చెంగారెడ్డిపల్లె

ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా, రేణిగుంట మండల గ్రామం

చెంగారెడ్డిపల్లె, తిరుపతి జిల్లా రేణిగుంట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఇది కరకంబాడి పంచాయితి పరిధిలో ఉంది. ప్రాచీన కాలంలో చెంగారెడ్డి పల్లెను బీర్ల మిట్ట అనే పేరుతో పిలిచేవారు. అయితే బ్రిటీష్ వారు ఆగమనం తర్వాత బీర్ల మిట్ట పేరు కాస్తా చెంగారెడ్డి పల్లెగా మార్పు చేశారు. గతంలో ఈ ఊరికి వాయువ్యం వైపున మట్టి కోటలు ఉండేవి. ఈ కోటల్లో పాలెగాల్లు నివసించేవారని..... వీరి చాలాకాలం బీర్ల మిట్టను కేంద్రంగా చేసుకుని ఈ చుట్టు పక్కల ప్రాంతాలను పరిపాలన చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ కోటలు కనిపించడం లేదు మట్టి కోటలు కావడంతో కోటలన్నీ కూలిపోయాయి. తర్వాతి కాలంలో ఈ చుట్టుపక్కలప్రజలు ఈ మట్టిన తమ అవసరాలకు తీసుకెల్లడంతీ కనీసం మట్టి గుట్టలు కూడా కనిపించకుండా కనుమరుగయ్యాయి. ఇక చెంగారెడ్డి పల్లెకి తూర్పువైపున పంటపోలాలు..... దక్షిణం వైపున పాత రేణిగుంట గ్రామం.... పడమర రేణిగుంట కడప జాతీయరహదారి.... ఉత్తరాణ పంటపోలాలు ఉన్నాయి.

చెంగారెడ్డిపల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
చెంగారెడ్డిపల్లె is located in Andhra Pradesh
చెంగారెడ్డిపల్లె
చెంగారెడ్డిపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°39′21″N 79°31′00″E / 13.655843°N 79.516639°E / 13.655843; 79.516639
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి
మండలం రేణిగుంట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 517 520
ఎస్.టి.డి కోడ్

అవధూతల నిలయం చెంగారెడ్డిపల్లె

మార్చు

చెంగారెడ్డిపల్లె గ్రామం పోలిమేరలో... ఊరికి నైరుతీ వైపున కన్నయ్య తాతల సిద్ద సమాధులు ఉన్నాయి. సుమారు 700 సంవత్సరాల క్రితం కన్నయ్య అనే శివభక్తుడు చెంగారెడ్డిపల్లె.... పాతరేణిగుంట....కరకంబాడి....లాంటి గ్రామాల్లో తిరుగుతూ భక్తిని ప్రచారం చేసేవారు. మానవ జన్మను ఎలా సార్థకత్వం చేసుకోవాలో బోధించేవారు. ఈయన బోధనలు వినడానికి నాడు భక్తులు పోటీపడేవారు. ఈ క్రమంలోనే కన్నయ్యను అందరూ తాత అని సంబోధించేవారు. ఇలా కన్నయ్య పేరు కాస్తా కన్నయ్య తాతగా స్దిరపడిపోయింది. కన్నయ్యతాతకు శిష్యులు సంఖ్య ఎక్కువగా ఉండేది. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కన్నయ్య తాత బోధనలతో మంచి భక్తులుగా మెసలు కునేవారు. తమ పిల్లలకు సైతం కన్నయ్య అని పేరు పెట్టుకునేవారు. ఇప్పటికి కూడా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎక్కువగా కన్నయ్య అనే పేరు కనిపిస్తుంటుంది. ఇక తన శిష్యులకి చివరి బోధను చేసిన కననయ్య తాత చెంగారెడ్డి పల్లె వద్ద జీవసమాధి చెందినట్టు స్దానికులు చెబుతున్నారు. ప్రస్తుతం కన్నయ్యతాత గురించి కానీ.... నాటి చరిత్ర గురించి కానీ ఆధారాలు ఏవి దోరకడం లేదు. అయితే ఇప్పటికి కూడా చెంగారెడ్డి పల్లెలోని ప్రజల్లో ఏ శుభకార్యం జరిగినా మందు కన్నయ్య తాత ఆశీర్వదం తీసుకునే ఆచారం కోనసాగుతూనే ఉంది. ఇప్పటికీ మనం కన్నయ్య తాతల సిద్ద సమాధిని, తాత గారి శిష్యుని సమాధిని దర్శించవచ్చు.

కళాకారులకు పుట్టినిళ్లు చెంగారెడ్డిపల్లె

మార్చు

చిత్తూరు జిల్లాలోనే చెంగారెడ్డిపల్లె కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రాచీన కాలం నుంచి ఈ గ్రామస్ధులు పౌరాణిక పాత్రలు వెసి మెప్పించడంలో గోప్ప పేరుతెచ్చుకున్నారు. గతంలో చెంగారెడ్డి పల్లెలే ఇంటికో కళాకారుడు ఉండేవారు. ఏడాదికోసారి గ్రామస్ధులంతా కలసి నాటకాలు నిర్వహించే వారు. నాటక రంగంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక నంది అవార్డునూ ఈ గ్రామస్ధులు దక్కించుకున్నారు. కర్నూలులో జరిగిన 2016 నంది నాటకోత్సవాల్లో మైరావణ నాటకాన్ని ప్రదర్శించిన గ్రామస్ధులు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల కాలంలో చెంగారెడ్డిపల్లె గ్రామస్ధులు, పాతరేణిగుంట గ్రామస్ధులు కలసి వినాయక నాట్యకళాపరిషత్తు పేరుతో రేణిగుంటలో ఓ సంస్ధను ఏర్పాటు చేసుకుని. ఈ సంస్ధ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలిస్తూ తమ గ్రామాల పేరుతో పాటు రేణిగుంట పేరును కూడా విశ్వవేదికలపై మారు మ్రోగేలా చేస్తున్నారు. ఇక చెంగారెడ్డిపల్లేలో ఫుట్టి గోప్ప పేరు తెచ్చుకున్న కళాకారుల్లో కీర్తీశేషులు పెన్నసాని నాగరాజు, కీర్తీశేషులు హిమాకర్ రెడ్డి, కీర్తీశేషులు దండూ రాధాకృష్ణ, కీర్తీశేషులు రాచేటి మునిరత్నం, కమతం రాజశేఖర్ (హెడ్ మాస్టర్), రాచేటిరాధాకృయ్య (టీటీడీ) రాచేటి సుబ్రహ్మణ్యం (బీఎస్ఎన్ఎల్), రాచేటి శ్రీనివాసులు(రైల్వే), దండూ గోపాల్ (కాటన్ మిల్లు), అత్తూరు ధర్మరాజుల రెడ్డి, కుంట్రపాకం శంకరరెడ్డి, తాతినేని కృష్ణమనాయుడు, విజయబాబు (పాలటెక్నిక్ కాలేజీ), పీ బాలసుబ్రహ్మణ్యం ముఖ్యులు. ఇక సుప్రసిద్ద మృదంగం విద్వాంసులు అత్తూరు మునిక్రిష్ణారెడ్డి ఈ గ్రామనివాసే... నాడు రాయలసీమ వ్యాప్తంగా నిర్వహించే ఆద్యాత్మిక కార్యక్రమాల్లో తన మృదంగంతో భక్తులను కట్టిపడేసేవారు. వీరితో పాటు శెట్టిపల్లి హరిదాసు... అనేక కార్యక్రమాల్లో పాల్గోనే వారు. ఇక ఈ గ్రామానికి చెందిన సోమూ ఉమాపతి ప్రముఖ రచయితగా... గాయకుడిగా... పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఓకానోక సందర్బంలో ప్రముఖ గాయకుడు గంటశాల వేంకటేశ్వరరావు కచేరిలో సోమూ ఉమాపతి భాగస్వామిగా పనిచేశారు. సోమూ ఉమాపతి తానే సోంతంగా పాటలు రాసుకుని పాడేవారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్ధానం అన్నమాచార్య కళాపరిషత్తులో ప్రముఖ కళాకారుడుగా సేవలందిస్తున్నారు.

ఊరికి చదువు చెప్పిన సదాశివయ్య

మార్చు

ఈ గ్రామంలో అందరూ ప్రయోజకులు అయ్యారంటే దానికి ప్రధాన కారణం నార్ల సదాశివయ్య. ఈ గ్రామంలో అక్షరాలను విత్తనాలుగా చేసి మహావృక్షాలను తయారు చేసే పనిని తమ భుజాలపై వేసుకున్నారు సదాశివయ్య. పొలాల్లో పనులు చేసుకుంటు తిరిగే పిల్లలను పాఠశాలకు తీసుకువచ్చి అక్షరాలు దిద్దించేవారు. సదాశివయ్య తర్వాతి కాలంలో ఆయన కుమార్తే.... సరస్వతమ్మ ఊరిలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడం ప్రారంభించింది. ఈ తండ్రి కూతుల్లే చాలా కాలం గ్రామంలో విద్యా బుద్ధులు నేర్పేవారు. ఆరోజుల్తెలో తెలుగు అక్షరాలు రాయడంలో సరస్వతమ్మను మించిన వారే ఉండేవారు కాదు. ఈమె అక్షరాలు రాసిందంటే పుస్తకంలో ముద్రించినట్టే కనిపించేది. నాడు మండల విద్యాశాఖలోనూ సరస్వతమ్మ అక్షరాలరాసే తెలుగు అక్షరాలపై మాట్లాడుకునేవారు. ఈ కాలంలోనే గౌనూతనల చెంచురామయ్య, పరిమిశిట్టి చెంచురామయ్య లు రేణిగుంట హైస్కూలులో ఉపాధ్యాయులుగా పనిచేశారు. తర్వాతి కాలంలో చంద్రగిరి నుంచి చెంగారెడ్డిపల్లెకి వలస వచ్చిన వేణు... చెంగారెడ్డిపల్లె పక్కన ఉన్న గోల్లపల్లెలో ఉపాద్యాయులుగా పనిచేశారు. కాలక్రమంలో వేణు మాస్టారు పేరు కాస్తా గోల్లపల్లి అయ్యోరుగా స్ధిరపడిపోయింది. ఇక 1980 దశకంలో కొత్తగా బాలబడి అనే పేరుతో చిన్న పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పేకార్యక్రమాన్ని తొలిసారిగా కళావతి నిర్వహించారు. తర్వాతి కాలంలో రాచవేటి వేంకటరత్మమ్మ నిర్వహించారు. ఇప్పటికీ ఈ గ్రామంలో ఉన్న యువకుల్లో అత్యధికులు రాచేవేటి వేంకట రత్మమ్మ వద్దే తొలిసారిగా అక్షరాలు దిద్దారు. ఇక నార్ల సదాశివయ్య గారి కుమారుడు నార్ల కాలేశ్వరరావు జూనియర్ కాలేజీ లెక్చరర్ గా, ప్రిన్సిపల్ గా, చిత్తూరు జిల్లా జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్ అసోషియేషన్ నాయకుడుగా బహూముఖంగా సేవలందిస్తూ చెంగారెడ్డిపల్లె పేరు ప్రఖ్యాతలను నిలిపారు. ఇక ఈ గ్రామంలో దీనదయాల్ (చిన్ని) కోంత కాలంల ట్యూషన్ చెప్పేవాడు.. తర్వాతి కాలంలో గోల్లపల్లి అయ్యోరు కుమార్తే భారతి ట్యూషన్లు చెప్పేవారు. ఇక తాజాగా ఈ గ్రామంలో కమతం రాజశేఖర్, పరిమిశెట్టి ప్రసాద్ లు ప్రధానోపాధ్యాయులుగా సేవలందిస్తుండగా గోల్లపల్లి అయ్యోరు కుమారులు హరి, రఘులు సెంకండ్ గ్రేడు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇక చెంగారెడ్డి పల్లె గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో ఇదే గ్రామానికి చెందిన శాంతాలక్ష్మి ప్రధానోపాద్యాయురాలిగా పనిచేస్తున్నారు.

ప్రభుత్వశాఖల్లో తమదైన ముద్ర వేస్తున్న గ్రామస్ధులు

మార్చు

తంతితపాలా శాఖ నుంచి తంతి శాఖను వేరు చేసిన తర్వాత చెంగారెడ్డి పల్లె గ్రామానికి చెందిన వాసుమింత రామక్రిష్ణయ్య టెలిఫోన్ డిపార్టు మెంటుకి ఏఈగా పనిచేశారు. ఈయన పదవిలో ఉన్నకాలంలో గ్రామంలోని యువతకు టెలిఫోన్ డిపార్టు మెంట్లో ఉద్యోగాలకు మార్గం చూపాడు దీంతో గ్రామంలో దాదాపు 40 మంది యువకుల వరకు ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఇలా ఆయన నాడు వేసిన బీజం వల్లే గ్రామంలోని నాగేశ్వరరావు, ధర్మయ్య, మునిరత్మం, సుధా, రాచవేటి సుబ్రహ్మణ్యం, నరసింహులు తదితర వ్యక్తులు టెలిఫోన్ డిపార్టు మెంట్లో స్ధిరపడ్డారు. ఓకానోక సందర్బంలో రేణిగుంటో ఉన్న టెలిఫోన్ డిపార్టు మెంట్లో చెంగారెడ్డి పల్లె వారే ఎక్కువగా భాద్యతలు నిర్వహించేవారు. ఇక గ్రామంలోని యువతకు చదువుపై ఆశక్తి కల్పించిన వారిలో సోము శ్రీహరి పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. ఈ గ్రామంలోని చెట్ల కింద చదువుకున్న సోము శ్రీహరి యూనివర్సిటీ స్ధాయిలో ఉత్తమ విద్యార్ధిగా బంగారు పథకం సాధించి, మరింత మంది విద్యార్ధులకు స్పూర్తిని నింపారు. సోము శ్రీహరి తర్వాతి కాలంలో వరంగల్ కాకతీయ విశ్వవిధ్యాలయంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఇక సోమూ బాలాజీ సేల్స్ టాక్స్ డిపార్టు మెంట్లో ఉద్యోగిగా పనిచేశారు. ఇక ఈ గ్రామానికి చెందిన సుబ్రహణ్యం రెడ్డి ఎంఈఓగా భాద్యతలు నిర్వహించారు. ఇక పోలీసు విభాగంలో ఈ గ్రామానికి చెందిన గోవిందస్వామి తన దైన ముద్రవేశాడు. శ్రీకాళహస్తి పోలీసు శాఖలో పనిచేసిన ఈయన పలు కేసులు చేదించడంలో కీలకంగా వ్యవహరించారు. ఇక చెంగారెడ్డిపల్లెకి చెందిన వారు న్యాయశాఖలోనూ పనిచేస్తున్నారు రాచవేటి రాధాక్రిష్ణయ్య కుమార్తే హేమలత(రోజా)పోడుగు చెంగయ్య అన్న సుబ్బరాయుడు కోర్టుల్లో పనిచేస్తున్నారు. ఇక తిరుమల తిరుపతి దేవస్ధానంలోనూ చెంగారెడ్డిపల్లే వాసులకు ప్రముఖ స్ధానం ఉంది. ఈ గ్రామానికి చెందిన కోలా మునిరత్నం, శెట్టిపల్లి సుబ్రహ్మణ్యం, రాచేటి రాధాక్రిష్ణయ్య, సుబ్రహ్మణ్యం, గోపాల్, పనిచేస్తున్నారు.

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం మారెమ్మ తల్లి

మార్చు

చెంగారెడ్డి పల్లిలో ప్రాథమిక పాఠశాల వెనుక వైపున మారెమ్మ దేవాలయం ఉంది. అయితే ప్రాచీనకాలంలో ఇక్కడ అమ్మవారిని శిలల రూపంలో పూజించే వారు. ఈ అమ్మవారు ఆలయానికి ఈశాణ్యం వైపున ఓ బావి ఉంది. ఈ బావిలోని నీటినే ఈగ్రామస్ధులు ఉపయోగించుకునే వారు. అయితే తర్వాతి కాలంలో ఓ చిన్ని ఆలయాన్ని నిర్మించుకున్నారు గ్రామస్ధులు. మారెమ్మ ఆలయం పక్కనే ఓ భారీ పుట్ట కూడా వెలియడంతో ఆలయం రోజురోజుకి అభివృద్ధి చెందుతూ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో ఇదే గ్రామానికి చెందిన కమతం శ్రీనివాసులు అన్నీ తానై అమ్మవారి నూతన ఆలయాన్ని నిర్మించారు. ఏటా మారెమ్మ తల్లికి ఘనంగా పోంగళ్లమహోత్సవాన్ని నిర్వహించుకుంటారు గ్రామస్ధులు. ఇక రాములోరి ఉత్సవాలకు పెట్టింది పేరు చెంగారెడ్డి పల్లె ఏటా శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటారు చెంగారెడ్డిపల్లె వాసులు. మొత్తం 9 రోజుల పాటు రోజుకో ఉత్సవాన్ని నిర్వహించుకుంటారు. ఇక చివరి రోజున సీతమ్మకి రాములోరికి కళ్యాణం నిర్వహించుకుని గ్రామాన్ని కాపాడమనివేడుకుంటారు. ఇక చెంగారెడ్డి పల్లె రామాలయంలో ప్రాచీనమైన గరుక్మంతుడి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని పోలిన విగ్రహం ఈ చుట్టుపక్కల ఎక్కడా ఉండదు. పూర్వం చెంగారెడ్డిపల్లే గ్రామం చుట్టుపక్కల గ్రామాలవారు ఈ గరుడాళ్వారుని తమ గ్రామలకు తీసుకు వెల్లీ రాములోరి ఉత్సవాలను నిర్వహించుకునే వారు. ఏగ్రామంలో అయినా ఈశాణ్యం వైపున దేవాలయం ఉంటే ఆ గ్రామానికి దేవతలు వస్తుంటారని ప్రతీతి. అయితే చెంగారెడ్డి పల్లెలో మాత్రం విఘ్ణాలను తొలగించే బోజ్జగణపయ్య ఊరికి ఈశాణ్యం వైపున కోలు ఉన్నారు. దీంతో ఈ గ్రామంలో ఉన్న ప్రజలు గణపయ్య ఆశీస్సులతో రోజురోజుకి ముందుకెల్లగలుగుతున్నారు. ఇక ఈ గ్రామంలో గ్రామదేవత మారెమ్మతల్లితో పాటు రాములోరు..సీతాలమ్మ తల్లి...ఆంజనేయ స్వామి..నడివీధి గంగమ్మ...అక్కమహాదేవతల ఆలయాలు విరాజిల్లుతున్నాయి. ఏటా వినాయక చవితి, పోంగ‌ళ్ల మహాత్సవం, శ్రీరామ నవమి, సుబ్రహ్మణ్య స్వామి కావిడి యాత్ర కార్యక్రమాలను గ్రామస్దులు ఘనంగా నిర్వహించుకుంటారు.

గిరిజనుల నెలవు....చెంగారెడ్డి పల్లె

మార్చు

చిత్తూరు జిల్లాలోనే అరుదుగా కనిపించే గిరిజనులు ఈ గ్రామంలో ఉన్నారు. ఇప్పటికి కూడా వెదురు బుట్టలు అల్లే తమ వృత్తిని కోనసాగిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామానికి ఉత్తరం వైపున ఉన్న శేషాచలంలోని వెదురు తీసుకుని వచ్చి బుట్టలు అల్లుకుంటుంటారు గిరిజనులు. చెంగారెడ్డి పల్లె గిరిజనులు అమ్మే బుట్టలు నాణ్యతలోనూ ధరలోనూ ముందు వరుసలో నిలుస్తుండటంతో పక్కజిల్లాల నుంచి వచ్చిమరీ వెదురు బుట్టలను ఈ గ్రామంలోనే కోనుగోలు చేస్తుంటారు. మొన్నటి వరకు తిరుమల శ్రీవారి లడ్డూలు తరలింపుకు ఈ గ్రామస్ధులు తయారు చేసిన వెదురు బుట్టలను వాడుకునే వారు.

ఇతర విశేషాలు

మార్చు

చెంగారెడ్డి పల్లేలో ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం.. పసుపోషన.. తర్వాతి స్ధానంలో మోటర్ ఫీల్డు నిలుస్తుంది. అంటే ఈ గ్రామంలోని యువత చాలా వరకు డ్రైవర్‌లుగా స్థిరపడ్డారు. కొందరు ప్రభుత్వ శాఖల్లో డ్రైవర్లుగా పనిచేస్తుంటే... మరి కొందరు సోంతంగా వాహనాలు పెట్టుకుని నడుపుకుంటూ తమ జీవిస్తున్నారు. అయితే చెంగారెడ్డి పల్లెలో ఇంత మంది డ్రైవర్లుగా తమ కాళ్లపై తాము నిలబడి జీవిస్తున్నారంటే దీనికి ప్రధాన కారకుడు రాచవేటి రవీంద్రబాబు. చెంగారెడ్డిపల్లెకి తోలి డ్రైవర్ గా నిలిచే రవీంద్రబాబు తన 10 సంవత్సరాల వయస్సులోనే మోటర్ ఫీల్డులోకి ప్రవేసించి... అతి చిన్నవయస్సులోనే డ్రైవర్ గా స్థిరపడ్డాడు. ఇలా తను నేర్చుకున్న విద్యాను గ్రామస్థులకు నేర్పించడంలో రవీంద్రబాబు విజయం సాధించాడు. ఇక ఈ గ్రామానికి చెందిన రమణ తొలి ఆర్ ఎం పీ డాక్టర్ గా సేవలందించారు. తర్వాతి కాలంలో పాపానాయుడు పేటకు వెల్లిన రమణ అక్కడే ప్రాక్టీసు ప్రారంభించి గ్రామస్థులకు వైద్యసేవలు అందించే వారు.ఇలా పాపానాయుడు పేటలోనే పేదల డాక్టర్ గా పేరు తెచ్చుకున్న రమణ గత 25 సంవత్సరాలుగా వైద్యసేవలలో తలమునకలై ఉన్నారు.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు