పుట్ట లేదా వల్మీకం మట్టి, ఇసుక, బంకమన్ను, చెత్తను కలిపి కూలీ చీమలు, చెదపురుగులు తమ గృహం ను నిర్మించుకొంటాయి. చీమలు నిర్మించినవాటిని చీమల పుట్ట (Anthill) అంటారు. అప్పుడప్పుడు పాములు వీటిలో నివాసాన్ని ఏర్పరచుకొంటాయి. అప్పుడు వీటిని పాముపుట్ట అంటారు. కీటకాలు గుంపు లేదా సమూహంగా ఉన్నా కూడా పుట్ట అని అంటారు.

సహజమైన పుట్ట

ఈ పుట్టలకు నాగుల చవితి రోజు హిందువులు నాగపూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత అక్కడి మట్టిని 'పుట్ట బంగారం' గా భావించి నుదుట గాని మెడకు గాని బొట్టుగా పెట్టుకుంటారు.

చీమల గూడు నిర్మాణం
చీమల పుట్ట

పాములు కీటకాలు, ఎలుకలు, ఉభయచరాలు వంటి జీవులను ఆహారంగా తింటాయి.గుడ్లు తినవు, పాలు త్రాగవు అని అంటారు.


భాషా విశేషాలు మార్చు

తెలుగు భాషలో పుట్ట పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] పుట్ట నామవాచకంగా An ant hill, వల్మీకము అని అర్ధం. పుట్టలో పాములు నివసిస్తే దానిని పాముపుట్ట అంటారు. నాగులచవితికి పుట్టలో పాలుపోస్తారు.

పుట్ట పదాన్ని సంఖ్యాపరంగా గుంపు, మూక అనే అర్ధంతో కూడా ఉపయోగిస్తారు. A pack, number, collection, lot heap, crowd. ఉదా: ఆ యిల్లు చీమలపుట్టగా నున్నది, ఆ పుస్తకము అబద్ధాలపుట్టగానున్నది, వాని ఒళ్లు వట్టినరములపుట్ట. పుట్టకాపు or పుట్టకూడుదిండి అనగా That which feeds on ant hills, i.e., a bear, ఎలుగుగొడ్డు లేదా ఎలుగుబంటి. పుట్టకాలు అనగా బూరకాలు, ఏనుగుకాలు. పుట్టకాలివాడు అనగా one who is afflicted with elephantiasis in the leg. పుట్టకుడు అనగా The heart of an ant hill, the red earth that contains the eggs. కుక్కగొడుగు, పుట్టకొక్కు, పుట్టగొడుగు or పుట్టచేర్పు అనగా A mushroom, toadstool, fungus. పుట్టకోట అనగా A bulwark, a buttress. కోటకు కోటబైట వేసిన మట్టితిన్నె. పుట్టకోవలు అనగా the pointed tops of ant hills, పుట్టమీది శిఖరములు. పుట్టగోచి అనగా A large modesty piece. పెద్ద గోచి, కాపీనము. పుట్టచిలుక అనగా The Sirkeer Cuckoo. Taccocua leschnenaultii, పుట్టచూలు or పుట్టపుట్టువు He who was 'born of an ant hill.' లేదా వాల్మీకి. పుట్టతమ్మచెట్టు అనగా A large creeping plant, the fruit of which is used medicinally. పుట్ట తేనె అనగా Honey found in an ant-hill. పుట్టతేలు The large black scorpion, so called because found in rubbish. మరిడ్రగబ్బ. పుట్టముంగి అనగా A mongoose on an ant hill, used as a type of composure. adj. Demure. అది తిట్టుచుండగా పుట్టముంగివలె మారకయుండినాడు she reviled him but he stood stock still. పుట్టలమ్మ ఒక గ్రామ దేవత.

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=పుట్ట&oldid=3682687" నుండి వెలికితీశారు