసుపు పారాణి ఆ ముద్దబంతులు పసుపురాసులు పోసే వాకిళ్ళ ముందు పి.సుశీల రమేష్ నాయుడు 1980
33 పసుపు పారాణి ఎర్ర ఎర్రని దాన ఏపైన వయసు దాన ఎర్ర కమలాల జోడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రమేష్ నాయుడు 1980
34 పసుపు పారాణి రేవులోని చిరుగాలి రెక్కలార్చుకొంటోoది ఆవులించి చిరుకెరటం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల రమేష్ నాయుడు 1980
35 ఓ అమ్మకథ గరువుకాడ చెరువుకాడ గడ్డివాము మలుపు కాడ ఎస్.జానకి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1981
36 ఓ అమ్మకథ తాగి సెడిపోకుమప్పా తాగితే సేతికి సిప్ప ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1981
37 ఓ అమ్మకథ నీకు నాకు దూరమాయే నెలమీది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1981
38 రాజకుమార్ అమ్మమ్మో అబ్బబ్బో అయ్యయ్యో అలో అయ్యో సలపరం ఎస్.జానకి ఇళయరాజా 1983

ఇతడు 1993, మార్చి 10వ తేదీన మరణించాడు.

మూలాలు

మార్చు
  1. పైడిపాల (2010). తెలుగు సినీ గేయ కవుల చరిత్ర (ప్రథమ ed.). చెన్నై: స్నేహ ప్రచురణలు. pp. 265–266.