చెంచులక్ష్మి (1943 సినిమా)
1958లో వచ్చిన ఇదే పేరుగల మరొక సినిమా కోసం చెంచులక్ష్మి చూడండి
చెంచులక్ష్మి (1943 తెలుగు సినిమా) | |
చెంచు లక్ష్మి సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎస్.సౌందర రాజన్ |
నిర్మాణం | ఎస్.సౌందర రాజన్ |
కథ | సముద్రాల రాఘవాచార్య |
తారాగణం | సి.హెచ్.నారాయణరావు (విష్ణువు, వరహరి), చిత్తూరు నాగయ్య (శిఖనాయకుడు), ఋష్యేంద్రమణి (ఆదిలక్ష్మి), కమలా కోట్నీస్ (చెంచులక్ష్మి), లంకా సత్యం గరుడాచారి |
సంగీతం | సాలూరు రాజేశ్వరరావు, సి.ఆర్.సుబ్బరామన్, ఆర్.ఎన్.చిన్నయ్య |
నేపథ్య గానం | రావు బాలసరస్వతి |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
ఛాయాగ్రహణం | జితేన్ బెనర్జీ |
నిర్మాణ సంస్థ | తమిళనాడు టాకీస్ |
భాష | తెలుగు |
చెంచులక్ష్మి, 1943లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి వచ్చింది. కమలా కొట్నీస్ అందం, నాట్యం, అభినయం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణలు. టైటిల్స్‌లో చిన్నయ్య పేరు ఉన్నా గాని సంగీతానికి సంబంధించిన పని అధికంగా సుబ్బరామన్‌దేనని చెబుతారు. టైటిల్స్ మ్యూజిక్‌లోను, గూడెం వాయిద్యాలలోను లాటిన్ అమెరికన్ పోకడలను ప్రవేశపెట్టిన ఘనత సుబ్బరామన్‌దే.
చెంచులక్ష్మి కథ
మార్చుఅహోబిల తెగకు చెందిన శిఖనాయకుడు తనకొక కుమార్తెను ప్రసాదించమని విష్ణుమూర్తిని ప్రార్థించాడు. అలా వరమిచ్చిన విష్ణువు ఆమెను తానే పెండ్లాడుతానని చెప్పాడు. అలా కొండజాతి నాయకునికి పుట్టిన బిడ్డ "చెంచులక్ష్మి". సాహసవతిగా పెరిగి పెద్దయ్యింది. విష్ణుమూర్తి నరహరి రూపంలో భూలోకానికి వచ్చి ఆ లక్ష్మితో ప్రేమలో పడ్డాడు. నరహరి అసలు రూపం తెలియని నాయకుడు అనేక పరీక్షలు పెట్టి ఆపై తన కుమార్తెను నరహరికిచ్చి పెళ్ళి చేశాడు.
పాటలు
మార్చుఈ సినిమాలోని 12 పాటలను, పద్యాలను సముద్రాల రాఘవాచార్య రచించారు.[1]
- అతి భాగ్యశాలి నారీ పరిచరణ కమల పూజారీ - ఋష్యేంద్రమణి
- ఆడది ఆడదే, ఆడనేర్చి వేటాడ నేర్చినా - ఋష్యేంద్రమణి
- ఇంతకన్న నాకేది భాగ్యమూ - నాగయ్య
- ఏరిఏరి నా సమానులిక ఏరి - బాలసరస్వతి
- ఏలుకోవయ్య ఓబులేశా మమ్మేలుకోవయ్యా - బాలసరస్వతి
- కనిపించితివా నారసింహ, కనికరించినావా ఈ లీల - కమలా కొట్నీస్
- కమలానాథా - జగన్నాథా కమల భవార్చిత పదకమలా
- కమలానాథా - జగన్నాథా కమలా మోహనా
- ధన్యుడరా నే నరసింహా నా జన్మ తరించెనురా దేవా - నాగయ్య
- నిజమాడు దాన నీదానా, నిను నమ్మి మనేదానా - ఋష్యేంద్రమణి
- నీదే భారము గాదా దేవా తోడునీడ నీవే గాదా - నాగయ్య
- పోవె కదలి పలుగాకీ, పోపోవె - ఋష్యేంద్రమణి, బాలసరస్వతి
- మధురముగా ఆహా మధురముగా - బాలసరస్వతి, ఎస్.వెంకట్రామన్
ఈ సినిమా మీద చలం వాఖ్యలు
మార్చుప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం తన మ్యూజింగ్స్ రచనలో (280వ పుట 5వ ముద్రణ 2005) ఈవిధంగా అన్నారు:
- ఓసారి రెండు రాత్రులు వరుసగా చెంచులక్ష్మి చిత్రాన్ని విన్నాను. ఆ కథ ఏమిటో గాని, ఆ చిత్రంలోని ఏడుపుల్ని తలచుకుంటే ఇప్పటికీ వొణుకు పుడుతుంది. మరి మంచి పాటల్నే అట్లా పాడారో! - "కనిపించితివా, నరసింహా" అనే పాట చాలా శ్రావ్యంగా పాడారు. ఆ నరసింహం కనిపెస్తే సంతోషమైన విషయమే కావొచ్చు. కాని దాన్ని వింటో వుంటే హ్రుదయ భేదకంగా ఉంటూంది.
వనరులు, బయటి లింకులు
మార్చు- ↑ చెంచులక్ష్మి, జీవితమే సఫలము, డా.వి.వి.రామారావు, క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009, పేజీలు 167-74.
- సూర్య దినపత్రిక - 11 జనవరి 2008 శుక్రవారం - సూర్యచిత్ర అనుబంధం - ఆనాటి చిత్రాలు
- ఘంటసాల.ఇన్ఫోలో చెంచులక్ష్మి చిత్రం సమాచారం