చేపల పొదుగుదల స్థల కేంద్రము
చేపల పొదుగుదల స్థల కేంద్రాలు అనేవి చేపలను కృత్రిమంగా సృష్టించిండానికి ఉపయోగించే ప్రదేశాలు.[1] ప్రపంచ వ్యప్తంగా చేపల సాగు ద్వారా వచ్చే ఆధాయం 2008వ సంవత్సరంలో US$98.4 మిలియన్లు. ఈ ఆధాయంలో చైనా మెుదటి స్థానం దక్కించుకుంది.[2][2][3]
కృత్రిమంగా చేప పొదుగుదల ప్రక్రియ
మార్చు- చేప పొదుగుదల స్థల కేంద్రాలను క్రిమినాశకాలతో శుద్ధి చేయుట.
- చేప పొదుగుదల స్థల కేంద్రాలకు అవసరమైన సమిదనలు ఎరియేటర్, శలైన్ నీళ్ళు, పొదుగుదల పాత్ర, కత్తి, ఈకలు, ముఖ్యమైనది ఒవాప్రిమ్ ఇంజక్షన్.
- సంవత్సరం పైబడిన ఆడ, మగ చేపలు. (బ్రుడ్ స్టాక్)
- కృత్రిమ హార్మోన్ అయిన ఒవిప్రిమ్ 0.5ml సూది ద్వారా ఆడ చేపకు ఎక్కించాలి.
- మగ చేపను చంపి దాని వృష్ణా సంచులను బయిటకు కత్తితో తీసి తర్వాత అందులో నుండి వీర్యాన్ని (వీర్యకణాలను) జాగ్రత్తగా సేకరించాలి.
- ఇంజక్షన్ ఇచ్చిన 24-35 గంటల తర్వాత ఆడ చేప నుండి పొత్తి కడుపును గట్టిగా నులమడం ద్వారా జన (గుడ్లను) బయిటకు తీయాలి.ఈ ప్రక్రియను స్ట్రిప్పింగ్ అంటారు.
- మగ చేప వీర్యాన్ని ఆడ చేప జనపై పోసి ఈకలతో సున్నితంగా కలపాలి. తరువాత శేలైన్ నీళ్ళను కలపాలి. ఈ ప్రక్రియ పొదుగుదల పాత్ర లేదా ప్లాష్టిక్ పాత్రలో జరపాలి.
- ఈ పాత్రను 20-30 డిగ్రీల ఉష్ణోగ్రత తగిలేలా చూడాలి. లేదా ఒక కరెంటు బల్బును అమర్చాలి.
- సుమారు 24-48 గంటలలో చేప పిల్లలు తయారైవుతాయి.[4]
మూలాలు
మార్చు- ↑ Crespi V., Coche A. (2008) Food and Agriculture Organization of the United Nations (FAO) Glossary of Aquaculture [1] Archived 2012-04-22 at the Wayback Machine
- ↑ 2.0 2.1 FAO (2010) State of World Fisheries and Aquaculture
- ↑ Sim, S. Y., M. A. Rimmer, J. D. Toledo, K. Sugama, I. Rumengan, K. Williams and M. J. Phillips (2005). A guide to small-scale marine finfish hatchery technology. Australian Centre for International Agricultural Research 2005- 01 [2][permanent dead link]
- ↑ చేప పిల్ల సాగు