జగదీశ్ భగవతి

ఆర్థికవేత్త

1934లో జన్మించిన జగదీశ్ భగవతి భారత దేశపు వర్థమాన ఆర్ధిక వేత్తలలో ప్రముఖుడు. స్వేచ్ఛా ఆర్థిక విధానానికి సంబంధించి ఇతను ఎన్నో రచనలు చేశారు. 1991లో మనదేశం స్వేచ్ఛా ఆర్థిక విధానాలు పాటించినప్పుడు దానికి విధివిధానాలను రూపొందించినది ఇతనే. ఒకప్పుడు జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిప్ (గాట్) డైరెక్టర్ కు ఆర్థిక సలహా దారుడిగా పనిచేశాడు.ఆర్థిక స్వేచ్ఛా ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమౌతుందని ఇతని అభిప్రాయం. భగవతి రచించిన గ్రంథాలలో ఇండియా-ప్లానింగ్ పర్ ఇండస్ట్రియలైజేషన్ ముఖ్యమైనది. 2000లో పద్మవిభూషణ పురస్కారం పొందాడు.