చో లా, ఈశాన్య నేపాల్‌లోని సోలుకుంబు జిల్లాలో సముద్ర మట్టానికి 5,420 మీటర్లు (17,782 అ.) ఎత్తున ఉన్న కనుమ. ఇది తూర్పున ఉన్న జొంగ్లా గ్రామాన్ని (4,830 మీటర్లు (15,850 అ.), పశ్చిమాన ఉన్న తగ్నాక్ గ్రామాన్నీ (4,700 మీటర్లు (15,400 అ.)) కలుపుతుంది.

చో లా కనుమ
తూర్పు నుంచి చూసినపుడు చో లా కనుమ
సముద్ర మట్టం
నుండి ఎత్తు
5,420 m (17,782 ft)
ప్రదేశంసోలుఖుంబు జిల్లా, నేపాల్
శ్రేణిహిమాలయాలు
Coordinates27°57′44″N 86°45′07″E / 27.962122°N 86.751923°E / 27.962122; 86.751923
చో లా కనుమ is located in Koshi Province
చో లా కనుమ
కనుమ స్థానం
చో లా కనుమ is located in Nepal
చో లా కనుమ
చో లా కనుమ (Nepal)

పర్యాటకం

మార్చు

ఈ పాస్ ఖుంబు ఎవరెస్ట్ ప్రాంతంలో గోక్యో ట్రెయిల్‌లో ఉంది. పశ్చిమాన ఉన్న బాట గోక్యో సరస్సుల వరకు సాగుతూ, మార్గంలో న్గోజుంప హిమానీనదాన్ని దాటుతుంది. తూర్పున ఉన్న బాట ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్‌తో కలుస్తుంది.[1]

ఈ కమ్నుమ దారిలో ప్రయాణం కష్టతరంగా ఉంటుంది. అడుగు జారుతూ ఉండే హిమానీనదం పైన క్రాంపాన్స్ అవసరమౌతాయి. హిమానీనదం అంచు అస్థిరంగా ఉంటుంది. [1] చో లా కనుమ సంవత్సరంలో 9 నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. ఉష్ణోగ్రత చాలా కాలం పాటు 0 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది.[2]

 
చో లా కనుమ నుండి చో లా లోయలోకి దిగేటప్పుడు తూర్పు వైపు చూసిన దృశ్యం, 5,200 మీటర్ల ఎత్తున హిమానీనద సరస్సు, మంచుతో కప్పబడిన రాళ్ళు, అమా దబ్లం (6,810 మీటర్లు), ఇతర హిమాలయాలు

ఎత్తు

మార్చు

చో లా పాస్ ద్వారా ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు వెళ్ళే ఆరోహణ 2,846 మీటర్ల ఎత్తున ఉన్న లుక్లాలో మొదలై 5,545 మీటర్ల ఎత్తున ఉన్న కాలా పత్తర్ వరకు వెళుతుంది. కాలా పత్తర్ ఈ మార్గంలో అత్యంత ఎత్తైన ప్రదేశం. ట్రెక్ ప్రారంభ స్థానం నుండి ఎత్తైన ప్రదేశానికి, ఎత్తు పెరుగుదల 2,699 మీటర్లు.

ఈ దారిలో ట్రెక్కింగు, 5,000 మీటర్ల కంటే ఎగువన ఉన్న అనేఖ ప్రదేశాల గుండా వెళ్తుంది. అవి: నాగార్జున హిల్ (5,100 మీ), గోరక్ షెప్ (5,164 మీ), ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (5,364 మీ), కాలా పత్తర్ (5,545 మీ), చో లా (5,420 మీ), గోక్యో రి (5,357 మీ). [3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Armington, Stan (2001). Trekking in the Nepal Himalaya. Lonely Planet. pp. 480. ISBN 978-1864502312. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "lp" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. Hiking, Adventure Treks. "Chola Pass". Chola Pass.
  3. https://natureexcursion.com/gokyo-chola-pass-trekking