ఆయుర్వేదం

ప్రాచీన భారతీయ వైద్య శాస్త్రం

ఆయుర్వేదం అనేది భారత ఉపఖండంలో చారిత్రక మూలాలను కలిగి ఉన్న ప్రత్యామ్నాయ వైద్య విధానం.[1] భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక అంతటా సుమారు 80% జనాభా ఆయుర్వేదాన్ని ఆచరిస్తున్నారు. ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం ఆయుర్వేద వైద్య నారాయణ ధన్వంతరి వైద్య బ్రాహ్మణులు అని కూడా అంటారు. ఇది అధర్వణ వేదానికి ఉప వేదం. 'ఆయువిందతివేత్తివా ఆయుర్వేదః' అన్నది నానుడి. అనగా ఆయువును గూర్చిన విజ్ఞానం. ఆధునిక వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఆయుర్వేద సిద్ధాంతం, అభ్యాసంలో సీసము వంటి విషపూరిత లోహాలు అనేక ఆయుర్వేద ఔషధాలలో పదార్థాలుగా ఉపయోగించబడతాయి.[2][3][4][5]

ధన్వంతరి, ఆయుర్వేద వైద్యుడు

పౌరాణిక గాథలు

వేదముల వలెనే ఇది మొదట బ్రహ్మచే స్వయంగా తెలుసుకొనబడినదని అంటారు. తర్వాత బ్రహ్మ నుండి దక్షప్రజాపతి, అతని నుండి అశ్వినీ దేవతలు, వారి నుండి ఇంద్రుడు ఆయుర్వేదమును నేర్చుకున్నారన్నది పురాణ వాక్యం. ధర్మార్థ కామ మోక్షములకు అడ్డంకిగా ఉన్న అనేక వ్యాధులను నయం చేయాలన్న సదుద్దేశంతో భరద్వాజ, ఆత్రేయ, కశ్యప, కాశ్యప, నిమి మొదలగు ఋషులు జనుల యందు దయ కలవారై, త్రిలోకాధిపతియైన ఇంద్రుని వేడిరి. అప్పుడు కాయ, బాల, గ్రహ, ఊర్థ్వాంగ (శాలక్య), శల్య, దంష్ట్ర, జరా, వృష అను 8 విభాగాలతో కూడిన ఆయుర్వేదమును ఆ ఋషులకు ఇంద్రుడు ఉపదేశించెను. ఆ ఋషులు పరమానందముతో భూలోకమునకు వచ్చి శిష్యులకు ఉపదేశించిరి. ఆ శిష్యులలో ఉత్తముడైన అగ్నివేశుడు మొదటిగా అగ్నివేశ తంత్రము అనే గ్రంథమును రచించి విశ్వవ్యాప్తినొందించెను. ఈ విధంగా ఆయుర్వేద అవతరణ జరిగింది. నేటికిని ఈ ఆయుర్వేదము చక్కగ అభ్యసింపబడి ఆచరణలో ఉంది.

చరిత్ర

ఆయుర్వేదం భారతీయ వైద్యం లో సాంప్రదాయ పద్ధతి. ఆయుర్వేద వైద్యం ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో ప్రజలు సుదీర్ఘ సంప్రదాయం  గా వ్యాధి  నివారణకు ఎక్కువగా ఆచరించబడుతున్న ప్రాచుర్యంలో ఉన్న పురాతన వైద్యం. భారతదేశంలో 3,000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎక్కువ శాతం మంది  ప్రజలు ఆయర్వేద వైద్యం ప్రత్యేకంగా లేదా ఆధునిక వైద్యం(అలోపతి) తో కలిపి ఉపయోగిస్తారు. హిందూ పురాణాలలో వేద్యో నారాయణ అని పేర్కొంటారు. బ్రహ్మ నుండి  ధన్వంతరి పొందినట్లు ఆయుర్వేదం శాస్త్రము తెలుపుతుంది. ఆయుర్వేదం అధర్వణ వేదం (క్రీ.పూ. 2 వ సహస్రాబ్ది) లో పేర్కొనబడ్డాయి[6]. వేద వైద్య కాలం క్రీస్తుపూర్వం 800 వరకు కొనసాగింది. భారతీయ వైద్యశాస్త్రం స్వర్ణయుగం క్రీ.పూ 800 నుండి క్రీ.శ 1000 వరకు, ముఖ్యంగా చరక-సంహిత,సుశ్రుత-సంహిత అని పిలువబడే వైద్య గ్రంథాల తయారీ ద్వారా గుర్తించబడింది, చరక  అనే వైద్యుడు (ఫిజీషియన్) గా[7], శస్త్రచికిత్స నిపుణుడిగా(సర్జన్)  సుశ్రుతను చెపుతారు.ఇందులో అభిప్రాయం భేదాలు ఉన్న, ప్రస్తుతము చరక సంహిత క్రీ.శ 1 వ శతాబ్దానికి చెందినదిగా అంచనాలు చెబుతున్నాయి. సుశ్రుత సంహిత క్రీస్తుపూర్వం చివరి శతాబ్దాలలో ఉద్భవించి క్రీ.శ 7 వ శతాబ్దం నాటికి దాని ప్రస్తుత రూపంలో స్థిరపడింది. వాఘ్భట్టుడికి ఆపాదించబడిన గ్రంథాలు కొంత తక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. భారతీయ వైద్యంపై తరువాత వచ్చిన గ్రంథాలకు ఇవే మూలం అని పేర్కొంటారు[8].

చారిత్రక ఆభివృద్ధి

ఆ గ్రంథమును చరకుడు తిరిగి వ్రాసి దానికి చరక సంహిత అని నామకణం చేశాడు. మరియొక సాంప్రదాయం ప్రకారం శ్రీ మహా విష్ణువు యొక్క అవతారమైన కాశీ రాజైన దివోదాస ధన్వంతరి సుశ్రుతాది శిష్యులచేత ప్రార్థించబడినవాడై వారికి ఆయుర్వేదమును బోధించెను. ఆ శిష్యులందరు వారి వారి పేర తంత్రములను రచించిరి. వాటిలో సుశ్రుత సంహిత అనునది యెంతో ప్రాచుర్యమును పొందెను. ఇది పుస్తకరూపంలో తక్షశిల, నలందా విశ్వవిద్యాలయాలలో లభ్యమౌతుంది.

ఇతర వైద్యవిధానాలతో పోలిక

ఇతర వైద్య విధానాలతో పోల్చి చూస్తే, ఆయుర్వేదం చాలా ప్రాచీన మైనది. దానికి తోడుగ అనేక వైద్య అంశాలు విశదీకరించ బడ్డాయి. విశేషంగా శస్త్రవిద్యావిషయాలు, రక్తము (blood) దాని ప్రాధాన్యతపై అవగాహన పెంచారు.సంగీతము, క్షవరము ఆయుర్వెదంలో ఒక భాగము.

పండా బ్రాహ్మణ కులంలో చాల పురాతన కాలం నుండి చాల గొప్ప వారైన మహారాజ వైద్యులు కలిగిన వంశం మొసలిగంటి వారి వంశం .

వైద్యం అనేది డబ్బు కోసం చేసేది కాదు... శత్రువికి అయినా సరే ప్రాణం మీదకి వస్తే... వైద్యం చెయ్యాలి.. అదే గొప్ప దర్మం అని చెప్పే వాళ్ళు... ఇంట్లో .. దేవుడి చిత్ర పటాల కంటే... తాతల చిత్ర పటాలుకి తాలపత్ర గ్రంథాలుకి పూర్వీకుల వంశ వృక్షానికి పూజ చేస్తారు. దేవుడి కంటే గొప్పవాళ్ళుగా భావించే మహా రాజవైద్యులు కాబట్టే. ప్రాణం పొసే వాడు దేవుడు, ప్రాణం నిలబెట్టే వాడే వైద్యుడు. మహా రాజుల కాలం నాటి నుండి రాజ్యంలో ఆస్థాన వైద్యులుగా పనిచేసి రాజ్యంలో ప్రజా క్షేమమే ద్యేయంగా జీవనం సాగించేవారు. రాజరికాలు అంతరించిపోయిన తర్వాత వలస వచ్చి పలు చోట్ల శాశ్వత నివాసం ఏర్పరుచుకుని జీవనం సాగించారు.

ప్రస్తుత ఆచరణ విధానాలు

ప్రస్తుతము ఆయుర్వేదములో పంచకర్మ బాగా ప్రసిద్ధి చెంది ఉంది[9]. ఈ విధానముచే కండరాలు నరములకు సంబంధించిన అనేక వ్యాధులను చికిత్స చేయవచ్చు. కేవలం

ఆయుర్వేద గ్రంథాలు

వస్తుగుణదీపిక

వస్తు గుణదీపిక ఆయుర్వేద ఔషధులు, వాటిని ఉపయోగించవలిసిన విధానముల గురించి వివరించే తెలుగు నిఘంటు గ్రంథం. దీనిని యెర్ర వెంకటస్వామి గారు రచించారు. దీనిని 1883 వ సంవత్సరం జూన్ 23వ తేదిన విడుదల చేయడం జరిగింది. ఈ గ్రంథాన్ని వెంకటస్వామి గారి కుమారుడు అయిన యెర్ర సుబ్బారాయుడు (రిటైర్డ్ జిల్లా మున్సుబు) గారు వృద్ధిపరిచి మరల విడుదల చేసారు.[10] .

వస్తుగుణపాఠం

వస్తుగుణపాఠము సుప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథము. దీనిని జయకృష్ణదాసు రచించారు. దీని మూడవ కూర్పు చెన్నపురిలోని ఆంధ్రభూమి ముద్రణాలయమున 1936 లో ప్రచురించబడింది.[11]

వివిధ వృక్షజాతులు, వస్తువుల ఔషధగుణాలు, లక్షణాలను వెల్లడించే వస్తుగుణ పాఠాలు ఆయుర్వేద, యునాని మొదలైన వైద్యవిధానాల నిపుణులకు ఎంతో ఉపకరించేవి. అంతేకాక బంగారం మొదలైన వస్తువులను ధరించడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన ఉపయోగాలు వంటివి ఇందులో వివరిస్తారు.

భారతదేశంలో అభివృద్ధి

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత  ఆయుర్వేదాన్ని ఆధునిక వైద్యంతో అనుసంధానం చేయాలని, దీనికి కోల్ కతా, కాశీ, హరిద్వార్, ఇండోర్, పుణె, ముంబైలలోని పాత ఆయుర్వేద సంస్థలు  ఉన్నప్పటికీ. 1960 ల తరువాత,  దేశంలో ప్రణాళికాబద్ధమైన వైద్య కళాశాలలు,  విశ్వవిద్యాలయాలు స్థాపన జరిగింది, ముఖ్యంగా గుజరాత్కేరళలో ఆయుర్వేద కళాశాలలు   అభివృద్ధి చెందాయి.  2014లో ఆయుష్ (ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి) మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో  ఆయుర్వేదానికి మరింత అభివృద్ధి దిశగా, దీని అభివృద్ధికి  కావాల్సిన  అన్ని చర్యలను భారత  ప్రభుత్వం  సమర్థవంతమైన సమాచార వ్యవస్థతో  కమ్యూనికేషన్ నెట్వర్క్ను ఏర్పాటు చేసింది,  ఆయుర్వేదం విద్య, పరిశోధన, సంరక్షణ వంటి చర్యలు తీసుకుంటున్నారు[12].

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Meulenbeld, Gerrit Jan (1999). "Introduction". A History of Indian Medical Literature. Groningen: Egbert Forsten. ISBN 978-90-6980-124-7.
  2. Beall, Jeffrey (2018). "Scientific soundness and the problem of predatory journals". In Kaufman, Allison B.; Kaufman, James C. (eds.). Pseudoscience: The Conspiracy Against Science. MIT Press. p. 293. ISBN 978-0-262-03742-6. Archived from the original on 7 September 2023. Retrieved 11 September 2020. Ayurveda, a traditional Indian medicine, is the subject of more than a dozen, with some of these 'scholarly' journals devoted to Ayurveda alone ..., others to Ayurveda and some other pseudoscience. ... Most current Ayurveda research can be classified as 'tooth fairy science,' research that accepts as its premise something not scientifically known to exist. ... Ayurveda is a long-standing system of beliefs and traditions, but its claimed effects have not been scientifically proven. Most Ayurveda researchers might as well be studying the tooth fairy. The German publisher Wolters Kluwer bought the Indian open-access publisher Medknow in 2011....It acquired its entire fleet of journals, including those devoted to pseudoscience topics such as An International Quarterly Journal of Research in Ayurveda.
  3. Quack, Johannes (2011). Disenchanting India: Organized Rationalism and Criticism of Religion in India. Oxford University Press. ISBN 978-0-19-981260-8. Archived from the original on 7 September 2023. Retrieved 6 February 2022. p. 213: There are some ideological realms where the official agenda of ANiS is not applied in the ideal way by the majority of its members. Two of these are summarized here under Astrology and Ayurveda [...] Both are labeled "pseudosciences" in the official agenda of the rationalists [...] Rationalists told me openly many times that against the official agenda of the movement, they consider Ayurveda highly scientific and that they refuse to call it a pseudoscience. During the FIRA conference this official perspective was represented by several of the speakers, while ordinary members told me how they practice some of these pseudosciences, either privately or as certified doctors themselves, most often Ayurveda.
  4. Dargan, Paul I.; Gawarammana, Indika B.; Archer, John R.H.; House, Ivan M.; Shaw, Debbie; Wood, David M. (2008). "Heavy metal poisoning from Ayurvedic traditional medicines: An emerging problem?". International Journal of Environment and Health. 2 (3/4): 463. CiteSeerX 10.1.1.561.9726. doi:10.1504/IJENVH.2008.020936.
  5. Saper, Robert B. (2008-08-27). "Lead, Mercury, and Arsenic in US- and Indian-Manufactured Ayurvedic Medicines Sold via the Internet". JAMA (in ఇంగ్లీష్). 300 (8): 915–923. doi:10.1001/jama.300.8.915. ISSN 0098-7484. PMC 2755247. PMID 18728265.
  6. "History Of Ayurveda: A Brief Overview". Pankajakasthuri. Retrieved 2024-09-05.
  7. "History of Ayurveda: A Glimpse into its medicine and principals". vediherbals.com. Retrieved 2024-09-05.
  8. "Ayurveda | Definition, History, & Facts | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). 2024-08-30. Retrieved 2024-09-05.
  9. "India's ancient tradition that aligns mind, body and spirit – and where to experience it". www.bbc.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-09-05.
  10. http://www.ncbi.nlm.nih.gov/pubmed/18175652
  11. భారత డిజిటల్ లైబ్రరీలో వస్తుగుణపాఠము పుస్తకం.
  12. "Renaissance In Ayurveda". Drishti IAS (in ఇంగ్లీష్). Retrieved 2024-09-05.

బయటి లంకెలు, వనరులు

  • శ్రీ చిత్ర పురాణపండ, ఆయుర్వేదమ్‌ (భారతీయ వైద్య శాస్త్రము), జనప్రియ పబ్లికేషన్స్‌, తెనాలి - 522 201

ఉపయుక్త గ్రంథసూచి