చైన్‌సుఖ్ మదన్‌లాల్ సంచేతి
చైన్‌సుఖ్ మదన్‌లాల్ సంచేతి (జననం 16 డిసెంబర్ 1953) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మల్కాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
చైన్‌సుఖ్ మదన్‌లాల్ సంచేతి | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 | |||
ముందు | రాజేష్ ఎకాడే | ||
---|---|---|---|
పదవీ కాలం 1995 – 2019 | |||
ముందు | దయారామ్ తంగడే | ||
తరువాత | రాజేష్ ఎకాడే | ||
నియోజకవర్గం | మల్కాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | మదన్‌లాల్ సంచేతి | ||
జీవిత భాగస్వామి | ఉజ్వల సంచేతి | ||
సంతానం | రక్షా సంచేతి (కుమార్తె) రాహుల్ సంచేటి (కొడుకు) తనుశ్రీ సంచేటి (కుమార్తె) ప్రియాంక్ సంచేటి (కొడుకు) అజయ్ సంచేతి (మేనల్లుడు) | ||
పూర్వ విద్యార్థి | ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, నాగ్‌పూర్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుచైన్సుఖ్ సంచేతి తన రాజకీయ జీవితాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)తో విద్యార్థి నాయకుడిగా ప్రారంభించి 1976లో శ్రీ విద్యార్థి పరిషత్తు అధ్యక్షునిగా, 1978లో సంచేతి మహారాష్ట్రలోని జనతా యువమోర్చా (బీజేపీ ఏర్పాటుకు ముందు జనతా పార్టీలో) కార్యదర్శిగా, 1980లో మహారాష్ట్రలోని భారతీయ జనతా యువమోర్చా కార్యదర్శిగా, 1984లో మహారాష్ట్ర బిజెపి కార్యదర్శిగా, 1989లో మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, సంచేటి మహారాష్ట్ర బిజెపికి కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి & ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు.
చైన్‌సుఖ్ సంచేతి 1990లో మల్కాపూర్ నుండి మున్సిపల్ కౌన్సిల్ కార్పొరేటర్‌గా ఆ తర్వాత మల్కాపూర్ మునిసిపల్ కౌన్సిల్ 1990 నుండి 1994 వరకు ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యాడు. అయన 1995 నుండి 2014 వరకు మల్కాపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా వరుసగా ఎన్నికై,[1] 2019 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి తిరిగి 2024 మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ ఎకాడేపై 26397 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]
మూలాలు
మార్చు- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Malkapur". Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
- ↑ The Times of India (19 June 2019). "Chainsukh Sancheti takes over as VDB chairman". Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.