చేప ప్రసాదం లేదా చేప మందు అనేది ఉబ్బసం వ్యాధిని నివారించుటకు ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున బత్తిని సోదరులు పంపిణీ చేసే మందు.

విశేషాలుసవరించు

ఈ చేపప్రసాదంలో ఆయుర్వేదంతో పాటు పాల పిండి ఇంగువా, బెల్లం పసుపు లాంటి సహజసిద్దమైన వనమూలికలు వాడుతారు. ఇందులో వాడే ప్రసాదంలో మంచినీరు కూడా బావినీరే కావడం విశేషం. అయితే ఈ శాస్త్రీయతకు హిందు ధర్మాన్ని జత చేస్తూ బత్తిని సోదరులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. భగవంతుని పూజ తరువాత ప్రసాదాన్ని తయారు చేస్తారు. 24 గంటల ముందునుంచి ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఈ చేప ప్రసాదం పంపిణీ కోసం కొర్రమీను చేప పిల్లల్ని వినియోగిస్తారు, జీవించి వున్నా చేప పిల్ల నోట్లొ బత్తిని సోదరులు చేసిన మిశ్రమం చిన్న ముద్దను వుంచి ఉబ్బసం రోగుల చేత మింగిస్తారు. ఈ చేప ప్రసాదంపై అనేక వివాదాలు ఉన్నాయి. జన విజ్ఙాన వేధిక లాంటి కొన్ని సంస్ధలు చేప ప్రసాదాన్ని ప్రతి ఏటా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. దీంతో ప్రతి సంవత్సరం చేపమందుపై చివరి వరకు కూడా ఓ స్పష్టత రానటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ప్రభుత్వాలు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. చివరి వరకు ఇలాంటి పరిస్ధితే ఉండడంతో తొక్కిసలాటలు జరిగి పలువురు మృతిచెందారు. అయినా చేపప్రసాదం మాత్రం ఆగలేదు. ఈ మందులో ఏటువంటి శాస్త్రీయ ఆధారాలు లేక పోవటంతొ కోర్టు సూచన[1] మేరకు దీనిని చేపప్రసాదంగా వ్యవహరిస్తుంన్నారు.

ప్రసాదంలో రకాలుసవరించు

బత్తిని సోదరులు ఇచ్చే ప్రసాదం మూడు రకాలుగా ఉంటుంది. శాఖాహారులకు బెల్లంతో తయారు చేసిన ప్రసాదం, మాంసాహారులకు చేప ప్రసాదం, పత్యం చేసే వారికి మూడో రకంగా ప్రసాదాన్ని పంచనున్నట్లు బత్తిని కుంటుంబీకులు చెబుతున్నారు. ఈ సారి నాలుగు లక్షలకు పైగా వ్యాధిగ్రస్తులు వస్తారని, అందుకు కావలసిన ప్రసాదాన్ని తయారు చేశామని వారు తెలిపారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా మందు వేస్తామని… అయితే చేపలు మాత్రం బాధితులే తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. కాగా, చేప మందులో రెండు అంగుళాలు ఉన్న కొరమీనూ మాత్రమే తెచ్చుకోవాలని నిర్వాహకులు చెబుతున్నారు. వీటి అమ్మకం కోసం ప్రత్యేక స్టాళ్లు వుంటాయి. మృగశిర నుంచి వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. గాలిలో తేమ శాతం పెరిగి ఆస్తమా వ్యాధిగ్రస్తులపై ప్రభావం చూపుతుంది. అందువల్లే మృగశిర రోజే ఆస్తామా బాదితులకు ఈ మందును పంపిణీ చేస్తారు. అలాగే మృగశిరలో చాలా మంది చేపలను తినడం అనవాయితీగా వస్తుంది. ఈ రోజు చేపలను భుజించడం వల్ల ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం ఉంది. అందుకే సంవత్సరంలో ఈ ఒక్క రోజైనా చేపలను తినాలని భావిస్తారు.

చరిత్రసవరించు

హైదరాబాదు సంస్థానాన్ని పాలించిన నాలుగో నిజాం నాసిరుద్దౌలా కాలంలో పాతబస్తీ దూద్‌బౌలికి చెందిన బత్తిని వీరన్న గౌడ్ బేగంబజార్ ప్రాంతంలో కల్లు కాపౌండ్ నిర్వహించేవాడు. ఒక రోజు భారీగా వర్షం పడుతుండగా తడిచిన ఓ సాధువు అక్కడికి రావడం గమనించిన వీరన్న గౌడ్ అతన్ని ఇంటికి తీసుకెళ్లి సపర్యలు చేశాడు. సంతృప్తి చెందిన ఆ సాధువు తాను వెళ్లే సమయంలో ఆస్తమా వ్యాధిని నయం చేసే వనమూలికలను బత్తిని వీరన్న గౌడ్‌కు చెప్పాడు. నగరంలో లభించే వనమూలికలతో ప్రసాదం తయారు చేసి, ఏటా మృగశిర కార్తె ప్రవేశించిన తొలినాడే ఎలాంటి లాభాపేక్షలేకుండా రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తే నీకు, నీ కుటుంబానికి మేలు జరుగుతుందని ఆ సాధువు వీరన్న గౌడ్‌కు తెలిపాడు. అప్పటి నుంచి వీరన్న గౌడ్ ప్రతి మృగశిర కార్తె ముందు రోజు నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇలా వీరన్న గౌడ్ తన ఇంటి వద్ద 1847లో చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించాడు. తదనంతరం తన కుమారుడు బత్తిని శివరామ గౌడ్, అతని కుమారుడు బత్తిని శంకర్‌గౌడ్ ఈ ప్రసాదాన్ని ఏటా వేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం శంకర్‌గౌడ్, సత్యమ్మ దంపతులకు కలిగిన ఐదుగురు కుమారుల్లో బత్తిని హరినాథ్ గౌడ్, బత్తిని ఉమామహేశ్వర్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు కలిసి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. దాదాపు 169 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చేపమందు ఇప్పుడు భాగ్యనగరం సొంతం. చేపమందుకు కోసం వచ్చే సంఖ్యను చూసి… ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అల్లర్ల నేపథ్యంలో పాతబస్తీ నుంచి 1997 నిజాం కళాశాల మైదానానికి చేపమందు పంపిణీని ప్రభుత్వం మార్చింది.[2]

చేపమందు వివాదాలుసవరించు

చేప ప్రసాదం శాస్త్రీయత పై అనేక వివాదాలు ఉన్నాయి.. అయినా చేప ప్రసాదానికి మాత్రం ఆదరణ తగ్గటం లేదు.. దీనికి అసలు శాస్త్రీయత లేదని చెబుతున్న జన విజ్ఙాన వేధిక గతంలో అనేకసార్లు రాష్ట్ర అత్యున్నత న్యాయ స్ధానాన్ని ఆశ్రయించింది, ప్రతి యేటా మృగశిర కార్తె రోజున పంపిణీ చేసే చేప ప్రసాదంపై సిటీ సివిల్‌ కోర్టు 2012 లో తీర్పును వెలువరించింది బత్తిన సోదరులు కూడా వారు పంపిణీ చేసే మిశ్రమాన్ని చేప ప్రసాదం అని వ్యవహరించటానికి అంగీకరించారు [1]. చేప ప్రసాదం తయారీ, పంపిణీ అంతా పరిశుభ్రమైన వాతావరణంలో, వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో జర పాలని ఆదేశించింది. చేప ప్రసాదాన్ని ఎక్కడా చేప మందుగా ప్రచారం చేయరాదని, వీటిని ఉల్లంఘించిన పక్షంలో సర్కారు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశిచింది చేప ప్రసాదంలో కీలకంగా మారిన చేపలు పూర్తిగా శుభ్రమైన నీటిలోనే వుండాలని కూడా జడ్జి ఆదేశించారు. చేప పిల్లలు తెచ్చే సమయం నుంచి పంపిణీ చేసే వరకు మంచి నీరు వుండాలని కూడా ఆదేశించారు. ఇక చేప ప్రసాదం పంపిణీ సమయంలో బత్తిన సోదరులు ప్రతిసారీ కచ్చితంగా చేతులు కడుక్కో వాలని, ఒకవేళ రోగులే స్వీకరిస్తే అవసరం లేదని జడ్జి పేర్కొన్నారు. పంపిణీ కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని, ఎక్కడా మందు అని వుండ రాదని, ఈ ఏర్పాట్లను బత్తిన సోదరులు స్వయంగా చేసుకోవాలని కూడా ఆదేశించారు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 http://www.10tv.in/news/Fish-medicine-for-asthma-is-not-a-medicine
  2. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2015-06-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-06-08. Cite web requires |website= (help)

ఇతర లింకులుసవరించు