చెరుకుపల్లి పోలేరమ్మ గుడి

సుమారు 300 సంవత్సరాలకు పూర్వం గుంటూరు జిల్లా పెనుమూడి గ్రామానికి చెందిన యెల్లాప్రగడ శాస్తుర్లు, బాపట్ల సమీప గ్రామానికి కాలినడకన ప్రయాణం చేస్తూ విరామం కోసం ఈ ప్రాంతంలో ఆగి పరిసరాలను గమనించి, గ్రామ నిర్మాణానికి అనువైనదిగా భావించి కొంతకాలం తరువాత వారు మరికొంతమందితో కుటుంబసమేతంగా విచేసి గృహాలను నిర్మించుకొని, నీటివనరుకై ప్రయత్నం చేస్తుండగా కేవలం చెలమ లోతులోనే చెరుకురసం వంటి మంచి నీరు లభించటంతో ఈగ్రామానికి చెరుకుపల్లి అని నామకరణం చేసి వారి ఇంటి పేరును చెరుకుపల్లిగా మార్చుకొని చెరుకుపల్లి పెదశాస్తుర్లు గా ప్రసిద్ధి చెందారు.

చెరుకుపల్లి పోలేరమ్మ గుడి

పెదశాస్త్రి వ్యవసాయ వృత్తిలో స్థిరపడ్డారు మొదటిసారిగా ప్రస్తుత గరువు మాగాణి భూమిలో వ్యవసాయం ప్రారంభించారు, వీరికి ఏకైక సంతానం శ్రీరాములు ఈయన కూడా వ్యవసాయదారులే, శ్రీరాములుకు ఏడుగురు మగ సంతానం ఆడపిల్లలు లేరు, ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతంలో శీరాములుగారు నారుమడులకు అవసరమైన నీటికోసం దొరువు త్రవ్యుతుండగా ఒక విగ్రహం కనిపించింది, ఆ విగ్రహాన్ని పరిశీలించి పోలేరమ్మ విగ్రహంగా నిర్ణయించి దొరువు ఒడ్డున తాటాకులతో పందిరి ఏర్పాటు చేసి నిత్యదీపారధనల నిమిత్తం చాకలి కులానికి చెందిన వ్యక్థిని పూజరిగా నియమించారు.

అన్ని కులాలవారు నివసిస్థేనే గ్రామానికి శోభచేకూరుతుందని బ్రాహ్మణ,వైశ్య,కాపు, గౌడ,రజక మరికొన్ని కులాల గ్రామంలో నివసించడానికి శ్రీరాములుగారు చాలా కృషి చేసారు. గ్రామంలోని ప్రజలు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి అమ్మవారిని కొలవటం ప్రారంభించారు అమ్మవారి చల్లని చూపుతో ప్రతిసంవత్సరం సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలతో గ్రామం లోని ప్రజలందరు సుఖసంతోషాలతో జీవించసాగారు. వారు పొలం పనులు చేసుకుంటూ ఇంటి వద్ధ నుండి తెచ్చుకున్న మంచినీరు అయిపోవడంతో అమ్మా పోలేరా ధాహంగా ఉందమ్మా అని తలచుకోగానే అమ్మవారు గజ్జెల సవ్వడితో అదృశ్య రూపంలో నీరు పోస్తుండగా శ్రీరాములు గారు దోసిటపట్టి నీరు త్రాగటం చూసిన తోటిపని వారు ఆశ్చర్యంతో ఇండ్ళకుపోయి జరిగిన వింత గురించి గ్రామస్తులతో అమ్మవారి మహిమల గురించి చెప్పుకొనేవారట. కొన్ని సందర్భాలలో వర్షాలు సకాలంలో కురవక వ్యవసాయపనులకు ఇబ్బంది యేర్పడినప్పుడు అమ్మవారికి స్నానాలు (అభిషేకం) చేయించేవారు. కొన్ని గంటలలోనే వర్షాలుకురిసి వాతావరణం వ్యవసాయానికి అనుకూలంగా మారేదట. శ్రీరాములు తమ సంపదను తన ఏడుగురు కొడుకులతో పాటు అమ్మవారికి కూడా సమాన వాటాలుగా పంచి ఇచ్చారు. శ్రీరాములుగారి పెద్ద కుమారుడు వెంకటలక్ష్మీ నరసింహం (బాబురావు) గారు అమ్మవారి భూమి నుండి వచ్చిన ఆదాయాన్ని సమీకరించి రాతిగోడలు పైన నాటుపెంకులతో ఆలయనిర్మాణం చేసి అమ్మవారిని ఆలయంలో ప్రతిష్ఠీంచారు. ఆకాలంలో అమ్మవారికి కొలుపుల కార్యక్రమం జరిపేవారు.

  1. ఈ పోలేరమ్మ అమ్మవారి ఆలయ పునహ్ ప్రతిష్ఠా కార్యక్రమాలు 2013 నవంబరు 24 నుండి, 2013 నవంబరు 28 వరకూ అత్యంతవైభవంగా జరిగాయి.[1]
  2. ఈ దేవాలయం పునర్నిర్మించి ఒక సంవత్సరం అయిన సందర్భంగా, 2014,నవంబరు-28, శుక్రవారం నాడు, ఆలయంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. మహిళలు అధికసంఖ్యలో విచ్చేసి, అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించి చద్ది నైవేద్యాలు పెట్టినారు. [2]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు

[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె,2013 నవంబరు 29,2వ పేజీ.

[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,నవంబరు-29; 2వపేజీ.