చీమ (ఆంగ్లం: Ant) ఒక చిన్న కీటకము. ఇది తనకంటే రెట్టింపు బరువును మోయగలుగుతుంది. ఇవి భూమిని గుల్లగా చేస్తూ పుట్టలను కడుతుంటాయి.

చీమలు
Temporal range: Cretaceous - Recent
Meat eater ant feeding on honey
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
Superfamily:
Family:
ఫార్మిసిడె

Latreille, 1809
ఉపకుటుంబాలు

ఐకమత్యం అనగానే ముందు చీమలే గుర్తుకొస్తాయి. ఒకే పుట్టలో కలిసి ఉండడమే కాదు, వాటి పని అవి సక్రమంగా చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి కూడా. చీమలు పుట్టుకొచ్చింది కందిరీగల నుంచే. ఇవి సుమారు 10 కోట్ల ఏళ్ళ కిందట కందిరీగలతో విడిపోయి, ప్రత్యేక జీవులుగా రూపొందాయి. సుమారు 11,880 జాతులుగా గతంలో గుర్తించిన శాస్త్రవేత్తలు నిరంతర కృషి ఫలితంగా మే 2024 నాటికి వాటిని 16,724గా ప్రకటించారు. వీటిలో అత్యంత అరుదుగా కనిపించే నీలి రంగు చీమల (పారాపారాట్రెకినా నీల)ను అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సియాంగ్‌ లోయలో పరిశోధకులు కనుగొన్నారు.[1]

ప్రపంచంలో మొత్తం చీమలను కలిపితే వాటి బరువు, మనుషుల బరువు ఉంటుంది.[2] మానవులకు మల్లే చీమలకు ఊపిరితిత్తులు, గుండె ఉండవు. రక్తానికి రంగు కుడా ఉండదు. అయినా, తమ కన్నా 20 రెట్ల బరువునైనా ఇట్టే మోస్తాయి. ఇది ఒక సాధారణ మానవుడు 1000 కిలోల బరువు మోయడంతో సమానం మరి. శరీరం పై కవచానికి ఉండే సన్నని రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. బయటకు కనబడేవి రెండు కళ్ళే అయినా, వాటిల్లోనే చిన్నచిన్న కళ్ళు బోలెడన్ని కలిసి ఉంటాయి. ఈగలకు ఉన్నట్టుగా అన్నమాట. తల మీద అటూ ఇటూ కదిలే కొమ్ముల్లాంటి అంటెన్నాలతో, తాము విడుదల చేసే రసాయనాల వాసనను పసిగట్టి మాట్లాడేసుకుంటాయి. ఇక చీమల కోరలు బలం అంతా ఇంతా కాదు.

భాషా విశేషాలు

మార్చు

తెలుగు భాషలో చీమ పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[3] చీమలో పెద్దవైన అడవీ ప్రాంతాలలో కనిపించేవాటిని కొండచీమ. the forest ant అంటారు. రెక్కలతో ఎగరగలిగే చీమలను రెక్కలచీమ a winged ant అంటారు. చీమదూరని అడవి అంటే చాలా దట్టమైన అడవి అని అర్ధం. చిన్న నల్ల చీమల్ని చలిచీమ a black ant లు అని పిలుస్తారు. పై పారేపక్షి కిందపారే చీమ (సామెత) The bird above, the ant below, i.e., I had no chance with him. చిన్న పరిమాణాన్ని చెప్పడానికి చీమంత of the size of an ant అంటాము. చీమపులి అనగా The ant lion, an ant-eater.

(వీడియో) చీమలు ఆహారాన్ని సేకరించడం

ఆవాసం

మార్చు
 
చీమల పుట్ట, వర్షాకాలంలో నీరు లోనికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది.
 
గండు చీమ

పుట్టలను కట్టుకోవడంలో చీమల తెలివి అంతా ఇంతా కాదు. వాసలు కురిసినా పడిపోకుండాఆ గోడలు బలంగా ఉండేందుకు మట్టి, ఇసుకల్లో పుల్లలను కలిపేస్తాయి. లోపల చాలా అరలు ఉంటాయి. ఒక్కో అవసరానికి ఒక్కో అర. కొన్నింటిలో ఆహారం దాచుకుంటే.. మరికొన్నింటిలో పిల్లల పెంపకం. ఇంకొన్ని గదుల విశ్రాంతి కోసం. అయితే, అన్ని గదులను కలిపేలా దారులు ఏర్పాటు చేసుకోవడం మాత్రం మరచిపోవు. కొన్నిరకాల చీమలు చెట్ల కాండంలో ఇళ్ళను ఏర్పాటుచేసుకుంటాయి కూడా.

చిత్రమైన జీవన విధానాలు

మార్చు

కలిసికట్టుగా జీవించడంలో, పనులను విభజించుకోవడంలో చీమలను మించినవి లేవు. ఒక పుట్టలో 80 లక్షల దాకా నివసిస్తాయి. రాణి చీమలు, శ్రామిక చీమలు, సైనిక చీమలు, కాపలా చీమలు. ఇలా వేటి పని వాటిదే. రెక్కలు ఉండే రాణి చీమ గుడ్లు పెట్టడంతప్ప మరేపని చేయదు. మగ చీమలు రాణి చీమలతో జత కలిశాక వెంటనే చనిపోతాయి. ఇక రాణికి సేవలు చేసేవేమో శ్రామిక చీమలు. ఇవి రాణి చీమ శరీరం నుంచి వచ్చే రసాయనాన్ని రుచి చూసి, దాని ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటాయి. గుడ్లను కాపాడడం, అవి లార్వా దశ నుంచి పిల్లలుగా మారి పెద్దయ్యే వరకు కనిపెట్టుకొని ఉంటాయి. పుట్టను కాపాడే పని సైనిక చీమలది. శత్రువులు దాడి చేశారని తెలియగానే కాపలా చీమలు ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. వాటిని పసిగట్టగానే సైనిక చీమలు ఒక్క పెట్టున దాడికి దిగుతాయి. ఇక మరో విశేషం ఏమిటంటే చీమలు నిద్రపోవు.[4]

సమాచార విప్లవం

మార్చు
 
నల్లచీమల పుట్ట

చీమల మాటలను ఒక రకంగా రసాయనిక భాష అనుకోవచ్చు. ఎందుకంటే.. ఏ విషయాన్ని అయినా తమలోంచి వచ్చే ' పెరోమోన్స్ ' ద్వారా తెలియజేస్తాయి. ఉదాహరణకు ఏ చీమకైనా ఆహారం కనబడిందనుకోండి. వెంటనే అది ' ఫెరోమోన్ 'ను దారి అంతటా విడుదల చేసుకుంటూ తమ ఇంటికి వస్తుంది. తిరిగి తన వారిని వెంటేసుకొని ఆ వాసనను బట్టి అక్కడికి చేరుకుంటుంది. ఇక చీమలు తమ స్థావరాన్ని ఎలా కనుక్కుంటాయంటే.. దారిలో ఉన్న కొండ గుర్తులతో పాటు సూర్యుడి దిశను గుర్తుపెట్టుకొని.

మూలాలు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. "అరుణాచల్‌లో అపూర్వమైన చీమలు | general". web.archive.org. 2024-06-05. Archived from the original on 2024-06-05. Retrieved 2024-06-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-11-16. Retrieved 2009-07-02.
  3. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం చీమ పదప్రయోగాలు". Archived from the original on 2016-01-25. Retrieved 2009-12-29.
  4. "Do Ants Sleep? No, They Only Take Naps. Know More About Tiny Creature". web.archive.org. 2022-05-29. Archived from the original on 2022-05-29. Retrieved 2022-05-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=చీమ&oldid=4230692" నుండి వెలికితీశారు