తాండూరు రెవెన్యూ డివిజను

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాదు జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం.

తాండూరు రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాదు జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. వికారాబాదు జిల్లాలోని 2 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 8 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం తాండూరు పట్టణంలో ఉంది.[2] 016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఇది చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలోని తాండూర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

తాండూరు రెవెన్యూ డివిజను
తాండూరు పట్టణం
తాండూరు పట్టణం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లావికారాబాదు

వివరాలు మార్చు

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[4]

పరిపాలన మార్చు

తాండూరు డివిజన్‌లోని మండలాలు:[5]

క్ర.సం తాండూరు రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 పెద్దేముల్‌ మండలం 29 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు)
2 యాలాల్‌ మండలం 34 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
3 కొడంగల్ మండలం 19 రెవెన్యూ గ్రామాలు
4 బొంరాస్‌పేట్ మండలం 25 రెవెన్యూ గ్రామాలు
5 దౌలతాబాద్ మండలం 26 రెవెన్యూ గ్రామాలు
6 బషీరాబాద్ మండలం 31 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
7 తాండూరు మండలం 38 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
8 చౌడాపూర్ మండలం 14 రెవెన్యూ గ్రామాలు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Suryapet district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 11 October 2016. Retrieved 2022-09-12.
  3. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-09-12.
  4. "Revenue Department | VIKARABAD DISTRICT , GOVERNMENT OF TELAGANA | India". Archived from the original on 2022-01-29. Retrieved 2022-09-12.
  5. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-09-12. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)