జగన్మోహన్ ప్యాలెస్
జగన్మోహన్ ప్యాలెస్, కర్ణాటకలోని మైసూర్ నగరంలో ఉన్న ప్యాలెస్. ఈ ప్యాలెస్ నిర్మాణం 1861లో పూర్తయింది. మైసూరు మహారాజులైన ఒడయార్లు మొదటగా ఈ ప్యాలెస్ ను ఉపయోగించారు. ప్రస్తుతం దీనిని కళా ప్రదర్శనశాల గాను, ఫంక్షన్ హాల్ గానూ వాడుతున్నారు. మైసూరులోని 7 రాజభవనాల్లో ఇది ఒకటి. ఒడయార్లు తమ కాలంలో నిర్మించిన ఈ భవనం ఎంతో అందంగా ఉంటుంది. ఈ రాజకుటుంబం మైసూరులోనే కాక, బెంగుళూరు వంటి ప్రదేశాల్లో కూడా ఎన్నో కట్టడాలను నిర్మించడం విశేషం.
చరిత్ర
మార్చుజగన్మోహన్ ప్యాలెస్ ను మూడవ కృష్ణరాజ ఒడయార్ 1861 లో నిర్మించాడు.[1] రాజకుటుంబ నివాసమైన మైసూరు ప్యాలెస్ అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. దాని స్థానంలో కొత్త ప్యాలెస్ నిర్మాణం 1897 లో మొదలైంది. 1912 లో ఈ కొత్త ప్యాలెస్ నిర్మాణం పూర్తయ్యే వరకూ రాజకుటుంబం జగన్మోహన్ ప్యాలెస్‌నే తమ నివాసంగా వాడారు.[2] 1902 లో రాజర్షి నలవాది కృష్ణరాజ ఒడయార్ మైసూరు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ పట్టాభిషేకం జగన్మోహన్ ప్యాలెస్ లోనే జరిగింది. అప్పటి బ్రిటిషు వైస్రాయ్, గవర్నర్ జనరలూ కర్జన్ కూడా హాజరయ్యాడు. రాజు ఈ భవనాన్ని తన రోజువారీ దర్బరుగా వాడాడు. దసరా ఉత్సవాల సమయంలో కూడా దర్బారుగా దీన్నే వాడాడు. 1915 లో ఈ ప్యాలెసును కళా ప్రదర్శన శాలగా మార్చారు. 1955 లోదీన్ని జయచామరాజేంద్ర ఒడయార్ పేరిట దీనికి శ్రీ జయచామరాజేంద్ర ఆర్ట్ గ్యాలరీ అని పేరు పెట్టారు. మైసూరు విశ్వవిద్యలయపు తొలి స్నాతకోత్సవాలు ఈ ప్యాలెస్ లోనే జరిగాయి. 1907 జూలైలో మైసూరు రాష్ట్ర శాసనమండలి తొలి సమావేశాలు ఇక్కడే జరిగాయి[3] శాసనమండలిని అప్పట్లో ప్రతినిధుల మండలి (రిప్రజెంటేటివ్ కౌన్సిల్) అనేవారు. దీనికి దివాన్ (రాష్ట్ర ప్రధానమంత్రి) అధ్యక్షత వహించేవారు. జయచామరాజేంద్ర ఒడయార్ దీన్ని ఒక ట్రస్టుగా మార్చి ప్రజల సందర్శనకు తెరిచాడు.[4]
వాస్తుశైలి
మార్చుప్యాలెస్ను సాంప్రదాయిక హిందూ నిర్మాణ శైలిలో నిర్మించారు. 1900 లో బయట ఒక ప్రంగణాన్ని దాని వెనక ఒక హాలునూ నిర్మించారు. దానిపై హిందూ దేవతల శిల్పాలు చెక్కారు.[5] ఒడయార్ల వంశవృక్షాన్ని కూడా ఒక గోడపై చిత్రించారు.[5] దశావతారాలను చిత్రించిన రెండు చెక్కలు కూడా అందులో ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ "Jaganmohan Palace".
- ↑ Priyanka Haldipur. "Of Monumental value". Online Edition of The Deccan Herald, dated 2005-04-19. Archived from the original on 15 అక్టోబరు 2007. Retrieved 23 జూన్ 2020.
- ↑ "Jaganmohana Palace". Online webpage of the Mysore district. Archived from the original on 13 September 2007. Retrieved 2007-09-20.
- ↑ "Upper House turns 100". Online Edition of The Deccan Herald, dated 2007-07-06. Archived from the original on 6 April 2012. Retrieved 2007-09-20.
- ↑ 5.0 5.1 R Krishna Kumar (2004-10-11). "Priceless souvenirs of Mysore Dasara". Online Edition of The Hindu, dated 2004-10-11. Chennai, India. Archived from the original on 2004-11-03. Retrieved 2007-09-20.