ఛాంగురే బంగారు రాజా
ఛాంగురే బంగారు రాజా 2023లో విడుదలైన తెలుగు సినిమా.ఆర్.టి టీమ్ వర్క్స్ బ్యానర్‌పై రవితేజ నిర్మించిన ఈ సినిమాకు సతీష్ వర్మ దర్శకత్వం వహించాడు. కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ, రవిబాబు, ఎస్తర్ నోరోన్హా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబరు 10న విడుదల చేయగా[1], సినిమాను సెప్టెంబరు 15న విడుదల చేశారు.[2] ఈ సినిమా అక్టోబరు 27 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
ఛాంగురే బంగారు రాజా | |
---|---|
![]() | |
దర్శకత్వం | సతీష్ వర్మ |
రచన | సతీష్ వర్మ |
నిర్మాత | రవితేజ |
తారాగణం | కార్తీక్ రత్నం గోల్డీ నిస్సీ రవిబాబు ఎస్తర్ నోరోన్హా |
ఛాయాగ్రహణం | సుందర్ ఎన్.సి |
కూర్పు | కార్తీక్ వున్నవా |
సంగీతం | కృష్ణ సౌరభ్ |
నిర్మాణ సంస్థలు | ఆర్.టి టీమ్ వర్క్స్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 15 సెప్టెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- కార్తీక్ రత్నం - బంగార్రాజు
- గోల్డీ నిస్సీ[4] - మంగరత్నం
- రవిబాబు - గాతీలు
- ఎస్తర్ నోరోన్హా - వరలక్ష్మి
- సత్య - తాతారావు
- అజయ్ - ఎస్.ఐ .సన్యాసి రావు
- వాసు ఇంటూరి - చిటికెల అప్పన్న
- నిత్య శ్రీ - సంతోషి
- జబర్దస్త్ అప్పారావు
- రాజ్ తిరందాసు
కథ
మార్చుదుగ్గాడ గ్రామంలో బంగార్రాజు (కార్తీక్ రత్నం) మెకానిక్ గా పని చేసుకుంటూ ఉంటాడు. కానిస్టేబుల్ మంగని (గోల్డీ నిస్సీ) ప్రేమిస్తాడు. ఈ క్రమంలో ఊర్లో రంగు రాళ్ళు వెతికే సోము నాయుడుతో (రాజ్ తిరందాసు) గొడవ అవుతుంది. ఆ తర్వాత సోము నాయుడుని ఎవరో హత్య చేసి చెరువులో పడేస్తారు. ఆ నేరం బంగార్రాజు మీద పడుతుంది. అసలు హత్య ఎవరు చేశారు? దీని కారణంగా బంగార్రాజు జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[5]
సాంకేతిక నిపుణులు
మార్చుమూలాలు
మార్చు- ↑ Desam, A. B. P. (11 September 2023). "మాస్ మహారాజా 'ఛాంగురే బంగారు రాజా' ట్రైలర్ - రంగురాళ్లతో జీవితాలు మారిపోతాయా?". telugu.abplive.com. Archived from the original on 15 సెప్టెంబరు 2023. Retrieved 15 September 2023.
- ↑ Mana Telangana (9 September 2023). "వినాయక చవితి కానుకగా..." Archived from the original on 15 సెప్టెంబరు 2023. Retrieved 15 September 2023.
- ↑ TV9 Telugu (20 October 2023). "ఓటీటీలోకి 'ఛాంగురే బంగారు రాజా'.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ కానుందంటే." Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (14 September 2023). "నా కల నెరవేరుతోంది". Archived from the original on 15 సెప్టెంబరు 2023. Retrieved 15 September 2023.
- ↑ Eenadu (15 September 2023). "రివ్యూ: ఛాంగురే బంగారురాజా". Archived from the original on 15 సెప్టెంబరు 2023. Retrieved 15 September 2023.
- ↑ TV9 Telugu (13 September 2023). "రవితేజ నిర్మాణంలో `ఛాంగురే బంగారు రాజా`.. హీరో కార్తిక్ రత్నం మాటల్లో సినిమా విశేషాలు." Archived from the original on 15 సెప్టెంబరు 2023. Retrieved 15 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)