హిందీ

భారతదేశపు భాష
(Hindi language నుండి దారిమార్పు చెందింది)

హిందీ భాష (దేవనాగరి: हिन्दी) ఉత్తర, మధ్య భారతదేశములో మాట్లాడే ఒక భాష. అనేక మంది హిందీయేతర భారతీయులు కూడా భ్రమ పడుతున్నట్లుగా హిందీ భారతదేశ జాతీయ భాష (దేశ భాష) కానే కాదు. దేశ భాష అనే హోదాను రాజ్యాంగం ఏ భాషకూ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ దేశం వివిధ సంస్కృతులు, భాషలు కలిగిన అనేక రాజ్యాల కలయిక. ఇండో-ఆర్యన్ ఉప కుటుంబానికి చెందిన ఇండో-యూరోపియన్ భాష. మధ్యయుగమునకు చెందిన ప్రాకృత మధ్య యుగపు ఇండో-ఆర్యన్ భాషల నుండి, పరోక్షంగా సంస్కృతము నుండి ఉద్బవించింది. హిందీ సాంకేతిక, పుస్తక యొగ్యమైన పదజాలమంతా చాలా మటుకు సంస్కృతము నుండి పొందింది. ఉత్త్రర భారతదేశములో ముస్లిం ప్రభావము వలన పర్షియన్, అరబిక్, టర్కిష్ పదాలు హిందీలో చేరి ఉర్దూ భాష పుట్టింది. ప్రామాణిక ("శుద్ధ") హిందీ ప్రసంగాలలో, రేడియో, టి.వి. వార్తలలో వాడబడుతుంది. రోజువారీ భాష మటుకు చాలా రకాలుగా ఉండే హిందుస్తానీ భాష రకము. బాలీవుడ్ సినిమాలలో ఈ విషయము కనిపెట్టవచ్చును.

హిందీ భాష
हिन्दी, हिंदी
మాట్లాడే దేశాలు: భారతదేశం, పాకిస్తాన్, దక్షిణ ఆఫ్రికా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు,యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, ఫిజి, మాల్దీవులు, కెనడా, మయన్మార్, న్యూజీలాండ్, జింబాబ్వే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 
ప్రాంతం: భారత ఉపఖండము
మాట్లాడేవారి సంఖ్య: ca. 490 million native, 790 million total 
ర్యాంకు: 3
భాషా కుటుంబము:
 Indo-Iranian
  Indo-Aryan
   Central zone
    Western Hindi
     Hindustani
      హిందీ భాష 
వ్రాసే పద్ధతి: Devanagari script 
అధికారిక స్థాయి
అధికార భాష:  భారతదేశం,  Fiji(as Hindustani)
నియంత్రణ: Central Hindi Directorate [1]
భాషా సంజ్ఞలు
ISO 639-1: hi
ISO 639-2: hin
ISO 639-3: hin
Indic script
Indic script
This page contains Indic text. Without rendering support you may see irregular vowel positioning and a lack of conjuncts. More...
Hindi speaking areas in India

భాషా శాస్త్రజ్ఞులు హిందీ, ఉర్దూ లను, ఒకటే భాష కానీ హిందీను దేవనాగరి లిపిలోను, ఉర్దూను పర్షియన్ లిపిలోను వ్రాయడము మాత్రమే తేడా అని భావిస్తారు. భారత విభజనకు ముందు హిందీ, ఉర్దూలను ఒకటే భాషగా భావించేవారు కాబట్టి ఈ తేడా చాలా మటుకు రాజకీయము అని కూడా చెప్పవచ్చు.

కేంద్ర ప్రభుత్వ రెండు అధికార భాషల్లో హిందీ ఒకటి. కేంద్ర ప్రభుత్వంలో ఆంగ్లాన్ని కూడా తొలగించి హిందీని మాత్రమే దేశమంతటా ఉపయోగించేలా చేయాలని తొలుత రాజ్యాంగంలోనే రాసినా, ఇందుకు హిందీయేతర భారతీయులు ఒప్పుకోకపోతుండటంతో ఆ లక్ష్యం ఇప్పటికైతే నేరవేరలేదు. అయితే అఖిల భారత స్థాయిలో ఎంపికలు జరిగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీ వాళ్ళకు ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనీ, దీనికి కారణం అనేక రకాల పరీక్షలను కేవలం ఇంగ్లీషు, హిందీల్లో మాత్రమే పెడుతుండటమేననే ఆరోపణ ఎప్పటినుంచో ఉంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్నవైనప్పటికీ వాటిలో ఉద్యోగాలకైతే ఆంగ్లంతోపాటు హిందీ కూడా రావడం తప్పనిసరి చేశారు. దీంతో అలాంటి సంస్థల్లోనైతే అత్యధిక శాతం ఉద్యోగాలు కేవలం హిందీ వాళ్ళకే దక్కుతున్నాయని హిందీయేతర భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఈ పద్ధతి మారాలని సామాజిక మాధ్యమాల్లో యువత పోస్టులు పెట్టడం ఈమధ్య సాధారణమైపోతోంది.

హిందీ సాహిత్యం

మార్చు

హిందీ సాహిత్య చరిత్రలో సా.శ. 1318 నుండి 1643 వరకు భక్తి యుగంగా ఆచార్య రామచంద్ర శుక్లా భావించారు. వీరిలో రామ భక్తులు కొందరు కాగా మరికొందరు కృష్ణ భక్తులు.

రామభక్తులు
  • తులసీదాసు నొ మమెస్ ఉఎ పెదొ చొన్ ఎస్త ఎస్చ్రితుర మనీచ
  • అగ్రదాసు
  • నాబాధాసు
  • సేనాపతి
  • కేశవదాసు
కృష్ణభక్తులు
  • సూరదాసు

తెలుగు భాషలో ఉన్న హిందీ పదములు

మార్చు
  • నాజూకు - హి.నాజూక్ (సన్నగా, వయ్యారంగా)
  • బే, భయ్యా, భాయ్, భాయి, భే - హి.బే, భయ్యా, భాయ్, భాయి, భే (అన్న, అన్నయ్య, తమ్ముడు)

ఇవీ చూడండి

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=హిందీ&oldid=4364412" నుండి వెలికితీశారు