చిత్రగుప్త (సంగీత దర్శకుడు)
చిత్రగుప్త ప్రఖ్యాత హిందీ సినిమా దర్శకుడు. ఇతడు 1940-50వ దశకాలలో ఎన్నో విజయవంతమైన సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతడు ప్రముఖ సంగీత దర్శకుల జంట ఆనంద్-మిలింద్‌ల తండ్రి[1].
చిత్రగుప్త శ్రీవాత్సవ | |
---|---|
జననం | చిత్రగుప్త శ్రీవాత్సవ 1917 నవంబరు 16 కర్‌మైని, గోపాల్ గంజ్ జిల్లా, బీహార్ రాష్ట్రం |
మరణం | 1991 జనవరి 14 | (వయసు 73)
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | పాట్నా యూనివర్శిటీ, భాత్కండే మ్యూజిక్ యూనివర్సిటీ |
వృత్తి | సినిమా సంగీత దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1946–1985 |
పిల్లలు |
|
విశేషాలు
మార్చుఇతడు బీహార్ రాష్ట్రానికి చెందిన గోపాల్‌గంజ్ జిల్లా కర్‌మైని గ్రామంలో 1917 నవంబర్ 16వ తేదీన జన్మించాడు. ఇతని పూర్తిపేరు చిత్రగుప్త శ్రీవాత్సవ. ఇతడు ఎకనామిక్స్‌లోను, జర్నలిజంలోను పాట్నా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. చదివాడు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఇతడు జైలుకు వెళ్లాడు. అదే సమయంలో ఒకసారి జవహర్‌లాల్ నెహ్రూ దగ్గర "సారే జహాసే అచ్ఛా" అనే గేయాన్ని పాడాడు. ఇతడు ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు మదన్ సిన్హా ప్రోత్సాహంతో భాత్కండే మ్యూజిక్ యూనివర్సిటీ నుండి సంగీతంలో డిగ్రీ సంపాదించాడు.[1]
సినిమారంగం
మార్చుఇతడు తన స్నేహితుడు సర్వోత్తమ్ బాదామి సహకారంతో ఎస్. ఎన్. త్రిపాఠి వద్ద సహాయకునిగా చేరాడు. ఇతడు మొట్టమొదట స్వతంత్రంగా సంగీతం కూర్చిన సినిమా 1946లో విడుదలైన నాడియా నటించిన స్టంట్ సినిమా "లేడీ రాబిన్‌హుడ్". తరువాత ఇతడు త్రిపాఠీతో కలిసి పనిచేశాడు. అయితే త్రిపాఠీ ఇతడు నూతనరీతులలో చేసే ప్రయోగాలను అంగీకరించకపోవడంతో 1954లో అతని నుండి విడిపోయాడు. ఇతడికి బాగా పేరు తెచ్చిన సినిమా 1952లో వచ్చిన "సింద్‌బాద్ ది సైలర్". ఈ సినిమాకు మహేష్ భట్ తండ్రి నానాభాయ్ భట్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మహమ్మద్ రఫీ, షంషాద్ బేగం పాడిన ఆదాసే జూమ్‌తే హుయే అన్న పాట బాగా హిట్ అయ్యింది. 1940-1950లలో ఇతడు ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. వాటిలో ఫైటింగ్ హీరో, తూఫాన్ క్వీన్ వంటి స్టంట్ సినిమాలు, నాగపంచమి, శివరాత్రి, గణేశ్ వివాహ్ వంటి పౌరాణిక చిత్రాలు ఉన్నాయి. 1955లో విడుదలైన శివభక్త సినిమాతో ఇతడు అగ్రశ్రేణి సంగీత దర్శకుల కోవలోకి చేరిపోయాడు. ఈ సినిమాలో లతా మంగేష్కర్ మూడు పాటలు పాడింది. వీరిద్దరి కాంబినేషన్‌లో సుమారు 240 పాటలు వచ్చాయి. ఇతడు హిందీ సినిమాలలోనే కాక భోజ్‌పురి సినిమాలలో తిరుగులేని దర్శకుడిగా నిరూపించుకున్నాడు. 1970లలో సంగీత ప్రపంచంలో వచ్చిన మార్పులు ఇతడిని హిందీ చిత్రరంగం నుండి పక్కకు నెట్టాయి. 1985లో వచ్చిన "ఘర్‌ద్వార్" ఇతడు సంగీత దర్శకత్వం వహించిన ఆఖరి హిందీ సినిమా. ఇతడు మొత్తం 250 సినిమాలలో 1500 పైచిలుకు పాటలకు బాణీలు కట్టాడు.[1]
సంగీతం అందించిన సినిమాల పాక్షిక జాబితా
మార్చు- లేడీ రాబిన్‌హుడ్ (1946)
- ఫైటింగ్ హీరో (1946)
- తూఫాన్ క్వీన్ (1946)
- జాదూ రతన్ (1947)
- షేక్ హ్యాండ్ (1947)
- స్టంట్ క్వీన్ (1947)
- మాలా ద మైటీ (1948)
- జై హింద్ (1948)
- 11'ఓ క్లాక్ (1948)
- టైగ్రెస్ (1948)
- జోకర్ (1949)
- భక్త్ పుండలీక్ (1949)
- షౌకీన్ (1949)
- ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ (1949)
- జోడీదార్ (1950)
- సర్కస్ వాలే (1950)
- వీర్ బబ్రువాహన్ (1950)
- హమారా ఘర్ (1950)
- హమారీ షాన్ (1951)
- జీవన్ తార (1951)
- సింద్‌బాద్ ది సైలర్ (1952)
- భక్త్ పురాణ్ (1952)
- తరంగ్ (1952)
- నాగపంచమి (1953)
- నయా రాస్తా (1953)
- మన్ చలా(1953)
- మిస్ మాలా (1954)
- సుల్తానత్ (1954)
- తులసీదాస్ (1954)
- శివరాత్రి
- ఆలీబాబా ఔర్ చాలీస్ చోర్ (1954)
- టూటే ఖిలోనే (1954)
- నవరాత్రి (1955)
- శివభక్త (1955)
- సతీ మదాలస (1955)
- రాజ్ కన్య (1955)
- రాజ్ దర్బార్ (1955)
- శ్రీ గణేశ్ వివాహ్ (1955)
- శ్రీకృష్ణ భక్తి (1955)
- మహాసతి సావిత్రి (1955)
- కిస్మత్ (1955)
- బస్రే కి హూర్ (1956)
- బసంత్ పంచమి (1956)
- జిందగీ కి మేలే (1956)
- జై శ్రీ (1956)
- ఇన్సాఫ్ (1956)
- కాప్టెన్ కిషోర్ (1957)
- తల్వార్ కి ధని (1957)
- నీల్ మణి (1957)
- భాభీ (1957)
- లక్ష్మీ పూజ (1957)
- పవన్ పుత్ర హనుమాన్ (1957)
- సాక్షి గోపాల్ (1957)
- టాక్సీ స్టాండ్ (1958)
- డాటర్ ఆఫ్ సింద్‌బాద్ (1958)
- చాల్‌బాజ్ (1958)
- బాల్‌యోగి ఉపమన్యు (1958)
- మాయాబజార్ (1958)
- తీస్రీ గలీ (1958)
- రాజ్ సింఘాసన్ (1958)
- జింబో (1958)
- కంగన్ (1959)
- మేడమ్ X Y Z (1959)
- డాకా (1959)
- కమాండర్ (1959)
- నయా సంసార్ (1959)
- కాలీ టోపీ లాల్ రుమాల్ (1959)
- కల్ హమారా హై (1969)
- గెస్ట్ హౌస్ (1959)
- బర్ఖా (1959)
- చాంద్ మేరే ఆజా (1960)
- మా బాప్ (1960)
- బారాత్ (1960)
- గ్యాంబ్లర్ (1960)
- పతంగ్ (1960)
- నాచే నాగిన్ బాజె బీన్ (1960)
- పోలీస్ డిటెక్టివ్ (1960)
- జింబో కమ్స్ టు టౌన్ (1960)
- బాజీగర్ (1961)
- తేల్ మాలిష్ బూట్ పాలిష్ (1961)
- బడే ఘర్ కి బహూ (1961)
- బడా ఆద్మీ (1961)
- జబక్ (1961)
- రాము దాదా (1961)
- సుహాగ్ సింధూర్ (1961)
- అప్లాం చప్లాం (1962)
- రాకెట్ గర్ల్ (1962)
- కింగ్ కాంగ్ (1962)
- మై చుప్ రహూంగీ (1962)
- షాదీ (1962)
- బేజుబాన్ (1962)
- బ్యాండ్ మాస్టర్ (1963)
- గంగా మయ్యా తోహె పియారీ ఛదైబొ (1962) (భోజ్‌పురి సినిమా)
- మై షాదీ కర్నే చలా (1963)
- హమ్ మత్‌వాలే నౌజవాన్ (1962)
- బర్మా రోడ్ (1962)
- ఘర్ బసాకే ధేకో (1963)
- లాగీ నాహీ ఛుటే రామ్ (1963)
- మమ్మీ డాడీ (1963)
- ఒపేరా హౌస్ (1963)
- కాబూలీ ఖాన్ (1963)
- ఆంఖ్ మిచౌలి (1963)
- ఏక్ రాజ్ (1963)
- బాఘీ (1964)
- గంగా కీ లహరే (1964)
- శ్యాంసన్ (1964)
- మేరే కసూర్ క్యా హై? (1964)
- మై భీ లడ్కీ హూ (1964)
- ఆకాశ్ దీప్ (1965)
- సాత్ సముందర్ పార్ (1965)
- ఊంచే లోగ్ (1965)
- మహాభారత్ (1965)
- ఆధీ రాత్‌కే బాద్ (1965)
- అఫ్సానా (1966)
- బిరాదరి (1966)
- తూఫాన్ మే ప్యార్ కహన్ (1966)
- వాస్నా (1967)
- ఔలాద్ (1968)
- మా (1968)
- ప్యార్ కా సప్నా (1969)
- నయీ జిందగీ (1969)
- బ్యాంక్ రాబరీ (1969)
- పరదేశి (1970)
- సంసార్ (1971)
- కభీ ధూప్ కభీ ఛావ్ (1971)
- హమారా అధికార్ (1971)
- ప్రేమ్ కి గంగా (1971)
- సాజ్ ఔర్ సనమ్ (1972)
- దోస్త్ (1974) (బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్)
- ఇంతెజార్ (1973)
- షిక్వా (1974)
- బాలక్ ఔర్ జాన్వర్ (1975)
- రంగీన్ దునియా (1975)
- అంగారే (1976)
- సిక్కా (1976)
- జై మహలక్ష్మీ మా (1976)
- తూఫాన్ ఔర్ బిజిలీ (1976)
- గాయత్రీ మహిమ (1977)
- అల్లాదీన్ అండ్ ద వండర్‌ఫుల్ లాంప్ (1978)
- ది అడ్వెంచర్స్ ఆఫ్ అలాదీన్ (1979)
- దో షికారి (1978)
- శివ్ శక్తి (1980)
- జ్వాలా దహేజ్ కీ (1982)
- ఫిల్మ్ హి ఫిల్మ్ (1983)
- గంగా కినారే మోరా గావ్ (1984)
- సంత్ రవిదాస్ కి అమర్ కహానీ (1984)
- భయ్యా దూజ్ 1984
- ఘర్ ద్వార్ (1985)
- పియా కే గావ్ (1985)
కొన్ని హిట్ పాటలు
మార్చుఇతడు కంపోజ్ చేసిన అనేక పాటలు హిట్ అయ్యాయి. కులదైవం సినిమాలోని "పదపదవే గాలి పటమా" అనే పాటకు ఇతడు భాభీ సినిమాలో బాణీ కూర్చిన "చల్‌చల్‌రే పతంగ్ మేరీ" అనే పాట మూలం. అలాగే అదే సినిమాలోని "పయనించే ఓ చిలుకా" పాటకు "చల్‌రే చల్ ఉడ్‌జారే పంచీ" అనే పాట ఆధారం.
- ఆదా సే జూమ్‌తే హుయే (సింద్‌బాద్ ది సైలర్)
- ముఝే అప్నీ శరణ్‌మే లేలో రామ్ (తులసీదాస్)
- భగవాన్ తుఝే మై ఖత్ లిఖ్‌తా (మన్ చలా)
- దో దిల్ ధడక్ రహే హై (ఇన్సాఫ్)
- చల్ ఉడ్‌జారే పంఛీ (భాభీ)
- ఏక్ రాత్‌మే దోదో చాంద్ ఖిలే (బర్‌ఖా)
- తేరీ దునియాసే దూర్ (జబక్)
మరణం
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 టి.యస్.రావు (1 January 2002). "యస్.డి.బర్మన్ రెకమెండ్ చేసిన చిత్రగుప్త". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (7): 34–35. Retrieved 17 April 2018.
బయటిలింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో చిత్రగుప్త పేజీ