జనమేజయుడు మహాభారతంలో పరీక్షిత్తు కుమారుడు. అర్జునునికి ముని మనుమడు. వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుడు ఇతనికి మహాభారత కథను వినిపించెను. మహాభారతంలో చెప్పినట్లుగా జనమేజయుడికి ఆరు మంది అన్నదమ్మలు. వారు కక్ష సేనుడు, ఉగ్ర సేనుడు, చిత్ర సేనుడు, ఇంద్రసేనుడు, సుశేణుడు, నఖ్యశేనుడు.[1] తండ్రి పరీక్షిత్తు మరణించగానే జనమేజయుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్టించాడు. తన తండ్రి మరణానికి తక్షకుడు కారణమని తెలుసుకొని సర్పములపై కోపము చెంది సర్పజాతిని సమూలంగా నాశనం చేయడానికి సర్పయాగము చేయడానికి సంకల్పించాడు. ఈ యాగం ప్రారంభం కానుండగా వ్యాస మహర్షి మిగతా ఋషులతో కలిసి వస్తాడు. కేవలం శాపాన్ని నెరవేర్చడానికి మాత్రమే తక్షకుడు పరీక్షత్తును చంపిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సర్పజాతినీ మొత్తం నాశనం చేయ సంకల్పించడం, పాండవుల వారసుడిగా నీకు తగదని జనమేజయుడికి హితవు పలికారు. దాంతో జనమేజయుడు ఆ యాగాన్ని ఆపు చేయించాడు. తన పూర్వీకుల గురించి తెలుసుకోవడానికి ఉత్సుకత చూపడంతో ఎక్కడైతే యాగం చేయ సంకల్పించాడో అక్కడే వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారతం వినిపించాడు. మహభరథ్

సర్ప యాగము చేయుచున్న జనమేజయుడు

మూలాలుసవరించు

  1. Journal of the Department of Letters by University of Calcutta (Dept. of Letters),Publ.Calcutta University Press, 1923, p2
మహాభారతం - ఆంధ్ర మహాభారతం - వ్యాసుడు - కవిత్రయం

పర్వాలు

ఆది పర్వము  • సభా పర్వము  • వన పర్వము లేక అరణ్య పర్వము  • విరాట పర్వము  • ఉద్యోగ పర్వము  • భీష్మ పర్వము  • ద్రోణ పర్వము  • కర్ణ పర్వము  • శల్య పర్వము  • సౌప్తిక పర్వము  • స్త్రీ పర్వము  • శాంతి పర్వము  • అనుశాసనిక పర్వము  • అశ్వమేధ పర్వము  • ఆశ్రమవాస పర్వము  • మౌసల పర్వము  • మహాప్రస్ధానిక పర్వము  • స్వర్గారోహణ పర్వము  • హరివంశ పర్వము

పాత్రలు
శంతనుడు | గంగ | భీష్ముడు | సత్యవతి | చిత్రాంగదుడు | విచిత్రవీర్యుడు | అంబ | అంబాలిక | విదురుడు | ధృతరాష్ట్రుడు | గాంధారి | శకుని | సుభద్ర | పాండు రాజు | కుంతి | మాద్రి | యుధిష్ఠిరుడు | భీముడు | అర్జునుడు | నకులుడు | సహదేవుడు | దుర్యోధనుడు | దుశ్శాసనుడు | యుయుత్సుడు | దుస్సల | ద్రౌపది | హిడింబి | ఘటోత్కచుడు | ఉత్తర | ఉలూపి | బభృవాహనుడు |అభిమన్యుడు | పరీక్షిత్తు | విరాటరాజు | కీచకుడు | ద్రోణుడు | అశ్వత్థామ | ఏకలవ్యుడు | కృతవర్మ | జరాసంధుడు | సాత్యకి | దుర్వాసుడు | సంజయుడు | జనమేజయుడు | వేదవ్యాసుడు | కర్ణుడు | జయద్రధుడు | శ్రీకృష్ణుడు | బలరాముడు | ద్రుపదుడు | | దృష్టద్యుమ్నుడు | శల్యుడు | శిఖండి | సుధేష్ణ
ఇతర విషయాలు
పాండవులు | కౌరవులు | హస్తినాపురం | ఇంద్రప్రస్థం | రాజ్యాలు | కురుక్షేత్ర యుద్ధం | భగవద్గీత