చేబ్రోలు హనుమయ్య
చేబ్రోలు హనుమయ్య( 1923 - 2002) పారిశ్రామిక వేత్త, విద్యా దాత. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో శాసన సభ్యునిగా, మంత్రిగా పనిచేసారు.
చేబ్రోలు హనుమయ్య | |
---|---|
జననం | 1923 |
మరణం | 2002 జూన్ 20 |
స్వంత పట్టణం | గుంటూరు |
పదవి పేరు | శాసన సభ్యులు |
పదవీ కాలం | 1962 -1972 |
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ |
మతం | హిందువు |
పిల్లలు | ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు |
1976 -78 రవణాశ్హాఖామాత్యులు | |
1980- 82 మార్కెటెంగ్ శాఖామాత్యులు |
రాజకీయ జీవితం
మార్చుహనుమయ్య గారు గుంటూరు మునుసిపల్ చైర్ మాన్ గా తన రాజకీయజీవితాన్ని మొదలపెట్టారు. 20 సవత్సరాల పాటు చైర్ మాన్ గా పనిచేసి రికార్దు సృష్టించారు.[1] కొత్త రఘురామయ్య గారి సహకారంతో రాష్ట్రంలోనే మొదటి రైల్వే పై వంతెన గుంటూరు అరండల్ పేట వద్ద నిర్మించటానికి కృషి చేసారు.[2]
1962 లో గుంటూరు పశ్ఛిమ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్దిగా గెలుపొందారు. తిరిగి 1967 లోనూ అక్కడి నుండే శాసన సభకు ఏన్నికై 1972 వరకు పనిచేసినారు. ఆ తరువాత 1976లో శాసన మండలి సభ్యునిగా ఎన్నికై 1983 వరకు పనిచేసారు.[3]
1976 -78 మధ్యలో జలగం వెంగళరావు గారి మంత్రి వర్గంలో రవణా శాఖామాత్యులుగా పనిచేసారు.
1980- 82 మధ్యకాలంలో టి. అంజయ్య గారి మంత్రివర్గంలో మార్కెటెంగ్ శాఖ మంత్రిగా పనిచేసారు[3].గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ లో కీలక పాత్ర వహించారు
మరణం
మార్చుచేబ్రొలు హనుమయ్య గారు 2002 జూన్ 20న హైదరాబాద్ లో తన 79 వ ఎట కన్నుమూసారు. వీరికి భార్య ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు[1].
నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యం లో గుంటూరులో అనేక విద్యాసంస్థల స్థాపనలో విశేషమైన కృషి చేసారు. వీరి చేసిన సేవలకు గుర్తింపుగా వారి పేరును చేబ్రోలు హనుమయ్య ఇనిస్టూట్ ఆఫ్ ఫార్మస్టుకల్ సైన్ (CHIPS) అనే కళాశాలకు 2007 లో పెట్టారు.[4]
వీరి సేవలకు గుర్తింపుగా గుంటూరు నగరంలో రింగ్ రోడ్డు, రాజేంద్ర నగర్ కూడలి (చేబ్రోలు హనుమయ్య సర్కిల్ ) లో వీరి కాంశ విగ్రహాన్ని నెలకొల్పారు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Senior Congressman dead". The Times of India. 21 June 2002. Retrieved 20 August 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Traffic problems continue in Guntur". The Hindu. 7 March 2017. Retrieved 20 August 2021.
- ↑ 3.0 3.1 భావయ్య చౌదరి, కొత్త (2005). కమ్మ వారి చరిత్ర. గుంటూరు: పావులూరి పబ్లికేషన్. p. 205.
- ↑ "Chebrolu Hanumaiah Institute of Pharmaceutical Sciences (CHIPS)".
{{cite web}}
: CS1 maint: url-status (link)