చెంచులక్ష్మి (1958 సినిమా)

చెంచులక్ష్మి, 1958లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇది తెలుగు, తమిళ భాషలలో విడుదలయ్యింది. (ఇదే పేరుతో 1943లో ఒక సినిమా వచ్చింది.) ఈ సినిమాలో మొదటి భాగంలో ప్రహ్లాదుని కథను, రెండవ భాగంలో చెంచులక్ష్మి కథను చూపారు. మొదటి భానుమతిని ఎంపిక చేశారు. తరువాత ఆ పాత్రకు అంజలీదేవిని తీసుకొన్నారు. ఈ సినిమా విడుదలైనపుడు విష్ణువు గెటప్‌లో ఉన్న అక్కినేని నాగేశ్వరరావు కాలెండర్లను థియేటర్ల వద్ద అమ్మారు. ఈ సినిమాలో పాటలు జనప్రియమయ్యాయి.

చెంచులక్ష్మి
(1958 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎ.సుబ్బారావు
కథ సదాశివ బ్రహ్మం
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు (విష్ణువు, నరహరి),
అంజలీదేవి (ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి)
ఎస్వీ రంగారావు (హిరణ్య కశిపుడు)
పుష్పవల్లి (లీలావతి)
మాస్టర్ బాబ్జీ (ప్రహ్లాదుడు)
రేలంగి (నారదుడు)
నాగభూషణం (శివుడు)
గుమ్మడి వెంకటేశ్వరరావు (దూర్వాసుడు)
నల్ల రామమూర్తి
వంగర
సీతారాం
అంగముత్తు
సంగీతం సాలూరు రాజేశ్వరరావు
గీతరచన ఆరుద్ర,
కొసరాజు,
సముద్రాల,
సదాశివ బ్రహ్మం
సంభాషణలు సదాశివ బ్రహ్మం
నిర్మాణ సంస్థ బి.ఎ.ఎస్.ప్రొడక్షన్స్
భాష తెలుగు

చెంచులక్ష్మి కథ

మార్చు

అహోబిల తెగకు చెందిన శిఖనాయకుడు తనకొక కుమార్తెను ప్రసాదించమని విష్ణుమూర్తిని ప్రార్థించాడు. అలా వరమిచ్చిన విష్ణువు ఆమెను తానే పెండ్లాడుతానని చెప్పాడు. అలా కొండజాతి నాయకునికి పుట్టిన బిడ్డ "చెంచులక్ష్మి". సాహసవతిగా పెరిగి పెద్దయ్యింది. విష్ణుమూర్తి నరహరి రూపంలో భూలోకానికి వచ్చి ఆ లక్ష్మితో ప్రేమలో పడ్డాడు. నరహరి అసలు రూపం తెలియని నాయకుడు అనేక పరీక్షలు పెట్టి ఆపై తన కుమార్తెను నరహరికిచ్చి పెళ్ళి చేశాడు.

పాత్రలు-పాత్రధారులు

మార్చు
పాత్ర నటి / నటుడు
విష్ణువు అక్కినేని నాగేశ్వరరావు
లక్ష్మీదేవి/చెంచులక్ష్మి అంజలీ దేవి
హిరణ్యకశిపుడు ఎస్.వి. రంగారావు
నారదుడు రేలంగి వెంకట్రామయ్య[1]
ప్రహ్లాదుడు మాస్టర్ బాలాజీ
చెంచు రాణి సంధ్య
శివుడు నాగభూషణం
ఋష్యేంద్రమణి
దూర్వాసుడు గుమ్మడి వెంకటేశ్వరరావు
లీలావతి పుష్పవల్లి
చండామార్కులు వంగర వెంకట సుబ్బయ్య
ఎ.వి. సుబ్బారావు
నల్ల రామమూర్తి

పాటలు

మార్చు
పాట రచయత సంగీతం గాయకులు
ఆనందమాయే అలి నీలవేణీ అరుదెంచినావా అందాలదేవీ ఆరుద్ర సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, జిక్కి
కనలేరా కమలాకాంతుని అదిగో కనలేరా భక్త పరిపాలుని అదిగో కనలేరా శంఖ చక్రధారిని సదాశివబ్రహ్మం సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల
కానగరావా ఓ శ్రీహరి రావా ప్రాణసఖా నను చేరగ రావా సాలూరు రాజేశ్వరరావు జిక్కి, ఘంటసాల
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా, చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మల చిగురు కోయగలవా ఆరుద్ర సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, జిక్కి
నీల గగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా హాని కలిగితే అవతారాలను పూని బ్రోచునది నీవే కావా ఆరుద్ర సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల
పాలకడలిపై శేష తల్పమున పవళించేవా దేవా బాలుని నను దయపాలించుటకై కనిపించేవ మహానుభావా సదాశివబ్రహ్మం సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల
శ్రీనాధుని పద సరసిజ భజనే ఈ నరజన్మము కనిన ఫలం సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల బృందం
ఇంకా

ఇందుగలదండు లేడని సందేహము వలదు 01. ఎంత దయామతివయ్యా అనంతా 02. ఎవడురా విష్ణుండురా ఎవడురా జిష్ణుండురా - మాధవపెద్ది సత్యం 04. కరుణాలవాలా ఇదు నీదు లీల అంతయును వింత పొగడగ నేనెంత - ఘంటసాల 05. చదివించిరి నను గురువులు 06. చెయ్యి చెయ్యి కలుపుదాం చిందులేసి కులుకిదాం - ఎ.పి.కోమల, జిక్కి బృందం 08. చిలకా గోరొంకా కులుకే పకా పకా నేనై చిలకెతే నీవే గోరొంక - జిక్కి, ఘంటసాల 09. నాడు హిరణ్యకసిపుడు అనర్గళ (పద్యం) - ఘంటసాల రచన: తాపీ ధర్మారావు.11. పరాభవమ్మును సహింతునా నే పరాక్రమించక - మాధవపెద్ది సత్యం 12. మందార మకరంద 13. మహాశక్తిమంతులైనా నిజము తెలియలేరయ్యో నిజం - ఘంటసాల 14. మరపురాని మంచిరోజు నేడు వచ్చెనే ముచ్చటైన వినోదము - జిక్కి, ఘంటసాల బృందం 15. మా చిన్ని పాపాయీ చిరునవ్వేలరా మరి నిదురింపరా - జిక్కి

వనరులు

మార్చు
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు సంకలనం చేసిన ఘంటసాల 'పాట'శాల, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006
  • సూర్య దినపత్రిక - 11 జనవరి 2008 శుక్రవారం - సూర్యచిత్ర అనుబంధం - ఆనాటి చిత్రాలు

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "హాస్యానికి తొలి పద్మశ్రీ పొందిన రేలంగి". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.