ఛోటా ఉదయపూర్, భారతదేశం గుజరాత్ రాష్ట్రం లోని ఛోటా ఉదయపూర్ జిల్లా లోని ఒక పట్టణం, పురపాలకసంఘం. ఇది ఛోటా ఉదయపూర్ జిల్లాకు ప్రధానకార్యాలయం. ఛోటా ఉదయపూర్ నిజానికి భిల్ రాజుచే పాలించబడింది. కాలియా భిల్ సాశ.1484లో ఛోటా ఉదయపూర్ ను పాలించిన చివరి భిల్ రాజు. [1] ఛోటా ఉదయ్‌పూర్ పూర్వపు ఛోటా ఉదయపూర్ రాష్ట్రానికి రాజధాని. దీనిని 1743లో చంపానేర్‌కు చెందిన పటై రావల్ వంశస్థుడైన రావల్ ఉదేసిన్హ్జీ స్థాపించాడు. ఈ రాష్ట్రం రేవా కాంత్ నిర్వహణ కింద మొదటి తరగతి రాష్ట్రంగా ఉంది. ఇది 1948 మార్చి 10న భారతదేశ ఆధిపత్యంలో విలీనంచేయబడింది.

Chhota Udaipur
Town
Chhota Udaipur is located in Gujarat
Chhota Udaipur
Chhota Udaipur
Location in Gujarat, India
Chhota Udaipur is located in India
Chhota Udaipur
Chhota Udaipur
Chhota Udaipur (India)
Coordinates: 22°18′20″N 74°0′50″E / 22.30556°N 74.01389°E / 22.30556; 74.01389
Country India
StateGujarat
DistrictChhota Udaipur
జనాభా
 (2011)
 • Total25,787
Languages
 • OfficialGujarati, Hindi
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationGJ-34

పాలకులు (బిరుదు మహారాజా మహారావాల్)

మార్చు
 
ఛోటా ఉదయపూర్ రాష్ట్ర సైనికుల చిహ్నం.
  • 1762 – 1771 అర్సిసిన్హ్జీ
  • 1771 – 1777 హమీర్‌సిన్హ్జీ II
  • 1777 – 1822 భీంసింహజీ
  • 1822 - 1851 గుమాన్‌సిన్హ్జీ
  • 1851 - 1881 జిట్సిన్హ్జీ
  • 1881 - 1895 మోతిసిన్హ్జీ
  • 1895 – 29 ఆగస్టు 1923 ఫతేసిన్హ్జీ (జ.1884 – మ.1923)
  • 1923 ఆగస్టు 29 –1946 అక్టోబరు 15 నట్వర్‌సిన్హ్జీ ఫతేసిన్హ్జీ (జ.1906 – మ. 1946)
  • 15 అక్టోబరు 1946 –1947 ఆగస్టు 15 వీరేంద్రసిన్హ్జీ (జ.1907- మ 2005 జూన్ 27)

సంస్కృతి

మార్చు

కాళీ నికేతన్ (నహర్ మహల్) ప్యాలెస్, పూర్వపు రాజకుటుంబం వేసవి నివాసంగా నిర్మించాడు. ఇది ఛోటా ఉదయపూర్‌లోని ఒక ప్రముఖ స్మారక చిహ్నం. ఛోటా ఉదయపూర్ నగరం, చుట్టుపక్కల ఉన్న రథ్వాలకు ప్రసిద్ధి చెందింది. రథ్వాలు పిథోరా పెయింటింగ్‌కు ప్రసిద్ధి చెందారు. సాధారణంగా గ్రామ గృహాల గోడలపై వేస్తారు. ఛోటా ఉదయపూర్ గిరిజన సంగ్రహశాలలో గిరిజన కళాఖండాల పెద్ద సేకరణ ఉంది. అనేక గిరిజన కళాఖండాలు నగరం, సమీప గ్రామాలలో తయారు చేస్తారు. వాటిలో తలకు ధరించే టోపీలు వారపు సంతలలో అమ్మకానికి వస్తాయి.

మూలాలు

మార్చు
  1. मीणा, गंगा सहाय. आदिवासी साहित्‍य पत्रिका: अंक-9. Ganga Sahay Meena.

వెలుపలి లంకెలు

మార్చు