సత్య (నటుడు)
సత్య తెలుగు చిత్రరంగానికి చెందిన హాస్య నటుడు. ఆయన సినిరంగంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రస్థానం ప్రారంభించి హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షోలో ధన్‌రాజ్ టీంలో పనిచేశాడు.[2]
సత్య | |
---|---|
జననం | సత్య అక్కల[1] |
వృత్తి | సినిమా నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2009 - ప్రస్తుతం |
జననం & విద్యాభాస్యం
మార్చుసత్య అమలాపురం[3], ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆయన బి.వి.సి ఇన్స్టిట్యూట్ ఓ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కాలేజీలో బి.టెక్ మధ్యలోనే చదువు ఆపేసాడు. ఆయన సినీరంగంపై మక్కువతో 2005లో హైదరాబాదు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి "ద్రోణ" చిత్రానికి, అమృతం సీరియల్ కి పనిచేసాడు.[4]
సినీ ప్రస్థానం
మార్చుసుధీర్వర్మ దర్శకత్వం వహించిన " పిల్లజమిందార్" సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నపుడు ఆ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాడు, ఆయన చేసిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. సుధీర్‌వర్మ తరువాతి సినిమాలో ‘స్వామిరారా’లో ముఖ్య పాత్రలో నటించిన ఆయన ఇక వెనకకు తిరిగి చూడలేదు.[5][6] వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రభస, రౌడీ ఫెలో, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, స్పీడున్నోడు, మజ్ను, జై లవకుశ, ప్రేమమ్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కాయి.[7]
సత్య 2021లో రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన 'వివాహ భోజనంబు' ద్వారా హీరోగా పరిచమయ్యాడు.
నటించిన సినిమాలు
మార్చుపురస్కారాలు
మార్చు- 2018: సైమా ఉత్తమ హాస్యనటుడు - ఛలో
మూలాలు
మార్చు- ↑ "Naga Shaurya's Aswathama Movie Review & Rating {2.75/5}". The Hans India. 2020-01-31. Retrieved 2020-09-15.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "'జబర్దస్త్' నుంచి తప్పుకోవడానికి కారణమిదే: కమెడియన్ సత్య". Suryaa. Retrieved 2020-09-15.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "మాది అమలాపురమండి.. ఆయ్!". Sakshi. 2017-12-11. Retrieved 2020-09-15.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Eenadu (2 January 2022). "మూడు రోజులు మంచినీళ్లు మాత్రమే తాగి." Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
- ↑ Chowdary, Y Sunita (22 November 2018). "Comedian Satya has no qualms about his modest screen time in Telugu cinema". The Hindu.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "కమెడియన్ సత్య సినీ జర్నీ : ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో వేణుమాధవ్ సినిమా కోసం వెళ్తే." News18 Telugu. 2019-11-10. Retrieved 2020-09-15.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Eenadu (2020). "మూడు రోజులు మంచినీళ్లు తాగి గడిపా". Archived from the original on 6 February 2020. Retrieved 6 February 2020.