టంగుటూరి అంజయ్య

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి.

టంగుటూరి అంజయ్య (ఆగష్టు 16,1919 - అక్టోబరు 19,1986), రామాయంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 7వ ముఖ్యమంత్రిగా. అతను 1980 అక్టోబరు నుండి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[1]

టంగుటూరి అంజయ్య
టంగుటూరి అంజయ్య విగ్రహం
7వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
In office
11 అక్టోబరు 1980 – 24 ఫిబ్రవరి 1982
గవర్నర్కె.సి.అబ్రహాం
అంతకు ముందు వారుమర్రి చెన్నారెడ్డి
తరువాత వారుభవనం వెంకట్రామ్
Member of the భారత Parliament
for సికింద్రాబాదు
In office
31 డిసెంబరు 1984 – 27 నవంబరు 1986
అంతకు ముందు వారుపి.శివశంకర్
తరువాత వారుటి.మణెమ్మ
వ్యక్తిగత వివరాలు
జననం1919 ఆగస్టు 16
భానూరు, బ్రిటిష్ ఇండియా
మరణం1986 (67 సం.వయసులో)
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిటంగుటూరి మణెమ్మ
సంతానం1కుమారుడు, 4గురు కుమార్తెలు
నివాసంభానూరు, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం

జీవిత విశేషాలు మార్చు

టి. అంజయ్యగా సుపరిచితుడైన టంగుటూరి అంజయ్య అలియాస్ తాళ్ళ రామకృష్ణారెడ్డి 1919, ఆగష్టు 16హైదరాబాదు లో జన్మించాడు. అంజయ్య తండ్రి పాపిరెడ్డిది సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలంలోని భానూర్ గ్రామం. అయితే వారి కుటుంబం హైదరాబాదు లో స్థిరపడింది. అంజయ్య వెనుకబడిన కులానికి లేదా దళిత వర్గానికి చెందినవారని లేదా గౌడ కులం, రెడ్డికులం వారితో సాన్నిహిత్యం ఏర్పరచుకోన్నారని తన పేరును రామకృష్ణారెడ్డి అని మార్చుకున్నారని, తన ముఖ్యమంత్రి పదవీకాలానికి రాజకీయంగా శక్తివంతమైన రెడ్డి సంఘం మద్దతు పొందటానికి రెడ్డి కులస్తులతో వైవాహిక సంబంధాలు కుదుర్చుకున్నారని అతనిపై ఆరోపణలున్నాయి.[2][3]

అంజయ్య సుల్తాన్ బజార్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ వరకూ చదువుకున్నాడు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తరువాత ఉన్నత విద్యాభాసం చేయలేదు. హైదరాబాదు ఆల్విన్ పరిశ్రమలో ఆరణాల (24 పైసలు) కూలీగా జీవితం ప్రారంభించిన అంజయ్య, కార్మిక నాయకునిగా ఎదిగి ఆతరువాత కేంద్ర కార్మిక మంత్రి అయ్యాడు.[4][5]

కాంగ్రెసు పార్టీకి చెందిన అంజయ్య మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనాడు.[6] అంజయ్య తన ప్రారంభ జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు, ఇది అతనిని సామాజిక న్యాయం కోసం పోరాట యోధునిగా చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజకీయాలకు అనుగుణంగా పనిచేసాడు.

ముఖ్యమంత్రిగా మార్చు

1980 లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో అసమ్మతి ఉధృతమై, అవినీతి ఆరోపణలు పెరిగిపోవడంతో కాంగ్రెసు పార్టీ అధిష్టాన వర్గము ఆయన్ను తొలగించి, కేంద్రములో ఇందిరా గాంధీ మంత్రివర్గములో కార్మిక శాఖా మంత్రిగా పనిచేస్తున్న అంజయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది. అతను మర్రి చెన్నారెడ్డి తరువాత 1980 అక్టోబరు 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించాడు. మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలోని 15 మంది అసమ్మతి వాదులకు పదవులు ఇవ్వవలసి వచ్చింది. పార్టీలో సొంత వర్గమంటూ లేని అంజయ్య వివిధ వర్గాల వారికి మంత్రివర్గములో పదువులు ఇవ్వాల్సి వచ్చింది. 61 మంది మంత్రులతో, అంజయ్య భారీ మంత్రివర్గాన్ని హాస్యాస్పదంగా జంబో మంత్రివర్గమని పిలిచేవారు.[7][8]

అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇద్దరు యువ తిరుగుబాటు రాజకీయ నాయకులు, డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి. నారా చంద్రబాబునాయుడు, ప్రాముఖ్యతను పొందారు. ఈ సమయంలో ఎన్టీఆర్ను రాజ్యసభ సభ్యునిగా చేయాలనే ప్రతిపాదన చేసారు.[9] అంజయ్య పి.జనార్దన్ రెడ్డికి గురువు. విశాఖపట్నం, విజయవాడలలో మునిసిపల్ ఎన్నికలలో అధికార పార్టీ ఓడిపోయిన తరువాత టి.అంజయ్య తన పార్టీలోని కొంతమంది మంత్రులతో సహా ప్రత్యర్థులను ఎదుర్కొన్నాడు.

మంత్రుల సభ్యులను తగ్గించాలని అధిష్టానవర్గం ఒత్తిడి తేగా, తొలగించినవారికి పదవులిచ్చి సంతృప్తి పరచడానికి అనేక నిరుపయోగమైన కార్పోరేషన్లు సృష్టించాడు. అసమ్మతిదారుల విలాసాల కోసము హెలికాప్టర్లు, కార్లు వంటి వాటి మీద ఖర్చుచేశాడు[10]. అంజయ్య ప్రభుత్వములో కూడా 1982 కల్లా అసమ్మతి వర్గము పెరిగిపోయినందున, ఫిబ్రవరి 13 న పదవి నుంచి వైదొలగాలని శ్రీమతి ఇందిరా గాంధీ కోరినప్పుడు, అతను తన రాజీనామాను ఏడు రోజుల తరువాత 1982 ఫిబ్రవరి 20 న అధికారికంగా ఇచ్చాడు. అతను అధిష్టానవర్గ ఆదేశముననుసరించి ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగవలసి వచ్చింది. అనుచరులు లేని నాయకుడిగా అతను అనూహ్యమైన ప్రజల సానుభూతిని పొందగలిగాడు. ముఖ్యమంత్రిగా తన చివరి బహిరంగ ప్రదర్శనలో, అతను రాజీనామా చేయడానికి ముందు రోజు 30,000 మంది ప్రజలు పాల్గొన్నారు[11] 1982 ఫిబ్రవరి 24 న భవనం వెంకటరామిరెడ్డి అంజయ్య స్థానంలో ముఖ్యమంత్రి పీఠాన్నిఅధిష్టించాడు.

అంజయ్య ముఖ్యమంత్రి కాగానే చేసిన ముఖ్యమైన పనులలో పంచాయితీ రాజ్ సంస్థలకు ఎన్నికలు జరిపించటం ఒకటి.[12]

1984 పార్లమెంటు ఎన్నికలలో సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం నియోజకవర్గము నుండి గెలిచి మరణించే వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. ఆ ఎన్నికలలో రాష్ట్రము నుండి ఎన్నికైన ఆరుగురు కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులలో అంజయ్య ఒకడు అవటము విశేషము. ఈ కాలములోనే అంజయ్య కేంద్ర కార్మిక శాఖా మత్రిగా రాజీవ్ గాంధీ మంత్రివర్గములో పనిచేశాడు. ఈయన తర్వాత ఈయన సతీమణి టంగుటూరి మణెమ్మ కూడా సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు ఎన్నికైంది. 2018 సెప్టెంబరు 9 న మణెమ్మ హైదరాబాదులో చనిపోయింది.

 
టంగుటూరి అంజయ్య

రాజీవ్ గాంధీతో సంఘటన మార్చు

అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతనికి విమానాశ్రయంలో అవమానం జరిగింది. రాజీవ్ గాంధీ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చాడు. బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో రాజీవ్ గాంధీని స్వాగతించేందుకు అంజయ్య భారీ ఏర్పాట్లు చేశాడు.[13] అంజయ్య అనుచరగణాన్ని వేసుకుని వెళ్ళి విమానం ఆగుతూండగానే భారీ కాయంతో, భారీ దండల్తో రన్‌వే పైకి, పరుగులు పెట్టుకుంటూ వెళ్లాడు. అతనితో పాటు అనేక మంది జనం వెళ్లారు. స్వతహాగా పైలట్‌ అయిన రాజీవ్‌కు విమానాశ్రయంలో యీ భద్రతారాహిత్యం ఒళ్లు మండించింది. తెచ్చిన పూలదండలలోని పూల రేకులు విమానం ప్రొపెర్లలో పడతాయని ఆందోళనతో అంజయ్యను మందలించాడు. దానికి అంజయ్య మొహం మాడ్చుకున్నాడు తప్ప నిరసన తెలపలేదు. తను చేసినది ఎయిర్‌పోర్టు రూల్సుకు వ్యతిరేకమని అతనికి తెలుసు. ఈ వార్త పత్రికలకు ఎక్కాక ఎవ్వరూ అంజయ్యగారిని సమర్థించలేదు. రాజీవ్‌ కాస్త మెత్తగా చెప్పి వుండాల్సిందనే అనుకున్నారంతే.[14]

ఎలాంటి పదవి లేని రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రిని తోసేయడం సంచలనం సృష్టించింది. అంజయ్య దళితుడు కాబట్టే రాజీవ్ గాంధీ అతన్ని అవమానించారని 2018 బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటులో ప్రధాని మోదీ స్వయంగా అన్నారు. నిజానికి టి.అంజయ్య దళితుడు కాదు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారన్నది పాశం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్టులు చెప్పే మాట.[15]

తెలుగు వారికి జరిగిన అవమానంతో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించాడు. పార్టీ ప్రారంభించిన 9 నెలల్లోనే అధికారాన్ని అందిపుచ్చుకున్న తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది.[16]

విశేషాలు మార్చు

  • అసలు పేరు తాళ్ళ అంజయ్య కానీ తన పేరు టంగుటూరి కృష్ణారెడ్డి అని, తాను రెడ్డినే అని అంజయ్య ముఖ్యమంత్రి అయిన తరువాత చెప్పాడు.
  • హిందీ, ఉర్దూ మాట్లాడటం, అంజయ్యకు కలిసివచ్చాయి. ముఖ్యమంత్రిగా ఆయన జంబో జెట్ మంత్రివర్గాన్ని 61మందితో ఏర్పరచి ఏమంత్రికి ఎవరి సిఫారసు ఉన్నదో బయట పెట్టాడు. కాదనలేక జాబితా పెంచుతూ పోయాడు.
  • అంజయ్య మాట్లాడేదే అసలైన తెలుగని దాశరథి వ్యాఖ్యానించాడు. సముద్రంలో తేల్ పడిందంట లాంటి తెలుగు ఉర్దూ కలిపిన పదాలు ఆయన ఎన్నో వాడుతుండేవారు.
  • టి. అంజయ్య డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లో ఆసుపత్రి ప్రారంభించడానికి సహాయం అందించాడు. సంజీవయ్య పార్క్ వద్ద నగరం నడిబొడ్డున 7 ఎకరాల భూమిని ఇవ్వడం ద్వారా అంజయ్య తన వాగ్దానానికి అనుగుణంగా నడుచుకున్నాడు.[17]
  • టి. అంజయ్య ముఖ్యమంత్రి సహాయ నిధి 1982 లో హైదరాబాద్ లో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను స్పాన్సర్ చేసింది.
  • టంగుటూరి అంజయ్య ప్రసంగాలతో ప్రేరణ పొందిన విజయ చందర్ టంగుటూరి ప్రకాశం జీవిత చరిత్ర ఆధారంగా ఆంధ్రకేసరి సినిమా తీయాలనే ఆలోచన చేసాడు. అటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని అంజయ్య తెలిపాడు.
  • మాతా మనికేశ్వరి కోరిక మేరకు శ్రీశైలంలో టంగుటూరి అంజయ్య గారు సుఖా ఆశ్రమం నిర్మాణానికి 1981 మే 8 న భూమి పూజ చేశారు.
  • అంజయ్య కూడా కొంతకాలం తెలంగాణ ప్రజాసమితి నాయకుడిగా ఉన్నాడు.[18]
  • ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి, నారాచంద్రబాబు నాయుడులు అంజయ్య మంత్రివర్గంలో పనిచేసారు. చంద్రబాబు నాయుడు సినిమాటోగ్రఫీ మంత్రిగానూ, రాజశేఖర రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.

మూలాలు మార్చు

  1. Eenadu (29 October 2023). "అంచెలంచెలుగా.. అత్యున్నతంగా." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  2. Ramaseshan, Radhika (29 March 2008). "Rajiv shadow in Rahul snub". The Telegraph (Kolkata). Retrieved 25 October 2019.
  3. K Ramachandra Murthy (13 March 2014). "Can a BC hope to become first CM of T?". The Hans India. Retrieved 25 October 2019.
  4. "లుంబినీ పార్కు వద్ద అంజయ్య విగ్రహ ఆవిష్కరణ సందర్భముగా హిందూ పత్రికలో వ్యాసం". Archived from the original on 2007-03-03. Retrieved 2006-12-10.
  5. "YSR to unveil Anjaiah's statue on August 16". 14 August 2006. Retrieved 24 September 2016 – via The Hindu.
  6. "'మాజీ సీఎం అంజయ్య దళితుడు కాదు అసలు పేరు రామకృష్ణారెడ్డి'". Samayam Telugu. Retrieved 2021-03-08.
  7. Parties, Elections, and Mobilisation - K. Ramachandra Murty పేజీ.41
  8. "The Hindu : POLL-POURRI". Archived from the original on 2009-09-10. Retrieved 2016-09-24.
  9. "Humanists Chief Ministers I Met". Retrieved 24 September 2016.
  10. Plotting, Squatting, Public Purpose, and Politics: Land Market Development, Low Income Housing and Public intervention in India - Robert-Jan Baken పేజీ.41
  11. "Andhra Pradesh CM Tanguturi Anjiah unceremoniously fired by Congress high command". Retrieved 24 September 2016.
  12. The Indian Journal of Political Science By Indian political science association Vol. 35, no. 4 (Oct.-Dec. 1974) పేజీ.542 [1]
  13. "తెలంగాణ ఎన్నికలు 2018: నెహ్రూ నుంచి సోనియా గాంధీ దాకా... తెలంగాణపై ఏమన్నారు?". BBC News తెలుగు. Retrieved 2021-03-08.
  14. April 26; Ist, 2014 | Updated 03:30. "ఎమ్బీయస్‌ : తెలుగుజాతికి అవమానమా..?". telugu.greatandhra.com (in ఇంగ్లీష్). Retrieved 2021-03-08.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  15. Mittapalli, Srinivas (2020-11-28). "ఆనాడు అంజయ్యకు.. ఇప్పుడు కేసీఆర్‌కు? తెలంగాణకు మోదీ ఘోర అవమానమంటున్న టీఆర్ఎస్..." telugu.oneindia.com. Retrieved 2021-03-08.
  16. "టీడీపీ 37వ ఆవిర్భావ దినోత్సవం..! మరో ఆత్మగౌరవ పోరాటం..!". తెలుగు360 (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-03-29. Retrieved 2021-03-08.
  17. Gupte, Pranay (15 December 2013). Healer: Dr Prathap Chandra Reddy and the Transformation of India. Penguin UK. ISBN 9789351185666. Retrieved 24 September 2016 – via Google Books.
  18. Telugu, TV9 (2020-01-05). "The history of Telugu states- ఒకసారి చరిత్ర చూసొద్దామా.. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు!". TV9 Telugu. Retrieved 2021-03-08.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)


ఇంతకు ముందు ఉన్నవారు:
డా.మర్రి చెన్నారెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
11/10/1980—24/02/1982
తరువాత వచ్చినవారు:
భవనం వెంకట్రామ్