జన గణ మన (2022 సినిమా)

మలయాళం అనువాద సినిమా

జన గణ మన 2022లో విడుదలైన మలయాళం సినిమా. పృథ్వీరాజ్‌ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌లపై పృథ్వీరాజ్‌ సుకుమారన్, లిస్టిన్‌ స్టీఫెన్‌ నిర్మించిన ఈ సినిమాకు డిజో జోస్‌ ఆంటోని దర్శకత్వం వహించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్‌ వెంజరమూడ్‌, మమతామోహన్‌ దాస్‌, జీఎమ్‌ సుందర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్‌ 2న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలైంది.[1]

జన గణ మన
దర్శకత్వండిజో జోస్‌ ఆంటోని
రచనషరీస్ మహమ్మద్
నిర్మాతసుప్రియ మీనన్
లిస్టిన్‌ స్టీఫెన్‌
తారాగణంపృథ్వీరాజ్ సుకుమారన్
సూరజ్‌ వెంజరమూడ్‌
మమతామోహన్‌ దాస్‌
Narrated byమమ్మూట్టి
ఛాయాగ్రహణంసుదీప్ ఎల్మోన్
కూర్పుశ్రీజిత్ సారంగ్
సంగీతంజేక్స్ బిజోయ్
నిర్మాణ
సంస్థలు
పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్
మ్యాజిక్ ఫ్రేమ్స్
విడుదల తేదీ
ఏప్రిల్ 28, 2022 (2022-04-28)
సినిమా నిడివి
165 నిముషాలు
దేశంభారతదేశం
భాషలు
  • మలయాళం
  • ఇంగ్లీష్

ఓ యూనివర్సిటీ లెక్చరర్ సభా మరియం (మమతా మోహన్ దాస్)ను రేప్ చేసి, కాల్చి చంపేశారంటూ మీడియాలో నేషనల్ హెడ్డింగ్ అవుతుంది. తమ టీచర్‌కు న్యాయం జరగాలని రోడ్డు మీదకు యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగుతారు. ఈ కేసును ఛేదించేందుకు ఏసీపీ సజ్జన్ (సూరజ్ వెంజరమూడు) రంగంలోకి దిగి నలుగురు నిందితులను పట్టుకొని వారిని ఎన్ కౌంటర్ చేస్తాడు. న్యాయ స్థానంలో ఆ నిందితులను ప్రవేశ పెట్టకుండా ఎన్ కౌంటర్ ఎలా చేస్తారంటూ న్యాయవాది అరవింద్ స్వామినాథన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) కేసును వాదిస్తాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి? అసలు ఏసీపీ సజ్జన్ ఆ ఎన్ కౌంటర్ ఎందుకు చేశాడు? సభా మరియం ఎలా చనిపోయింది? ఆమె చావుకు గల కారణం ఏంటి ? అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (12 June 2022). "ప్రొఫెసర్‌ను చంపిందెవరు?". Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.
  2. NTV (6 June 2022). "జన గణ మన (మళయాళం)/ జన 2022 (తెలుగు డబ్బింగ్)". Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.
  3. Sakshi (5 June 2022). "వ్యవస్థల తీరుపై ప్రశ్నల వర్షం.. 'జన గణ మన' రివ్యూ". Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.

బయటి లింకులు

మార్చు