చౌడాపూర్ మండలం
చౌడాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా లోని వికారాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 2021 ఏప్రిల్ 24 న కొత్తగా ఏర్పడిన మండలం. [1][2] చౌడాపూర్ గ్రామం కొత్త మండలంగా ఏర్పడక ముందు కుల్కచర్ల మండల పరిధిలో ఉంది. చౌడాపూర్ గ్రామం ఈ మండలానికి ప్రధాన పరిపాలనా కేంద్రం. చౌడాపూర్ మండలాన్ని కుల్కచర్ల మండలం లోని 7 గ్రామాలు, మహబూబ్ నగర్ జిల్లాలోని నవాబ్ పేట మండలం లోని 7 గ్రామాలు కలిపి మొత్తం 14 గ్రామాలతో వికారాబాద్ జిల్లా, వికారాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో 2021 ఏప్రిల్ 24 నుండి నూతన మండలంగా ప్రభుత్వం ప్రకటించింది.[3] 2016 లో చేసిన తొలి పునర్వ్యవస్థీకరణలో కాకుండా ఆ తరువాత నుండి 2021 వరకూ మధ్య గల కాలంలో కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లో ఇది ఒకటి. [4][5] ఇందులో 14 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది. [6] ప్రస్తుతం ఈ మండలం తాండూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా వికారాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.[7]
చౌడాపూర్ మండలం | |
— మండలం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°59′14″N 77°58′32″E / 16.987296°N 77.975641°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వికారాబాదు జిల్లా |
మండల కేంద్రం | చౌడాపూర్ |
గ్రామాలు | 14 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 26,988 |
- పురుషులు | 13,802 |
- స్త్రీలు | 13,186 |
పిన్‌కోడ్ | 509335 |
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- చౌడపూర్
- మండిపాల్
- వీరాపూర్
- విఠలాపూర్
- మక్తా వెంకటాపూర్
- అడవి వెంకటాపూర్
- లింగంపల్లి
- కొత్తపల్లి
- పురుసంపల్లి
- మల్కాపూర్
- మరికల్
- కన్మన్ కాల్వ
- మొగిలిపల్లి
- చాకల్‌పల్లి
గమనిక:పైన వివరింపబడిన రెవెన్యూ గ్రామాలలో వ.సంఖ్య 1 నుండి 7 వరకు గల గ్రామాలు కుల్కచర్ల మండలం నుండి, వ.సంఖ్య 8 నుండి 14 వరకు గల గ్రామాలు మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం నుండి చౌడాపూర్ మండలంలో విలీనమయ్యాయి.[8][4]
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-05-11. Retrieved 2021-05-11.
- ↑ "Notification to create two new mandals issued". The New Indian Express. Retrieved 2021-05-13.
- ↑ "కొత్త మండలాలకు గ్రీన్ సిగ్నల్". Namasthe Telangana. 2021-04-24. Retrieved 2021-05-15.
- ↑ 4.0 4.1 "రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాల ఏర్పాటు". Namasthe Telangana. 2021-04-24. Retrieved 2022-01-04.
- ↑ "Notification to create two new mandals issued". The New Indian Express. Retrieved 2022-01-04.
- ↑ "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ Service, Express News (2021-04-25). "Notification to create two new mandals issued". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-01-30.
- ↑ "తెలంగాణలో కొత్త మండలాలు ఇవే.. ఉత్తర్వులు జారీ". Samayam Telugu. Retrieved 2021-05-15.