ఛప్రా
ఛప్రా భారత రాష్ట్రం బీహార్ లోని సారణ్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది ఘఘరా నది, గంగా నదుల సంగమానికి సమీపంలో ఉంది.
ఛప్రా | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°47′05″N 84°43′39″E / 25.7848°N 84.7274°E | |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | సారణ్ |
జిల్లా | సారణ్ |
విస్తీర్ణం | |
• Urban | 38.26 కి.మీ2 (14.77 చ. మై) |
Elevation | 36 మీ (118 అ.) |
జనాభా (2011) | |
• పట్టణం | 2,01,598 |
• Urban | 2,49,556 |
భాష | |
• అధికారిక | హిందీ[2] |
Time zone | UTC+5:30 (IST) |
Pincode(s) | 841 301, 841 302 |
Area Code(s) | +91-6152 |
Vehicle registration | BR 04 |
లింగనిష్పత్తి | 900 (females per 1000 males)[3] ♂/♀ |
Website |
18 వ శతాబ్దంలో డచ్చి, ఫ్రెంచి, పోర్చుగీసు, ఇంగ్లీషు వాళ్ళు ఈ ప్రాంతంలో పొటాషియం నైట్రేట్ శుద్ధి కర్మాగారాలను స్థాపించడంతో ఛప్రా పట్టణం, నది ఆధారిత మార్కెట్‌గా ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీనిని 1864 లో మునిసిపాలిటీగా ఏర్పరచారు. ప్రధాన రైల్వే స్టేషన్ ఛప్రా జంక్షన్. ఛాప్రాలో అంబికా భవానీ అనే పేరుగల [4] శక్తి పీఠం ఉంది.
భౌగోళికం
మార్చుఛప్రా 25°47′05″N 84°43′39″E / 25.7848°N 84.7274°E నిర్దేశాంకాల వద్ద,[5] సముద్ర మట్టం నుండి 36 మీటర్ల ఎత్తున ఉంది.
పట్టణ విశేషాలు
మార్చుభారతదేశంలో కెల్లా అతిపెద్దదైన రెండు అంతస్థుల పైదారిని (ఫ్లై ఓవరు) ఛప్రాలో నిర్మిస్తున్నారు.[6] 3.5కి.మీ. పొడవైన ఈ పైదారి మహాత్మా గాంధీ చౌక్ నుండి నగరపాలిక చౌక్ వరకు ఉంటుంది.[7] బీహార్ రాజ్య పుల్ నిర్మాణ్ నిగమ్ లిమిటెడ్, కేంద్ర రోడ్ల నిధి (సిఆర్ఎఫ్) నుండి ₹ 411,31 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మిస్తోంది.[8][9] ఇది శాంటా క్రజ్-చెంబూర్ లింక్ రోడ్‌లోని 1.8 కి.మీ. రెండు అంతస్థుల పైదారి కంటే పొడవైనది.[10] ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు 2018 జూలైలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పునాది వేశాడు. ఇది 2022 జూన్ నాటికి పూర్తి చెయ్యాలని తలపెట్టారు.[11]
శీతోష్ణస్థితి
మార్చుశీతోష్ణస్థితి డేటా - Chhapra | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 23.1 (73.6) |
25.8 (78.4) |
31.0 (87.8) |
35.1 (95.2) |
35.0 (95.0) |
34.9 (94.8) |
32.5 (90.5) |
32.8 (91.0) |
32.5 (90.5) |
31.6 (88.9) |
29.0 (84.2) |
24.8 (76.6) |
30.7 (87.2) |
సగటు అల్ప °C (°F) | 9.2 (48.6) |
11.0 (51.8) |
15.1 (59.2) |
19.1 (66.4) |
21.2 (70.2) |
22.9 (73.2) |
23.8 (74.8) |
24.2 (75.6) |
23.8 (74.8) |
21.2 (70.2) |
15.8 (60.4) |
10.6 (51.1) |
18.2 (64.7) |
సగటు అవపాతం mm (inches) | 13.0 (0.51) |
14.0 (0.55) |
9.0 (0.35) |
29.0 (1.14) |
76.0 (2.99) |
139.0 (5.47) |
353.0 (13.90) |
254.0 (10.00) |
193.0 (7.60) |
73.0 (2.87) |
6.0 (0.24) |
7.0 (0.28) |
1,166 (45.9) |
Source: Accuweather[12] |
జనాభా
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం, ఛప్రా అర్బన్ అగ్లోమెరేషన్ జనాభా 2,12,955.[13] ఛప్రా అర్బన్ అగ్లోమెరేషన్‌లో ఛప్రా (నగర్ పంచాయతీ), సంధా (జనగణన పట్టణం) ఉన్నాయి.[14] ఛప్రా నగర పంచాయతీలో మొత్తం జనాభా 2,01,597, వీరిలో 1,06,250 మంది పురుషులు, 95,347 మంది మహిళలు ఉన్నారు. లింగ నిష్పత్తి 897. ఆరేళ్ళ లోపు పిల్లలు 27,668. చాప్రాలో ఏడేళ్ళకు పైబడినవారిలో అక్షరాస్యత 2011 నాటికి 81.30%.[15]
పట్టణ ప్రముఖులు
మార్చు- చిత్రగుప్త, సంగీత దర్శకుడు
మూలాలు
మార్చు- ↑ "CPRS Patna About Us". CRPS. Archived from the original on 5 March 2016. Retrieved 28 October 2016.
- ↑ "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 9 March 2019.
- ↑ "Chapra City Census 2011 data". www.census2011.co.in.
- ↑ "जानिए बिहार के तीन शक्तिपीठों में से एक सारण की अंबिका भवानी की महिमा". 29 September 2014. Archived from the original on 9 August 2016.
- ↑ "Maps, Weather, and Airports for Chapra, India". www.fallingrain.com. Archived from the original on 10 May 2008.
- ↑ "Chhapra to get Bihar's first double-decker flyover". The Times of India.
- ↑ "Two-deck flyover cost: Rs 411cr".
- ↑ "CM to open highway at Chhapra". The Times of India. 10 July 2018. Retrieved 27 December 2020.
- ↑ "Chhapra road bounty". Archived from the original on 2018-07-12. Retrieved 2021-01-28.
- ↑ "Saran to beat Mumbai marvel". Archived from the original on 2018-07-12. Retrieved 2021-01-28.
- ↑ "Flyover first on Lalu's once turf". Archived from the original on 2018-07-12. Retrieved 2021-01-28.
- ↑ "Accuweather: Weather for Chhapra, India". Accuweather. 2011. Archived from the original on 3 September 2014. Retrieved on 22 November 2011.
- ↑ "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Archived (PDF) from the original on 13 November 2011. Retrieved 16 April 2012.
- ↑ "Constituents of urban Agglomerations Having Population 1 Lakh & above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Archived (PDF) from the original on 17 June 2016. Retrieved 16 April 2012.
- ↑ "Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Archived (PDF) from the original on 7 May 2012. Retrieved 16 April 2012.